EPAPER
Kirrak Couples Episode 1

Swiggy: నిమిషానికి 137 బిర్యానీలు.. సమోసా, మసాలా దోసె, గులాబ్ జామ్ కూడా..

Swiggy: నిమిషానికి 137 బిర్యానీలు.. సమోసా, మసాలా దోసె, గులాబ్ జామ్ కూడా..

Swiggy: తింటే గారెలు తినాలి.. అనేది పాత సామెత. తింటే బిర్యానీయే తినాలనేది నేటి మాట. బిర్యానీకి తెగ ఎగబడుతున్నారు జనాలు. ఆకలేస్తే చాలు.. బిర్యానీయే గుర్తుకొస్తోంది చాలామందికి. ఆ టేస్ట్.. ఆ స్మెల్.. బిర్యానీకే స్పెషల్.


చికెన్ తెచ్చి.. బియ్యం కడిగి.. వండాలంటే చాలా టైమ్ పడుతుంది. సరిగ్గా కుదురుతుందో లేదోననే డౌట్ కూడా. అందుకే, ఆన్ లైన్ ఆర్డర్లతో బిర్యానీ లాంగించేస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చినప్పటి నుంచే బిర్యానీకి డిమాండ్ పెరిగిందనొచ్చు. ఆర్డర్ పెట్టిన అరగంటలో టేబుల్ మీదకు బిర్యానీ వచ్చేస్తుండటంతో.. తినే వాళ్ల సంఖ్య తెగ పెరిగిందంటున్నారు.

లేటెస్ట్ గా ‘స్విగ్గీ’ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. తమకు వచ్చిన ఆర్డర్స్ అన్నిటిలోకి బిర్యానీ ఆర్డర్సే అధికంగా ఉన్నాయని తెలిపింది. 2022కు గాను స్విగ్గీకి వచ్చిన వార్షిక ఆర్డర్ల నివేదిక 7వ ఎడిషన్ ను ఇటీవల రిలీజ్ చేసింది. ఆ రిపోర్టులో దేశవ్యాప్తంగా ప్రతి సెకన్ కి 2కు పైగా బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించింది. నిమిషానికి సుమారు 137 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయట స్విగ్గీకి.


మన దగ్గరంటే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కాబట్టి.. తెగ తినేస్తున్నారని అనుకోవచ్చు. కానీ, దేశవ్యాప్తంగా బిర్యానీ అంటే ఇష్టపడుతున్నారని స్విగ్గీ నివేదికను బట్టి తెలుస్తోంది. ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉండటం.. వచ్చిన వారికి వచ్చినట్టు బిర్యానీ టేస్ట్ నచ్చేస్తుండటం.. వారు వారివారి ప్రాంతాల్లోని తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు బిర్యానీ గురించి స్పెషల్ గా చెబుతుండటంతో.. దేశవ్యాప్తంగా బిర్యానీకి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అదంతా హైదరాబాద్ బిర్యానీ వల్లే సాధ్యమైందని చెబుతున్నారు.

ఇక, స్విగ్గీలో బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ బిర్యానీల సేల్స్ బాగున్నాయట. స్నాక్స్ లో.. టాప్ ప్లేస్ లో సమోసా నిలిచింది. పాప్ కార్న్, పావ్ బాజీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్వీట్లలో గులబ్ జామ్ సేల్స్ నెంబర్ వన్. ఆ తర్వాతి ప్లేస్ లో రస్ మలాయ్, చాకోలావా కేక్స్. విదేశీ వంటకాల్లో ఇటాలియన్ పాస్తా.. పిజ్జాలకి డిమాండ్ ఎక్కువగా ఉందని స్విగ్గీ తెలిపింది. గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో ఆన్‌లైన్‌ ఫుడ్ అమ్మకాల్లో బిర్యానీయే నెంబర్ వన్ గా నిలవగా.. ఈసారి గత సేల్స్ రికార్డులు బ్రేక్ కావొచ్చని అంటున్నారు. బిర్యానీయా.. మజాకా…

Related News

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Big Stories

×