EPAPER

CM Ramesh comments on Avinashreddy: అవినాష్‌కు కష్టాలు! రేవంత్‌.. ఆ బాండ్స్‌తో సంబంధం లేదు

CM Ramesh comments on Avinashreddy: అవినాష్‌కు కష్టాలు! రేవంత్‌.. ఆ బాండ్స్‌తో సంబంధం లేదు

CM Ramesh comments on Avinashreddy(Political news in AP): ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్లు, నేతలు ప్రచారాలు, మాటల యుద్ధం షురూ అయ్యింది. తాజాగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని నరేంద్రమోదీ, అమిత్ షాను ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు.


ఏపీలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు వారికి తెలుసన్నారు సీఎం రమేష్. జగన్‌‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి చిలుకలూరి పేట సభలో ఆయన పేరు కూడా చెప్పడానికి మోదీ ఇష్టపడ లేదన్నారు. త్వరలో అనకాపల్లి సభకు ప్రధాని మోదీ వస్తున్నారని, ముచ్చటగా మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనకాపల్లి ప్రాంత ప్రజలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం ప్రజలు స్థానికుడా, స్థానికేతరుడా? అనేది చూడలేదని, తన పనితనాన్ని చూసి ఆదరిస్తున్నారని తెలిపారు.

పనిలోపనిగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి కేసు విషయాన్ని ప్రస్తావించారు. అవినాష్‌ని అరెస్ట్ చేయడానికి సీబీఐ ఏపీకి వచ్చినప్పుడు.. ఆయన అరెస్టును అడ్డుకున్నారని, ఈరోజు కాకపోయినా, రేపైనా అవినాష్ అరెస్టు కాకతప్పదని మనసులోని మాటను బయటపెట్టారు. దీనిపై అమిత్ షాకు అన్నీ తెలుసని, ఈ విషయమై ఏడాది కిందటే తనతో చెప్పారంటూ వివరించారు. దానివెనుక ఉన్న వ్యక్తులు ఎవరున్నా బయటకు రావడం ఖాయమన్నారు సీఎం రమేష్.


ALSO READ: పెమ్మసాని ఆస్తులు, రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి

తెలంగాణ కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు సీఎం రమేష్. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్‌కు తాను ఇవ్వలేదని, ఆ బాండ్స్‌‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో జగన్ పత్రిక తప్పుడు కథనాలను ప్రచురించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను టీడీపీలో చాలాకాలంగా పని చేశామని, స్నేహం వేరు.. రాజకీయాలు వేరని తెలియజేశారాయన.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×