EPAPER

Budameru Vagu: వెళ్లొద్దు అని మొత్తుకున్న వినకుండా.. వరదలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు

Budameru Vagu: వెళ్లొద్దు అని మొత్తుకున్న వినకుండా.. వరదలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు

Software Employee missing in Budameru Vagu: విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. మూడు గండ్లను మూసివేయడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు చోట్లు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, ఈ వరదలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతయ్యాడు.


వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కలిదింవి ఫణికుమార్ హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం వినాయక చవితి పండగ కావడంతో ఇంటికి వెళ్లాడు. ఉదయం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనంతరం సాయంత్రం తిరిగి మళ్లీ మచిలీపట్నం వెళ్తానని చెప్పడంతో బంధువులు వద్దని కోరారు.

అయితే, వర్షాలు పడుతున్నందున మచిలీపట్నంకు వెళ్లవద్దని ఎంత చెప్పినప్పటికీ వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అయితే మార్గమధ్యలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని, విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా వినిపించుకోలేదు. అలాగేే వేగంగా వెళ్లినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.


స్థానికులు సైతం వరద వస్తుందని చెప్పినా కేసరపల్లి, ఉప్పులూరు, కంకిపాడు మీదుగా వెళ్తానంటూ తన కారులో దూసుకెళ్లాడు. చివరికి బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులతోపాటు పోలీసులు ప్రయత్నించారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా, ఓ చోట నీటిలో మునిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారును పోలీసులు గుర్తించారు.

మరోవైపు సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది.

Also Read: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. అయితే ఈ అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో వాయువగుండంగా మారనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×