EPAPER

Chalasani Srinivas: పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీవే: చలసాని శ్రీనివాస్

Chalasani Srinivas: పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీవే: చలసాని శ్రీనివాస్

Chalasani Srinivas: ఏడు మండలాల విలీన వివాదంపై ఏపీ ప్రత్యేక సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నది అవాస్తం అని అన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని..రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో ఉందని తెలిపారు. విభజన ఆస్తులపై ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


ఎన్టీఏ ప్రభుత్వం ఏపీపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించారని తెలిపారు. విభజన హామీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై దుర్మార్గంగా వ్యవహరించిందని  మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కారం చేయాల్సింది కేంద్రమేనన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు.

ఎన్టీఏ ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని అన్నారు. ముంపు గ్రామాలన్నీ ఏపీలో భాగమే అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో పంతాలకు పోవద్దని హితవు పలికారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు సమావేశం కావడాన్ని స్వాగతిస్తున్నామని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇద్దరూ సీఎంలు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మక అంశాలుగా ఉండాలని తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.


Also Read: ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌

ఏపీ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ముంపు పునరావాస సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని, విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. షెడ్యూల్ 9,10 లోని ఉమ్మడి ఆస్తుల పంపకం, కృష్ణ జలాలను సామరస్యంగా పరిష్కారించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు రెండు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లకుండా ఒకే మాటపై ఉండాలని కోరారు.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×