EPAPER

Denduluru Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. దెందులూరులో ఎవరికి ఎడ్జ్, ఎవరికి ఎర్త్ ?

Denduluru Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. దెందులూరులో ఎవరికి ఎడ్జ్, ఎవరికి ఎర్త్ ?

Denduluru Assembly Constituency : దెందులూరు నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ లో కమ్మసామాజిక వర్గానిదే డామినేషన్ అని చెప్పాలి. 1955 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీదే హావా. తర్వాత తెలుగు దేశం పార్టీ మంచి విజయాలను సాధించింది. వ్యవసాయం, వాణిజ్య పరంగానూ దెందులూరుకి మంచి పేరుంది. ఈ నియోజక వర్గంలో గెలిచిన చింతమనేని ప్రభాకర్ .. ప్రభుత్వ ఉద్యోగిణి వనజాక్షి తో గొడవ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. 2019 లో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. దెందులూరు నియోజకవర్గానికి ఏపీ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది. ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగితే.. 17సార్లు కమ్మ సామాజికవర్గం నేతలే గెలిచారు. ఈ సెగ్మెంట్లో కమ్మ సామాజికవర్గం, అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 1955 నుంచి ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. మరి ఈసారి దెందులూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS
అబ్బయ్య చౌదరి VS చింతమనేని ప్రభాకర్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి 51 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై వచ్చిన ఆరోపణలతో, జనంలో నెగెటివిటీతో వెనుకబడ్డారు. దీంతో 42 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన ఘంటశాల వెంకట లక్ష్మి 3 శాతం ఓట్లు రాబట్టారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్, టీడీపీ అభ్యర్థిపై వ్యతిరేకతతో వైసీపీ నేత అబ్బయ్య చౌదరి ఈజీ విక్టరీ కొట్టారు. మరి ఈసారి ఎన్నికల్లో దెందులూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


ycp candidate abbayya chowdary

అబ్బయ్య చౌదరి (YCP) ప్లస్ పాయింట్స్

పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడం

కార్యకర్తల సమస్యల్ని పరిష్కరించడం

ప్రచారంలో వైసీపీ కార్యకర్తల జోరు

కొఠారుతో కప్ కాఫీ ప్రోగ్రామ్ సక్సెస్

గడపగడపకు కొఠారు కార్యక్రమం సీరియస్ గా చేయడం

అబ్బయ్య చౌదరి మైనస్ పాయింట్స్

ఇసుక అక్రమాల విషయంలో ఆరోపణలు

టీడీపీ వేవ్ ను ఎంత వరకు తట్టుకుంటారన్న డౌట్లు

దెందులూరులో రోడ్లు అధ్వాన్నంగా మారడం

తాగునీటి సమస్య నెరవేరకపోవడం

చేపల పెంపకందారులకు ఇచ్చిన హామీలు తీర్చకపోవడం

ఎస్సీలకు ఇండ్లు, ఉద్యోగావకాశాలపై నెరవేరని ఎమ్మెల్యే హామీ

bigtv survey in denduluru assembly constituency

చింతమనేని ప్రభాకర్ (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ టీడీపీ లీడర్ గా జనంలో గుర్తింపు

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

మాస్ లీడర్ గా జనంలో గుర్తింపు

తన హయాంలో దెందులూరులో చేసిన అభివృద్ధి

టీడీపీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం

చింతమనేని ప్రభాకర్ మైనస్ పాయింట్స్

సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎంత వరకు ఎదుర్కొంటారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

అబ్బయ్య చౌదరి VS చింతమనేని ప్రభాకర్

ఇప్పటికిప్పుడు దెందులూరులో ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కు 53 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తేలింది. అదే సమయంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అబ్యయ్య చౌదరికి 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఈ సెగ్మెంట్ లో చింతమనేని ప్రభాకర్ కు ఓట్ షేర్ ఎక్కువరావడానికి కారణం… పర్సనల్ ఇమేజ్, అండ్ మాస్ లీడర్ గా గుర్తింపు ఉండడం ఒక కారణం. అలాగే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా కలిసి వచ్చేలా ఉందని సర్వేలో తేలింది. వీటికి తోడు ప్రస్తుత ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం, అభివృద్ధి కార్యక్రమాలు తగినంతగా జరగకపోవడం టీడీపీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎస్సీలు, మత్స్యకార కమ్యూనిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై నెగెటివ్ అభిప్రాయంతో ఉండడం టీడీపీకి కలిసి వస్తోంది. మరోవైపు వైసీపీకి ఓట్ షేర్ రవాడానికి ప్రధాన కారణాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి లబ్దిదారులు ఉంటున్నారు. వారి విశ్వాసాన్ని వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎంత వరకు పొందుతారన్నది కీ ఫ్యాక్టర్ గా మారుతోంది.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×