EPAPER
Kirrak Couples Episode 1

Botsa Jhansi Lakshmi : బొత్స ఝాన్సీ వల్ల వైసీపీకి బెనిఫిట్ ఉంటుందా..?

Botsa Jhansi Lakshmi : బొత్స ఝాన్సీ వల్ల వైసీపీకి బెనిఫిట్ ఉంటుందా..?

Botsa Jhansi Lakshmi : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. కీలకమైన విశాఖ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు తప్పేలా లేవు. దీనితో పోటీ చేస్తున్న అభ్యర్థులపై కేడర్‌లో టెన్షన్ పెరిగిపోతుంది. ఉత్తరంధ్ర రాజకీయాల్లో కీలకమైన విశాఖ ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పేరు ఖరారు కావడంతో విశాఖ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసలు విశాఖకు బొత్స ఝాన్సిని తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటి..? బొత్స ఝాన్సీ విశాఖ నుండి పోటీలో ఉండటం వల్ల వైసీపీకి బెనిఫిట్ ఉంటుందా..? బొత్స ఝాన్సీ కేవలం విశాఖ రాజకీయాలానే ప్రభావితం చేయగలరా.. లేదంటే ఉత్తరాంధ్ర మొత్తం బొత్స ఫ్యామిలీ ప్రభావం పని చేస్తుందా..? బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా తీసుకురావడం వెనుక వైసీపీ స్కెచ్ ఏంటి..?


ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎంత మంది నాయకులు ఉన్నా బొత్స సత్యనారాయణ రూటే సపరేటు. బొత్స అవసరం ఉంది అని గమనిస్తే చాలు. అది ఏ పార్టీ అయినా.. పైన కూర్చున్నది ఏ నాయకుడు అయినా.. వారిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధం హస్తుడిగా బొత్స సత్యనారాయణకు పేరుంది. బొత్స కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న సమయంలోనే తన భార్య బొత్స ఝాన్సీని రెండు సార్లు ఎంపీని చేసిన ఘనుడు. అలాంటిది ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 నేతల వర్గంలో ఉన్న బొత్స చాలా సునాయాసంగా తన భార్య బొత్స ఝాన్సీ పేరును అధిష్టానమే తెరపైకి తెచ్చేలా చేశారు.

2001 నుండి 2006 వరకు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా పని చేసిన బొత్స ఝాన్సీ 2007లో బొబ్బిలి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా రాజకీయ ఉద్ధండుడు పూసపాటి అశోక్ గజపతి రాజుపై గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును కూడా అందుకున్నారు. ఇక, 2014 నుండి ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా, సైలెంట్ గా ఉన్నారు. కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖ ఎంపీగా అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. వైసీపీ అధిష్టానం ప్రకటించిన మూడవ లిస్ట్‌లో విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరు ప్రకటించారు.


అంటే బొత్స సత్యనారాయణ మంత్రాంగం ఏ స్థాయిలో పని చేసిందో అర్ధం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. గత ఎన్నికల వరకు ఇతర నియోజకవర్గాల్లో ఒక కుటుంబంలో ఒకే అభ్యర్థికి సీటు కేటాయించిన వైసీపీ ఇప్పుడు బొత్స ఝాన్సీని ఎంపీగా, బొత్స సత్యనారాయణని ఎమ్మెల్యేగా దించడం వెనుక ఎన్నో ఇక్వేషన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఆరు నెలల క్రితమే వైసీపీ అధిష్టానం విశాఖ ఎంపిగా ఉన్న ఎంవివీ సత్యనారాయణను ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించడంతో ఎంవీవీ ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీగా ఎవరు వస్తారు అనే చర్చ గత ఆరు నెలలుగా జరుగుతోంది. అయితే, వారం రోజుల క్రితం బొత్స ఝాన్సీ పేరు తెరమీదకు రావడం ఇప్పుడు అదే పేరును ప్రకటించడం అందరిని ఆశ్చర్యనికి గురిచేసింది. ఇక, సామాజిక సమీకరణాల్లో ఈ సీటు ఇలాగే కేటాయించక తప్పలేదని తెలుస్తుంది. అయితే, బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ భార్యగా మాత్రమే కాకుండా ఉన్నత విద్యావంతురాలనే పేరుంది.

ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన వెనకబడిన సామాజిక వర్గం అయిన తూర్పు కాపుకు చెందిన మహిళగా, ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా సానుకూల అంశాలూ ఉన్నాయి. దీనికి తోడు గతంలో జడ్పీ చైర్మన్‌గా, రెండు సార్లు లోక్‌సభ ఎంపిగా పనిచేసిన ఝాన్సీకి అక్కడ చాలా మంచి పేరు కూడా ఉంది. ఎంపీగా పని చేసిన సమయంలో.. జడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించడంలో బొత్స సత్యనారాయణ కంటే బొత్స ఝాన్సీకే మంచి పేరుందని అంతా అంటున్నారు.

ఇక, బొత్స ఝాన్సీ విశాఖలో పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న ఆలోచనలో అధికార వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు విశాఖ లోక్‌సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యం ఇవ్వడం, గెలిపించడం జరుగుతుంది. 2004లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవివీ సత్యనారాయణలు.. వీళ్లందరూ ఇతర ప్రాంతాలకు చెందిన ఓసీ నేతలే కావడంతో ఈసారి స్థానిక వ్యక్తిని ఎంపీగా బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేసినట్లు తెలుస్తుంది.

అయితే, బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా రాజకీయ పార్టీలు కూడా బీసీ నేతలకు విశాఖ ఎంపీగా సీటు ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైసీపీ ఈ స్టెప్ తీసుకుంది. ఇక, బొత్స ఝాన్సీని విశాఖకు తీసుకురావడం వల్ల బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఛాన్స్‌ను కూడా వైసీసీ కొట్టేయడానికి ఇలా చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక్కడ మరో ఈక్వేషన్ కూడా కనిపిస్తుంది. విశాఖకు బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థి అయితే మంత్రి బొత్స సత్యనారాయణకు ఉన్న పరిచయాలతో అందరు సహకరించే అవకాశం ఉంటుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది. అలాగే, బొత్స మాటకు ఉత్తరాంధ్ర వైసీపీలో అడ్డు చెప్పే వాళ్ళు లేరు. కాబట్టి, విశాఖలో గెలుపు ఈజీ అవుతుంది అనే భావన వైసీపీలో ఉన్నట్లు కనిపిస్తుంది. సామాజిక సమీకరణాల్లో వైసీపీ బీసీకి సీటు ఇస్తే టీడీపీకి బలమైన బీసీ అభ్యర్థి లేకపోవడం కూడా కలిసి వస్తుందని వైసీపీ ఆలోచనలా ఉంది. ఇక, ఇప్పటి వరకు ఉన్న అందరు నాన్ లోకల్ అభ్యర్థులను మార్చుతూ విజయనగరంలో లోకల్‌ను పరిగణించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

లోకల్‌ నేతలను పెట్టడం వల్ల ఎలాంటి వ్యతిరేకత ఉండదని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, బొత్స ఝాన్సీ గెలుపు ఖాయం అవుతుందని వైసీపీ అనుకుంటున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా, రానున్న ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువుగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా బలమైన వాళ్ళు కావడం కూడా బొత్స ఝాన్సీని తెరమీదకు తీసుకురావడానికి మరో కారణంగా సామాన్యులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి, విశాఖ ఎంపీ సీటులో గెలుపు ఖామయనే ఉద్దేశంతో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

.

.

Related News

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Big Stories

×