EPAPER

Avinash Reddy: బెయిలా? అరెస్టా?.. హైకోర్టులో హోరాహోరీ వాదనలు..

Avinash Reddy: బెయిలా? అరెస్టా?.. హైకోర్టులో హోరాహోరీ వాదనలు..
avinash reddy high court

Avinash Reddy Latest News(Andhra Pradesh today news): వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టులో సీబీఐ వాదనలు జరుగుతున్నాయి. శుక్రవారం అవినాష్ తరఫు లాయర్లు, సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాజాగా, సీబీఐ తన వాదన వినిపిస్తోంది. విచారణకు అసలు అవినాష్ సహకరించడం లేదని.. ఎప్పుడు నోటీసులు ఇచ్చినా సమయం కావాలని కోరుతున్నారని.. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని.. సీబీఐ తరఫు లాయర్ కోర్టులో వాదిస్తున్నారు.


నిందితులు రెండు రకాల నేరాలకు పాల్పడ్డారని.. ఒకటి వివేకా హత్యకు కుట్ర.. మరోకటి క్రైమ్ సీన్ డిస్ట్రక్షన్. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్టు కాదు.. ఈ కేసులో ఇప్పటివరకు ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్‌కు ఏమిటి? రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం అంటోంది సీబీఐ.

హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందని.. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారని.. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారని కోర్టుకు తెలిపారు సీబీఐ తరఫు లాయర్. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారని.. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారని.. శత్రువుకి శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారని సీబీఐ వాదిస్తోంది.


జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయినా అవినాష్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటోంది. అందుకే, ముందస్తు బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తే.. అవినాష్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తామని.. అప్పుడే జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని కోర్టుకు తెలిపింది సీబీఐ.

సీబీఐ వాదనలు అలా ఉంటే.. శుక్రవారం ఎంపీ అవినాష్‌ రెడ్డి తరఫు లాయర్లు తమ వెర్షన్ వినిపించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌ను టార్గెట్‌గా చేసుకొని సీబీఐ విచారణ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుమార్లు అవినాశ్‌ విచారణకు హాజరైనా మళ్లీ రావాలంటూ తీవ్రంగా వేధిస్తున్నారని.. హత్య చేసిన నలుగురికి వివేకాతో విభేదాలున్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు దస్తగిరి విషయంలోనూ సీబీఐ తీరు ఇలాగే ఉందన్నారు. దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా వివేకా కుమార్తె సునీత పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. కిరాయి హంతకుడు దస్తగిరికి పూర్తి సహకారం అందిస్తున్న సీబీఐ.. అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు జరుపుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాశ్‌ తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉన్నారని.. అయినా విచారణకు రావాలంటూ వేధిస్తోందన్నారు. ఆధారాలు లేకుండా అవినాశ్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

గంగిరెడ్డి ఇచ్చాడని చెప్పి తనకు సునీల్‌ కోటి ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడని… అందులో 25 లక్షలను మళ్లీ సునీల్‌ తీసుకున్నాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన సీబీఐ మిగిలిన 75 లక్షల్లో 46 లక్షలు మాత్రమే రికవరీ చేసింది. మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు అవినాష్‌ రెడ్డి. దస్తగిరి ఆయుధాన్ని నాలాలో వేశానని చెప్పాడు.. మరి నాలాలో వేసిన ఆయుధాన్ని కూడా సీబీఐ ఎందుకు రికవరీ చేయలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు.

నిందితుడి నుంచి ఒకసారి వాంగ్మూలం తీసుకుంటారు. కానీ దస్తగిరి నుంచి మూడుసార్లు వాంగ్మూలం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు అవినాష్‌ రెడ్డి. ఇన్నాళ్లయినా సీబీఐ తన ప్రమేయం ఉంది అని చెప్పేందుకు ఒక్క ప్రాథమిక ఆధారాన్ని కూడా చూపలేదని చెబుతున్నారు. అసలు హంతకుడిని బయట తిరగమని చెప్పి.. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలని సీబీఐ చూస్తోందన్నారు.

Related News

Minister Durgesh: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్

AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..

Politics: ఔను వారిద్దరూ కలిశారు.. ఒకరేమో సీఎం.. మరొకరేమో మాజీ సీఎం.. భేటీ అందుకేనా ?

Deputy CM: రేపు కేంద్రం సమావేశం.. నేడు పవన్ తో భేటీ.. అసలేం జరుగుతోంది ?

Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

AP Govt: రేపే వారి ఖాతాల్లో నగదు జమ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. చెక్ చేసుకోండి..

Crime: ఆహా ఏమి అందం.. ఏమి చందం.. లుక్ సూపర్.. కట్ చేస్తే మత్తు.. ప్రవేట్ వీడియోలు.. ఆ తర్వాత..?

×