EPAPER

Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు..

Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు..

Bus Accident : అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద అదుపు తప్పింది.
లోయలోకి దూసుకుపోయింది. ఏడు పల్టీలు కొట్టి.. 50 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది.


ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.

లోయలో పడిన బస్సు వద్దకు స్థానికులు వెంటనే చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బాధితులను అతి కష్టం మీద ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సులో వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.


ఇటీవల కురిసిన వర్షాల వల్ల చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోయాయి. రహదారి పక్కన రక్షణ గోడలేదు. ఇదే ప్రమాదానికి కారణమని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా లేవు. దీంతో ప్రయాణికులు ప్రమాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని నిర్దేశించారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×