EPAPER

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

Deputy Cm Pawan: దేశంలో రాజకీయాల ట్రెండ్ మారింది. ప్రత్యర్థులపై ఎంత గట్టిగా విరుచుకుపడితే అంతగా పాపులర్ అవుతున్నారు ఆయా నేతలు. పాపులారిటీతోపాటు కేసులు చుట్టుముడు తున్నాయి. ఆ తర్వాత కేసుల సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ కోవలోకి వచ్చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


సనాతన ధర్మం పేరిట గురువారం తిరుపతిలో సభ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అసలు సనాతన ధర్మం గురించి చెబుతూ.. ప్రత్యర్థులకు చురకలు అంటించారు. ఈ క్రమంలో కొందర్ని టార్గెట్ చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ఇందులోని లాగేశారాయన. గతంలో ఆయన సనాతన ధర్మంపై చేసిన కామెంట్ ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

ఈ వ్యవహారం తమిళ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వైఖరిని చాలామంది తప్పుబట్టారు కూడా. మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది. దీంతో మదురై పోలీసులు ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేశారు.


ఒకవిధంగా పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ అని అంటున్నారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పవన్.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదన్నది తమిళ రాజకీయ నేతల మాట. ఈ వ్యవహారం తమిళనాడులో రచ్చ సాగుతోంది.

ALSO READ: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

ఇంతకీ తిరుపతి సభలో డిప్యూటీ సీఎం పవన్ ఏమన్నారు. సనాతన ధర్మం అనేది వైరస్ అని, దాన్ని నాశనం చేస్తానంటూ ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. అయితే ఉదయనిధి మాత్రం లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. వెయిట్ చేద్దాం అని ఉదయనిధి అన్నట్లు తెలుస్తోంది. 

గతంలో పవన్ మాట్లాడిన పాత వీడియోలను ట్రోల్ చేయడం మొదలుపెట్టేసింది అధికార డీఎంకె పార్టీ. పవన్ సపోర్టుగా బీజేపీ సోషల్ వింగ్ కౌంటరివ్వడం మొదలుపెట్టేసింది. సనాతన ధర్మం మాట కాసేపు పక్కనబెడితే.. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి.

దీంతో పవన్ కామెంట్స్ వ్యవహారం ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకె వర్సెస్ బీజేపీ అన్నట్లుగా అక్కడ ప్రచారం సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Big Stories

×