EPAPER

CBI Court: సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

CBI Court: సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

YS Jagan mohan reddy latest news(Political news in AP):

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. అయితే జగన్ లండన్,
స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కోర్టును కోరింది.


అయితే ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని సీఎం జగన్ ను ఆదేశించింది. విదేశాలకు వెళ్లడం కోసం సీబీఐ కోర్టులో సీఎం జగన్ వారం క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: భగ్గుమన్న పల్నాడు ఫ్యాక్షన్.. టీడీపీ కార్యకర్తలపై దాడులు.. సీఐకి గాయాలు


ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి వెంట వెళ్లనున్నారు. అయితే జగన్ పై పలు కోర్టుల్లో కేసులు ఉండటంతో విదేశాలకు వెళ్లకుండా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారు.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×