E-Paper
Advertisement

Dastagiri: దస్తగిరి సేఫేనా? భద్రతపై సీబీఐ ఆందోళన!?

Dastagiri: దస్తగిరి సేఫేనా? భద్రతపై సీబీఐ ఆందోళన!?
Advertisement
dastagiri avinash reddy

Dastagiri: వివేకా హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఎంపీ అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేపోమాపో అరెస్ట్ అంటూ మళ్లీ ప్రచారం జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో.. సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లారు. అదే సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా పులివెందులలోని తన ఇంటికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు సీబీఐ, ఇటు అవినాష్.. పులివెందులలో హైటెన్షన్ కొనసాగుతోంది.

మరోవైపు, సీబీఐ సిబ్బంది పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లడం ఆసక్తికర పరిణామం. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి ఇస్తున్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు వెంటనే చెప్పాలని దస్తగిరికి సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సీబీఐ హెచ్చరించింది.

Advertisement

తనకు ప్రాణహాని ఉందంటూ, అదనపు భద్రత కల్పించాలంటూ ఇటీవల జిల్లా ఎస్పీని కోరాడు దస్తగిరి. వెంటనే స్పందించిన ఎస్సీ.. దస్తగిరికి సెక్యూరిటీని 1+5కి పెంచారు. అయినా, అవినాష్ అనుచరుల నుంచి తనకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తున్నారు దస్తగిరి. అటు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు దిశగా పరిణామాలు వేగంగా మారుతుండటంతో.. ఆయన అరెస్ట్ అయితే ఆ కోపంలో అతని అనుచరులు దస్తగిరిపై అటాక్ చేసే అవకాశం ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. తాజాగా, సీబీఐ అధికారులు సైతం దస్తగిరిని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×