EPAPER

Pulivendula Assembly Constituency : జగన్ ఇలాఖా పులివెందుల.. ఫ్యాన్ స్పీడుకు చెల్లెళ్లు బ్రేకులు వేస్తారా ?

Pulivendula Assembly Constituency : జగన్ ఇలాఖా పులివెందుల.. ఫ్యాన్ స్పీడుకు చెల్లెళ్లు బ్రేకులు వేస్తారా ?

AP Political News


Pulivendula Assembly Constituency(AP Political News): పులివెందుల ఈ పేరు వినగానే వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబం గుర్తుకువస్తుంది. ఆ కుటుంబంతో పాటుగా ఇక్కడి రంగనాథ స్వామి ఆలయం.. పూలంగల్లు కూడా అంతే ఫేమస్. ఈ పూల షాపుల్లో ఎలాగైతే మూడు తరాల కుటుంబాలు వ్యాపారం చేస్తున్నారో.. ఇక్కడి రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌ మరణానికి ముందు వరకు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. 1955 నుంచి 2010 వరకు ఇక్కడ కాంగ్రెస్‌ ఏకంగా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు అంటే ఇక్కడి నేతలు ఎంత పవర్‌ఫులో అర్థం చేసుకోవచ్చు. మహామహులకి ఈ పులివెందుల పుట్టినిల్లు. వైఎస్‌ఆర్‌ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి ఈరోజు వరకు ఈ నియోజవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతోంది వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీ. కానీ ఇప్పుడా ఫ్యామిలీలో చీలిక వచ్చింది. వైఎస్‌ షర్మిల అనూహ్యాంగా ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు. అన్నతో పోరుకు సై అంటున్నారు. ఆమెకు తోడుగా నేను సైతం అంటున్నారు మరో చెల్లెలు సునీతమ్మ. మరి ఆమె పులివెందుల నుంచి చెల్లెళ్ళలో ఎవరు బరిలోకి దిగుతారు? దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? సీఎం జగన్‌ జోరుకు బ్రేక్‌లు వేస్తారా? టీడీపీ గెలుపు అవకాశాలు ఎంత? అన్న అంశాలపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను పరిశీలించేముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.

2019 RESULTS


2019 ఎన్నికల్లో పులివెందులలో వార్‌ వన్‌సైడే అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఏకంగా 73 శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయనకు టీడీపీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్‌ కుమార్‌ రెడ్డి కంటే 50 శాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. సతీష్ కుమార్‌ రెడ్డికి కేవలం 23 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు పూర్తయ్యాయి. ఇది గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి. మరి ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు ఎలా ఉండనున్నాయనే దానిపై బిగ్ టీవీ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను పరిశీలిద్దాం.

ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యే, సీఎంగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్‌ పాయింట్స్ ఏంటో చూద్దాం.

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

ప్రస్తుతం రాష్ట్ర సీఎంగా ఉండటం

వైఎస్‌ఆర్ రాజకీయ చరిష్మా

ఓటమి అన్నదే లేని నేతగా పేరు

నియోజకవర్గంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు

పూర్తి స్థాయిలో మద్ధతిచ్చే క్యాడర్

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మైనస్ పాయింట్స్‌

నియోజకవర్గానికి అప్పుడప్పుడు మాత్రమే రావడం

నియోజకవర్గ బాధ్యతలను వైఎస్ అవినాష్‌ రెడ్డికి అప్పగించడం

టీడీపీ మద్ధతుదారులకు జగనన్న విద్యాదీవెన అందలేదన్న ఆరోపణలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యానంతర పరిణామాలు

