EPAPER

Narasaraopet Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నరసరావుపేటలో నగారా మోగించేదెవరు ?

Narasaraopet Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నరసరావుపేటలో నగారా మోగించేదెవరు ?
AP Politics

Narasaraopet Assembly Constituency(AP politics):

ఏపీ రాజకీయాల్లో నరసరావుపేట సెగ్మెంట్ కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో నరసరావుపేట లోక్ సభ సెగ్మెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఇక్కడి నుంచే ఎంపీలుగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పారు. సీఎంలు కూడా అయ్యారు. విద్యాకేంద్రంగ, చైతన్యవంతమైన రాజకీయాలు పెట్టింది పేరు ఈ నరసరావుపేట గడ్డ. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే మంచి పదవులు వస్తాయన్న పేరుంది. ఇక్కడ వాణిజ్యపంటలైన మిర్చి, పత్తి పొగాకుతో పాటు వరి, కంది పంటలను ఎక్కువగా పండిస్తారు. రెడ్డి, కమ్మ, బీసీ, ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు ఎక్కువున్న ప్రాంతమిది. అభ్యర్థుల గెలుపోటముల్లో రైతులు, రైతుకూలీలు, వ్యాపారవర్గాలు, ఉద్యోగులదే ప్రధాన పాత్ర. మరి నరసరావుపేట నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి VS చదలవాడ అరవింద్ బాబు


2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 55 శాతం ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చదలవాడ అరవింద్ బాబుకు 38 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి 5 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 2 శాతం ఓట్లు లభించాయి. మరి ఈసారి ఎన్నికల్లో నరసరావుపేట సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

ఎన్నికలు దగ్గరపడడంతో గ్రౌండ్ లో యాక్టివ్

ప్రభుత్వ పథకాలపైనే నమ్మకం

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మైనస్ పాయింట్స్

గోపిరెడ్డికి జనంలో, క్యాడర్ లో అంతగా లేని గుర్తింపు

కార్యకర్తలను పట్టించుకోకపోవడం

అనుకున్నంతగా అభివృద్ధి చెందని సెగ్మెంట్

మట్టి, ఇసుక తరలింపుపై అభియోగాలు

సరైన కాల్వలు లేక రైతులకు ఇబ్బందులు

మిర్చి, వరి, పత్తి స్టోరేజ్ వసతులు లేకపోవడం

రొంపిచర్ల మండలంలో అధ్వాన్నంగా రోడ్లు

పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఫ్లైఓవర్లు కట్టకపోవడం

నరసరావుపేటలో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సప్లై సరిగా లేకపోవడం

చదలవాడ అరవింద్ బాబు (TDP) ప్లస్ పాయింట్స్

జనంలో పాజిటివ్ ఇమేజ్

గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి

గ్రౌండ్ లో యాక్టివ్ గా ప్రచారాలు

ప్రజలకు, క్యాడర్ కు అందుబాటులో ఉండడం

సయ్యద్ జిలానీ (JSP) ప్లస్ పాయింట్స్

జనంలో జిలానీకి మంచి ఇమేజ్ ఉండడం
అభివృద్ధి జరగకపోవడంపై నిలదీతలు
ప్రజా సమస్యలపై పోరాడడం
సయ్యద్ జిలానీ మైనస్ పాయింట్స్
పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కడంపై డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి VS చదలవాడ అరవింద్ బాబు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు 47 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. చదలవాడ అరవింద్ బాబుకు నర్సరావుపేటలో ఈసారి క్యాడర్ మద్దతు బలంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత అరవింద్ బాబు ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే వచ్చారు. అలా పార్టీని, క్యాడర్ ను పట్టు జారకుండా చూసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తుండడం కూడా టీడీపీ గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటికి తోడు టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంలో ఈ పొత్తు ఉపయోగపడుతున్నట్లు తేలింది.

.

.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×