EPAPER

Caste Politics In Kuppam: కుప్పంలో ఎవరికి ఛాన్స్?.. చంద్రబాబుతో పెద్దిరెడ్డి సైరా..

Caste Politics In Kuppam: కుప్పంలో ఎవరికి ఛాన్స్?.. చంద్రబాబుతో పెద్దిరెడ్డి సైరా..
latest political news in Andhra Pradesh

Caste Politics In Kuppam(Latest political news in Andhra Pradesh): కులం కూడు పెట్టదనేది పెద్దలు చెప్పే మాటMG.. అయితే అవే కులాలు ఓట్లు కురిపిస్తాయనేది నేటి నాయకుల పిలాసఫీ.. అందుకే ప్రతి ఎలక్షన్స్‌లో కాస్ట్ పాలిటిక్స్ చేస్తుంటారు.ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో కుల సమావేశాలతో బీజీ అయిపోతున్నారు లీడర్లు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకర్గంలో ఇప్పుడు కుల రాజకీయాలు జోరందుకున్నాయి. కుల పెద్దల విగ్రహ ప్రతిష్ఠల దగ్గర నుంచి ఆయా వర్గాలకు విందులు, చిందులతో కుప్పం సెగ్మెంట్ సందడిసందడిగా మారిపోతోంది.


చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గం తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు విభిన్నంగా ఉంటుంది. తమిళ, కన్నడ, తెలుగు ప్రజలు కలసి నివసించే ఈ సెగ్మెంట్లో కల్చర్ కూడా డిఫరెంట్‌గానే కనిపిస్తుంటుంది. అందుకే ఏపీ ఎలక్షన్స్‌ సమయంలో కనిపించే కుల రాజకీయాల ప్రభావం ఇక్కడ పెద్దగా కనిపించేది కాదు. అయితే చంద్రబాబుకి ఎదురులేకుండా పోయిన.. కుప్పం కంచుకోటని ఈ సారి ఎలాగైనా బద్దలు కొట్టాలని పట్టుదలతో ఉంది వైసీపీ.

కుప్పలో టీడీపీ అధినేతను ఎలాగైనా ఓడించాలని చూస్తున్న సీఎం జగన్. ఆ బాధ్యతలను జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దాంతో ఎప్పటి నుంచో కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న పెద్దిరెడ్డి. తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కుల సంఘాల మీటింగులు మొదలుపెట్టారు. దాంతో టీడీపీ నేతలు కూడా కుల సంఘాలపై దృష్టి సారిస్తున్నారు.


నియోజక వర్గంలో వన్నెకుల క్షత్రియలు, తమిళ మాల , కురబ, రెడ్డి, గాండ్ల, వడ్డెర సామాజిక వర్గాలు ఎక్కువుగా ఉంటాయి. అయితే వారి మధ్య ఎలాంటి బేధాభిప్రాయలు కనిపించేవి కాదు. గతంలో కాంగ్రెస్ , తర్వాత టీడీపీ అవిర్భావం నాటి నుంచి ప్రజలతో దగ్గరగా ఉన్న వారే కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ ఓటమి ఎరుగని నియోజకవర్గం ఇది. 1983, 85 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా రంగస్వామినాయుడు విజయం సాధిస్తే .. తర్వాత నుంచి అక్కడ చంద్రబాబు వరుస విజయాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం కుప్పం నుంచి ఆయన ఏడో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే చంద్రబాబుని ఓడించడానికి కుల రాజకీయం మొదలుపెట్టారు వైసీపీ నేతలు.

2009 ఎన్నికల్లో ఇక్కడ విజయం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అప్పటి సీఎం వైఎస్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డిని చంద్రబాబుకు పోటీగా రంగంలో దింపారు. ఆ ఎన్నికల్లో మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఎన్నికల ఖర్చు మొత్తం భరించారన్న ప్రచారం ఉంది. అయితే తర్వాత 2014 ఎన్నికల్లో సుబ్రమణ్యంరెడ్డిని కాదని.. కడప జిల్లాకు చెందిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని రంగంలోకి దింపింది వైసీపీ.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా చంద్రమౌళి పోటీలో ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహాణ భారాన్ని పెద్దిరెడ్డి అయన కూమారుడు మిధున్ రెడ్డి చూసుకున్నారు. ముందుగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యువకులతో బెంగుళూరులో సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు చీల్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కు వ్యతిరేకంగా అన్ని సామాజిక వర్గాలలో గ్రూపుల ఏర్పాటుకు తెర లేపారు .. అతే సమయంలో టీడీపీలోని కుప్పం సీనియర్లు చేసిన తప్పిదాలు వైసీపీకి కలసి వచ్చాయి.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినప్పటికీ.. కమీషన్లకు కక్కుర్తి పడిన స్థానిక టీడీపీ నేతలు ఆయా పనులనుపులివెందుల, కడప, పుంగనూరు, మదనపల్లికి చెందిన వైసీసీ సానుభూతి పరులకు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో అయా ప్రాంతాలకు చెందిన వారు కుప్పంలో స్థిరపడి ఓటర్లయ్యారు. ఆ ఎఫెక్ట్‌తో పాటు పార్టీ సీనియర్లపై ఉన్న వ్యతిరేకతతో.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 50 వేల నుంచి 30 వేలకు పడిపోవడానికి కారణమైందంటారు.

