EPAPER
Kirrak Couples Episode 1

Tekkali : బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌.. టెక్కలిలో కింగ్ ఎవరు..?

Tekkali : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హాట్‌ సీటు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా టెక్కలి మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. టెక్కలి పసుపు పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటివరకు 8 సార్లు గెలిచింది. 1994లో టీడీపీని స్థాపించిన నందమూరి తారకరామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి.. 40 వేల 890 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన చరిత్ర టెక్కలి సొంతం. ప్రస్తుతం టీడీపీ ఏపీ చీఫ్‌ కింజరాపు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే అచ్చెన్నను ఢీకొట్టి తమ సత్తా చాటాలని అధికార వైసీపీ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వేవ్‌ కనిపించినా.. టెక్కలిలో మాత్రం వైసీపీ పాచికలు పారలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేయగా అచ్చెన్నాయుడు ఆయనను చిత్తు చేశారు. ఈసారి మాత్రం అచ్చెన్నాయుడపై పోటీ చేసేందుకు గతంలో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించుతోంది. మరి వీరిలో ఎవరికి విజయవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎలక్షన్‌ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.

2019 ఎన్నికల ఫలితాలు

పేరాడ తిలక్ VS కింజరాపు అచ్చెన్నాయుడు ( గెలుపు )

YCP 46 %
TDP 51 %
OTHERS 3 %

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో కింజరాపు అచ్చెన్నాయుడు గెలిచారు. ఆయనకు 51 శాతం ఓట్లు లభించాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్‌కు 46 శాతం ఓట్లు రాగా.. ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల తర్వాత టెక్కలి అంటే అచ్చెన్నాయుడు పెట్టని కోట అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయని చెప్పాలి. వేవ్‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదే అన్నట్టుగా పరిస్థితులను మార్చేశారు అచ్చెన్నాయుడు. మరి ఈసారి ఎన్నికల్లో టెక్కలిలో కింగ్‌ ఎవరన్నది బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కింజరాపు అచ్చెన్నాయుడు ( TDP )

కింజరాపు అచ్చెన్నాయుడు ప్లస్ పాయింట్స్

  • వరుసగా రెండుసార్లు గెలవడం
  • ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి
  • టీడీపీ కీలక నేతల్లో ఒకరు కావడం
  • కలిసి రానున్న రాజకీయ కుటుంబ నేపథ్యం

కింజరాపు అచ్చెన్నాయుడు మైనస్‌ పాయింట్స్

  • మంత్రిగా ఉన్నప్పుడు ఆశించిన అభివృద్ధి జరగకపోవడం
  • దూకుడు స్వభావం

దువ్వాడ శ్రీనివాస్‌ ( YCP )

దువ్వాడ శ్రీనివాస్‌ ప్లస్‌ పాయింట్స్‌

  • వరుసగా ఓడిపోవడంతో సింపతి వచ్చే అవకాశం
  • పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొనడం

దువ్వాడ శ్రీనివాస్‌ మైనస్‌ పాయింట్స్‌

  • నియోజకవర్గానికి కొత్తగా రావడం
  • అచ్చెన్నాయుడి లాంటి బలమైన నేతను ఢీకొట్టడం
  • నియోజకవర్గ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు
  • అనేక గ్రామాల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత
  • అమలు కాని వైసీపీ ప్రభుత్వ హామీలు

కుల సమీకరణలు

కళింగ 32%
తూర్పు కాపు 16%
మత్స్యకారులు 13%
పోలనాటి వెలమ 13%
యాదవ్ 11%
ఎస్సీ 8%

టెక్కలి నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గ ప్రజల జనాభా ఎక్కువ. 32 శాతం ఓటర్లు ఉన్న ఈ సామాజికవర్గ ఓటర్లలో టీడీపీకి 30 శాతం మద్దతు ఇస్తారని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 60 శాతం మంది ఓటర్లు వైసీపీకి, మిగిలిన 10 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని తెలిపారు. సబ్‌ క్యాస్ట్‌గా ఉన్న బోరగాపు కళింగ ప్రజలు మొదటి నుంచి టీడీపీకి మద్దతు తెలుపుతుండగా.. కింటాలా కళింగ ప్రజలు మాత్రం వైసీపీకి బలమైన మద్దతుగా ఉన్నారు. ఇక 16 శాతంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గ ప్రజలు 45 శాతం టీడీపీకి మద్దతు తెలుపుతుండగా.. 50 శాతం మంది వైసీపీకి మద్దతిస్తున్నారు. ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ పథకాలైన వైఎస్‌ఆర్‌ చేయూత, రైతు భరోసా పథక లబ్ధిదారులు వైసీపీకి మద్దతిస్తున్నారు. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం టీడీపీకి మద్దతిస్తున్నట్టు చెబుతున్నారు. 13 శాతం ఉన్న మత్స్యకారులు కూడా అత్యధికంగా 50 శాతం వైసీపీకి మద్దతిస్తున్నారు. అయితే సాంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న 45 శాతం మంది టీడీపీకే జైకొడుతున్నారు. మిగిలిన 5 శాతం మంది ప్రజలు ఇతరులకు మద్దతు పలుకుతున్నారు. అటు 13 శాతం ఉన్న పోలనాటి వెలమ సామాజిక వర్గ ప్రజలు మెజారిటీ టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. అచ్చెన్నాయుడు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో 60 శాతం మంది పసుపు పార్టీకే తమ మద్దతిస్తామని చెబుతున్నారు. ఇక 30 శాతం మాత్రమే వైసీపీకి తమ మద్దతు పలుకుతున్నారు. యాదవ్‌లు 11 శాతం ఉండగా.. టీడీపీకి 55 శాతం మంది, వైసీపీకి 40 శాతం.. ఇతరులకు 5 శాతం మద్దతు పలుకుతున్నారు. 8 శాతం ఉన్న ఎస్సీ సామాజికవర్గ ప్రజల్లో టీడీపీకి 45 శాతం, వైసీపీకి 50 శాతం, ఇతరులకు 5 శాతం తమ మద్దతిస్తామని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

ఇక వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

దువ్వాడ శ్రీనివాస్‌ vs కింజరాపు అచ్చెన్నాయుడు

YCP 46%
TDP 49%
OTHERS 5%

బిగ్ టీవీ సర్వే ప్రకారం టెక్కలిలో ఈ సారి కూడా ఎడ్జ్‌ అచ్చెన్నాయుడుకే ఉన్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న దువ్వాడ శ్రీనివాస్‌కు 46 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ విక్టరీ కోసం ట్రై చేస్తున్న అచ్చెన్నాయుడికి 49 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని తమ సర్వేలో తేలింది. ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కనున్నాయి.

.

.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×