చెల్లెలు వైఎస్ షర్మిలా కాంగ్రెస్‌లో చేరడం

వైఎస్‌ షర్మిలా రెడ్డి (కాంగ్రెస్‌) ప్లస్ పాయింట్స్

కలిసి రానున్న వైఎస్‌ఆర్‌ రాజకీయ చరిష్మా

పాత కాంగ్రెస్‌ నేతలు మద్ధతిచ్చే అవకాశం

సొంత గడ్డపై నుంచి పోటీ చేయడం

వైఎస్‌ షర్మిలా రెడ్డి మైనస్ పాయింట్స్

జగన్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడం

నియోజకవర్గానికి చాలా కాలం నుంచి దూరంగా ఉండటం

వైఎస్‌ సునీతా రెడ్డి (కాంగ్రెస్‌) ప్లస్ పాయింట్స్

వైఎస్ వివేకా హత్య అనంతర పరిణామాలు

తన న్యాయపోరాటంపై ప్రజల్లో ఉన్న సింపతి

వైఎస్ వివేకానందా రెడ్డి అనుచరుల మద్ధతు

వైఎస్‌ సునీతా రెడ్డి మైనస్ పాయింట్స్

రాజకీయాలకు కొత్త కావడం

జగన్‌లాంటి నేతను ఎదర్కోవాల్సి రావడం

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

చాలా రోజులుగా నియోజకవర్గంలో చేస్తున్న కార్యకలాపాలు

ప్రజల్లో బలమైన నేతగా ఉన్న గుర్తింపు

ఇటీవల అరెస్ట్‌ కావడంపై ప్రజల్లో ఉన్న సింపతి

గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి

బలంగా మద్ధతిస్తున్న టీడీపీ క్యాడర్

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైనస్ పాయింట్స్

జగన్ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాల్సి రావడం

ఇక వచ్చే ఎన్నికల్లో పులివెందుల బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YCP) VS మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (TDP) VS వైఎస్ షర్మిల( INC)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్ జగన్, బీటెక్ రవి, షర్మిల బరిలోకి దిగితే వైసీపీకి ఏకంగా 63 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైఎస్ కుటుంబానికి ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టు, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం.. సంక్షేమ ఫలాల లబ్ధిదారులు ఆయనకు బలంగా మద్ధతు తెలుపుతున్నారు. అంతేగాకుండా ఇక్కడ విపక్షం బలంగా లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం.

అయితే వైఎస్‌ కుటుంబ పాలనను వ్యతిరేకించే వారు.. టీడీపీ మద్ధతు దారులు బీటెక్ రవిని బలపరుస్తున్నారు. ఆయనను టీడీపీ అధినేత చాలా కాలం ముందే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి వర్గం కూడా బీటెక్‌ రవికి మద్ధతిస్తున్నారు. అంతేగాకుండా నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్న వారు కూడా టీడీపీకి మద్ధతిచ్చే అవకాశం ఉంది. అయితే వీరంతా కలిసినా ఆయనకు 21 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

ఇక పులివెందులలో ఉన్న ముఖ్య నేతలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని భావిస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో తేలింది. వీరంతా ఇప్పటి వరకు టీడీపీలో చేరేందుకు సుముఖంగా లేకపోవడంతో.. ఇప్పుడు వారికి కాంగ్రెస్‌ పార్టీ రీఎంట్రీ ఒక కొత్త ఆశను చిగురించిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ నుంచి షర్మిల పోటీ చేస్తే ఆమెకు 13 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది.

ఇక మరో సినారియోలో వైఎస్ జగన్, బీటెక్ రవి, వైఎస్ సునీతా బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YCP) VS మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (TDP) VS వైఎస్ సునీతా రెడ్డి (INC)

షర్మిలాకు బదులు సునీతా బరిలోకి దిగిన వైఎస్ జగన్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఈ ఈక్వేషన్‌లో వైసీపీకి 64 శాతం, టీడీపీ 23, కాంగ్రెస్‌కు 11 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తోంది. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు అవ్వడంతో ఆమెకు కాస్త సింపతి ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక మరో సినారియోలో అసలు కాంగ్రెస్‌ నుంచి ఎవరూ పోటీ చేయకుండా కేవలం వైసీపీ, టీడీపీ బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YCP) VS మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (TDP)

పులివెందులలో కేవలం వైసీపీ, టీడీపీ బరిలోకి దిగితే జగన్‌కు ఏకంగా 69 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 27 శాతం మాత్రమే ఓట్లు.. ఇతరులకు 4 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

ఏ సినారియోలో చూసుకున్న పులివెందుల గడ్డపై మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×