Big Stories

Janasena-BJP : బీజేపీతో జనసేన కటీఫ్.. ? ఎవరిదారి వారిదే..? మాధవ్ క్లారిటీ..!

Janasena-BJP : ఏపీలో బీజేపీ-జనసేన పొత్తుల బంధం తెగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడిగా పోరాటాలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రావడంలేదని మొన్నటి వరకు జనసేనాని అనేవారు. కానీ ఇప్పుడు జనసేనే తమకు మద్దతుగా నిలవడంలేదని బీజేపీ నేతలు అంటున్నారు. తాజాగా బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జనసేన తమతో కలిసి రావడం లేదని ఆయన ఆరోపించారు. జనసేన, బీజేపీ కలిసి వెళ్తేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని అన్నారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇటీవల ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ-జనసేన మధ్య చిచ్చు రాజేశాయి. జనసేనతో పేరుకు మాత్రమే పొత్తు అనే పరిస్థితి ఉండటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు మాధవ్. బీజేపీకి దూరం కావాలనుకుంటే జనసేన ఇష్టమని స్పష్టంచేశారు. కలిసి సాగాలనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని తేల్చిచెప్పారు. అప్పుడే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. తమ అభ్యర్థికి జనసేన మద్దతుందని పీడీఎఫ్‌ ప్రచారం చేసిందని మాధవ్ అన్నారు. పీడీఎఫ్ ప్రచారాన్ని ఖండించాలని కోరినా జనసేన స్పందించలేదని ఆరోపించారు.

- Advertisement -

వైసీపీతో బీజేపీ కలిసిపోయిందనే ప్రచారం కూడా నష్టం చేసిందని మాధవ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ అధిష్టానానానికి అన్నీ చెప్పే చేస్తున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ, వైసీపీ ఒకటే అనే ప్రచారాన్ని ఆ పార్టీ కల్పించిందని మండిపడ్డారు. వైసీపీ ప్రచారాన్ని ప్రజల నమ్మారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని మాధవ్ ప్రకటించారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ వేస్తామన్నారు. పొత్తుల విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.

ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌కు 10,884 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు టీడీపీలో జోష్ నిచ్చాయి. అదే సమయంలో బీజేపీ- జనసేన మధ్య గ్యాప్ ను పెంచాయి. మరి జనసేన-బీజేపీ పొత్తుల బంధం కొనసాగుతుందా? ఎవరిదారి వారు చూసుకుంటారా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News