ఇక టీడీపీఅధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టీడీపీలో ఉన్న సెంథిల్, విద్యాసాగర్ వంటి వారిని తమ పార్టీలోకి చేర్చుకుని.. టీడీపీ శ్రేణులను వేధించడం మొదలుపెట్టిందన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తర్వాత చంద్రబాబు నియోజకవర్గంలోకి వచ్చినప్పుడల్లా అయనను చికాకు పర్చడం.. ఆయన కాన్వాయ్‌పై దాడులకు ప్రయత్నించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దానికి తోడు పోలీసులు ప్రతిపక్ష నాయకుడిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. అలాంటి సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది.

లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పట్టు చిక్కడంతో.. కుప్పం వైసీపీ నేతలు కుల రాజకీయాలకు తెరలేపారు. అప్పటి నుంచే కుప్పం రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వైసీపీ ఎత్తుగడలకు కౌంటర్‌గా టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ సారథ్యంలో యూత్ టీంను ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. కుప్పం శాంతి నగర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సైరా నరసింహారెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు వైసీపీ నేతలు.. అది పెద్ద వివాదానికి కారణమైంది. అయితే రాజకీయ బలంతో సైరా నరసింహారెడ్డి విగ్రహం పెట్టేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అంభేద్కర్ విగ్రహాలను తమిళ మాలలకు పంపిణీ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు కుప్పం వచ్చినప్పడు కుప్పం పరిసరాల్లో ఏకంగా 14 అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించారు.

ఇక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్ కుప్పం వైసీపీ ఇన్చార్జిగా ఉండటంతో.. ఆ వర్గం అండపై వైసీపీలో ధీమా కనిపించింది. అయితే టీడీపీలో ద్వీతీయ శ్రేణి నాయకులు ఎక్కువగా వారే కావడంతో.. వారు కులసమావేశాలకు తెరలేపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ వర్గానికి ఓ భవనం నిర్మింపచేశారు. అది ఫినిషింగ్ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం మారింది. చాలాకాలం దానిని పట్టించుకోని అధికార పార్టీకి ఎన్నికల ముందు అది గుర్తొచ్చింది. చివరి దశలో ఉణ్న పనులు పూర్తి చేసి .. వన్నెకుల క్షత్రియ భవనం తమ ఘనతే అని ప్రచారం మొదలుపెట్టింది.

అలాగే కురబ సామాజిక వర్గానికి చెందిన కనకదాసు విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అప్పట్లో ఓ కుల సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత చంద్రబాబు నియోజకవర్గ పర్యటనలో మరో విగ్రహాన్ని అవిష్కరించిన సందర్భంలో పెద్ద మీటింగ్ జరిగింది. టీడీపీ మీటింగ్‌కి రాయలసీమ, కర్నాటలలోని కురబ సంఘనాయకుల అంతా హాజరయ్యారు.

మరోవైపు గాండ్ల సంఘం సమావేశం ఏర్పాటుచేసిన అధికార పార్టీ.. వారి కుల సంఘ భవన నిర్మాణానికి రెండు ఏకరాలు మంజూరు చేసింది. మరోవైపు టీడీపీ కూడా గాండ్ల సంఘం సమావేశం ఏర్పాటు చేసి.. గాండ్ల సామాజిక వర్గానికి తాము రాజకీయంగా అనేక పదవులు ఇచ్చామని.. భవిష్యత్ లో కూడా అండగా ఉంటామని హామీలు గుప్పించింది. అయితే ఆ సమయంలో టీడీపీ సీనియర్లు తమను ఇబ్బంది పెట్టారని ఆ వర్గం యువకులు అగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్షఓట్ల మెజార్టీ పేరుతో టీడీపీ ప్రచారం నిర్వహిస్తోంది. చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి టీం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పార్టీల ప్రయత్నాలు అలా ఉంటే.. ఇప్పటి వరకు పక్కవాడి కులం గురించి అలోచించని తమ మధ్య కులాల గొడవలు తెస్తున్నారని స్థానికులు అంటున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఎక్కడో మారుమూలన ఉండే కుప్పంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి.. టీడీపీకి ప్లస్‌గా కనిపిస్తున్నా.. ఆ పార్టీలోని స్థానిక సీనియర్లపై ఉన్న వ్యతరేకత కొన్ని వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మరి ఆ పరిస్థితిని టీడీపీ అధినేత ఎలా చక్కదిద్దుకుంటారో కాని.. కుప్పంలో వైసీపీ దూకుడు వెనుక మరో లెక్క కూడా వినిపిస్తోంది. చంద్రబాబుని ఓడించలేప పోయినా.. మెజార్టీని గణనీయంగా తగ్గింస్తే.. చిత్తూరు ఎంపీ సీటు మరోసారి తమ వశమవుతుందన్నది పెద్దిరెడ్డి ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొద్దమ్మీద ఎవరి లెక్కలు ఎలా ఉన్నా… కుప్పంలో మొదలైన కుల రాజకీయం అక్కడ జనానికి మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×