EPAPER

Alcohol Policy: మందుబాబులకు శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

Alcohol Policy: మందుబాబులకు శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..

Cabinet Subcommittee first meeting: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు ఏపీలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందంటూ మంత్రి మండిపడ్డారు. సొంత ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టేలా గత జగన్ సర్కారు మద్యం పాలసీని అమలు చేసిందన్నారు. నాటి మద్యం పాలసీ కారణంగా ప్రజల ఆరోగ్యం నాశనమైందంటూ మంత్రి కొల్లు తీవ్రంగా ధ్వజమెత్తారు.


Also Read: అది కుట్ర కాకపోతే బోట్లకు లంగరు ఎందుకు వేయలేదు? : మంత్రి నిమ్మల

ఏపీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై బుధవారం కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందన్నారు. మంచి మద్యం పాలసీని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీని రూపొందించినున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలు, నాసిరకం మద్యం వల్ల ఏపీలో గంజాయి వినియోగం పెరిగిపోయిందంటూ ఆయన ఆరోపించారు.


Also Read: జైలులో మాజీ ఎంపీతో జగన్ ములాఖత్.. మేం వస్తే టీడీపీకి ఇదే గతి.. మళ్లీ అబద్దాలే..

Related News

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

Mumbai actress case: కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Big Stories

×