EPAPER

CBI Seizes Drugs At Vizag Port: ఆ డ్రగ్ కంటైనర్ ఏ పార్టీది? సీబీఐ ఏం చెబుతోంది?

CBI Seizes Drugs At Vizag Port: ఆ డ్రగ్ కంటైనర్ ఏ పార్టీది? సీబీఐ ఏం చెబుతోంది?
Vizag port
CBI Seizes 25k Kilos  Cocaine At Vizag Port (Ap news today telugu) : కాదేది కవితకనర్హం.. పాతమాట.. కాదేది రాజకీయానకనర్హం.. కొత్తమాట అని చెప్పలేం కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్.. కాదంటే విశాఖ కంటైనర్ డ్రగ్స్‌ ఇష్యూను అబ్జర్వ్‌ చేయండి.. అసలింతకి సీబీఐ ఆపరేషన్‌ గరుడ ఏంటి? సీల్ తీసిన కంటైనర్‌లో బయటపడ్డ డ్రగ్స్ ఎంత? డ్రగ్స్ తెప్పించిందిదెవరు? ఇప్పుడీ అంశం ఏపీ పాలిటిక్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగానే ఈ డ్రగ్స్‌ ఏపీ ఎన్నికల ఫలితాలను షేక్ చేస్తాయా?

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కంపెనీ బ్రెజిల్ నుంచి ఫీడ్ ఆర్డర్ చేసింది. జనవరి 14న అక్కడి నుంచి షిప్ బయల్దేరింది.


రెండు నెలల పాటు సముద్రంలో జర్నీ చేసింది. ఈ నెల 16న విశాఖ పోర్టుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో షిప్‌లోని ఓ కంటైనర్‌లో.. భారీగా డ్రగ్స్ ఉన్నట్టు ఇంటర్‌పోల్‌కు ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. ఆ ఇన్ఫర్మేషన్‌ ఇండియన్ ఏజెన్సీసీస్‌కు రావడం.. సీన్‌లోకి సీబీఐ ఎంటరవ్వడం.. ఆపరేషన్‌ గరుడను స్టార్ట్ చేసింది.. ఈ నెల 19న విశాఖలో ల్యాండయ్యింది సీబీఐ స్పెషల్ టీమ్.. కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుంది.టెస్ట్‌లు చేస్తే డ్రగ్స్‌ ఉన్న విషయం నిజమే అన్నది కన్ఫామ్ అయ్యింది.ఇక్కడ మొదలైంది రాజకీయ రగడ..

Also Read: సంధ్య ఆక్వా కంపెనీపై సీబీఐ దాడులు, ఇది డ్రగ్ కాదు.. రొయ్యల కోసమే


అసలు డ్రగ్స్ ఎవరు పంపారు? ఎవరికి పంపారు?ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది ఈ దందా? ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ అసలు కంటైనర్‌లోకి ఎలా చేరాయి? వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఎలా సప్లై చేద్దామనుకున్నారు? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే పనిలో ఉంది సీబీఐ.వచ్చింది బ్రెజిల్ నుంచి.. తీసుకొచ్చింది చైనా షిప్‌లో.. ఆర్డర్ ఇచ్చింది విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ.. కంపెనీ ఏమో 25 కేజీల చొప్పున ఉన్న వెయ్యిబస్తాల డ్రై ఈస్ట్ ఆర్డర్ ఇచ్చామంటోంది. అంతకుమించి తమకు ఏం తెలియదు.. ఇది కంపెనీ మాట.. NCB డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్ట్‌ చేస్తే.. అన్నింటిలోనూ కొకైన్, మెధాక్వలైన్ ఉన్నట్టు కన్ఫామ్ చేసింది సీబీఐ.. ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది..

కానీ ఏపీ పొలిటికల్ లీడర్స్‌ సీబీఐ కంటే ఫాస్ట్ కాబట్టి.. ఈ డ్రగ్స్‌కు ఎవరికి సంబంధించినవో కనిపెట్టేశారు.. కంటైనర్ తెప్పించింది మీరంటే మీరని..అటు వైసీపీ, ఇటు టీడీపీ డైలాగ్‌ వార్‌, ట్వీట్‌ వార్ ప్రారంభించేశాయి. వైసీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్ర అధికారులు సీబీఐకు సహకరించడం లేదు. కంటైనర్‌ తెరవకుండా ఉండేందుకు ప్రయత్నించారు.. ఇది టీడీపీ నేతల మాటలు..

దీనికి కౌంటర్‌గా వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.. కంటైనర్ డెలివరి తీసుకున్న కంపెనీకి పురంధేశ్వరి బంధువులకు సంబంధాలు ఉన్నాయి.. టీడీపీ నేతలు కావాలనే తఆరోపణలు చేస్తున్నారు..
డ్రగ్స్‌ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి.. తప్పు చేసి రివర్స్‌లో తమపైనే ఆరోపణలు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రగ్స్‌కు టీడీపీ నేతలకే లింకులు ఉన్నాయి. ఓటర్లకు డబ్బులు పంచడానికే ఈ డ్రగ్స్ తెప్పించారు. సంధ్య కంపెనీపై గతంలోనే కేసులు పెట్టాం. ఇది వైసీపీ వర్షన్..

Also Read: మూడో జాబితాలో సీనియర్లకు మొండి చేయి

అసలు కేసు విచారణ తేలకముందే ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించుకుంటున్నారు ఏపీ నేతలు.. వైజాగ్‌ పోలీసులేమో సీబీఐ అధికారులకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాం.. తమపై లేనిపోని ఆరోపణలు వద్దు అంటున్నారు..

ఇలా ఎవరి వర్షన్ ఎలా ఉన్నా.. కథంతా సంధ్యా ఆక్వా కంపెనీ చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఆ కంపెనీ డైరెక్టర్‌, ప్రతినిధులను సీబీఐ టీమ్ క్వశ్చన్ చేసింది. కానీ సరైన సమాధానాలు రాలేదని సీబీఐ టీమ్..
తాము మాత్రం ఆక్వా ఫుడ్‌ను మాత్రమే ఆర్డర్‌ చేశామని చెబుతోంది కంపెనీ. అందరు దొరలే అయితే.. గుమ్మడికాయలను ఎత్తుకెళ్లింది ఎవరు? డ్రగ్స్‌ ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎవరు తెప్పించారు? ఎక్కడికో వెళ్లాల్సిన కంటైనర్.. దారి తప్పి వైజాగ్‌కు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సీబీఐ సమాధానం కనుగొనేలోపు.. ఏపీలో పార్టీల సిగపట్లు పీక్స్‌కు చేరడం మాత్రం ఖాయం.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×