EPAPER

Kandukur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కందుకూరు కింగ్ మేకర్ అతనేనా..?

Kandukur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కందుకూరు కింగ్ మేకర్ అతనేనా..?

Kandukur Assembly Constituency : ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గాల్లో ఒకటి కందుకూరు. ఈ నియోజకవర్గం పేరు వినగానే గుర్తొచ్చేది రెండు కుటుంబాలే. దశాబ్దాల పాటు ఇక్కడ పార్టీలు కాకుండా రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోరు సాగుతోంది. దివి, మానుగుంట కుటుంబ సభ్యులే అత్యధికంగా గెలిచిన సందర్భాలున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పోతుల రామారావు ఆ తరువాత టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మానుగుంట మహీధరరెడ్డి పోటీచేసి గెలిచారు. కానీ ఈ సారి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ నుంచి భారీ సంఖ్యలో టికెట్ ఆశిస్తున్నారు. మరి టికెట్ ఎవరు దక్కించుకునే అవకాశం ఉంది? ఎవరు బరిలో నిలిస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్ చూసే ముందు ఓ సారి 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

మానుగుంట మహీధర్‌ రెడ్డి ( గెలుపు) vs పోతుల రామారావు


YCP 52%
TDP 44%
JANASENA 1%
OTHERS 3%

కందుకూరులో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల రామారావు.. 2016లో టీడీపీలో చేరారు. ఇది 2019 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మానుగుంట మహీధర్‌ రెడ్డి ఏకంగా 52 శాతం ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు పోతుల రామారావుపై ఉన్న వ్యతిరేకత ఆయనకు కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో పోతుల రామారావు కేవలం 44 శాతం ఓటు షేర్‌ సాధించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన పులి మల్లికార్జున రావు ఒక శాతం ఓట్‌ షేర్‌ సాధించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో టికెట్ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీ నుంచి పొతుల రామారావు, ఇంటూరి నాగేశ్వర రావు, ఇంటూరి రాజేష్‌, జనార్ధన్, నళిని దేవి టికెట్ ఆశిస్తుండగా.. వైసీపీ నుంచి మహీధర్ రెడ్డి, రామారావు, బుర్రా మధుసూదన్ యాదవ్, తూమాటి మాధవ రావు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఎవరికి టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయి? అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఎన్నికల సర్వే నిర్వహించింది. ఇప్పుడా వివరాలను పరిశీలిద్దాం.

మానుగుంట మహీధర్ రెడ్డి (YCP)

మానుగుంట మహీధర్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • కలిసి రానున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం
  • టికెట్ ఎవరికి దక్కినా కలిసి పనిచేస్తానని ప్రకటన
  • ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండటం
  • మానుగుంట హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి

ఇంటూరి నాగేశ్వరావు

ఇంటూరి నాగేశ్వరావు ప్లస్ పాయింట్స్

  • స్థానిక నేతగా గుర్తింపు ఉండటం
  • టీడీపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా పేరు
  • కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం
  • కార్యకర్తలకి ఆర్థికంగా సహాయం చేయటం
  • పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడం

ఇంటూరి నాగేశ్వరావు మైనస్ పాయింట్స్

  • కందుకూరులో టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు అధికంగా ఉండటం
  • సొంత బంధువు ఇంటూరి రాజేష్ సపోర్ట్ చేయకపోవడం
  • సొంత వర్గం నుంచి సహకారం అందడంపై అనుమానాలు

ఇక వచ్చే ఎన్నికల్లో కందుకూరు బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

మానుగుంట మహీధర్ రెడ్డి vs ఇంటూరి నాగేశ్వరరావు

YCP 46 %
TDP 49 %
OTHERS 5 %

కందుకూరు గడ్డపై మానుగుంట వర్సెస్ ఇంటూరి బరిలోకి దిగితే వైసీపీ గెలిచే అవకాశాలు 46 శాతం ఉండగా.. టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలిచే అవకాశాలు 49 శాతం ఉందనిబిగ్ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. ఇక ఇతరులకు కేవలం 5 శాతం మాత్రమే అవకాశం ఉంది. మానుగుంట హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు.. ఎమ్మెల్యేపై ఉన్న పాజిటివ్ రెప్యూటేషన్, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను అనుకూలంగా ఉండగా.. టీడీపీ సాంప్రదాయ ఓట్లన్ని ఆ పార్టీకే పడటంతో పాటు నాగేశ్వర రావు స్థానికుడన్న అంశం ఆయనకు కలిసి రానుంది. గత కొన్ని రోజులుగా నాగేశ్వర్ రావు గ్రౌండ్‌ లెవల్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. దీనికి తోడు టీడీపీ, జనసేన పొత్తు కారణంగా నియోజకవర్గంలో ఉన్న 15 శాతానికి పైగా కాపు సామాజిక వర్గ ప్రజలు టీడీపీవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేగాకుండా దివి కుటుంబ రాజకీయం బలం కూడా టీడీపీకి మద్ధతు పలికే అవకాశం ఉండటంతో గెలుపు ఇంటూరినే వరించనుంది.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×