EPAPER

Mydukur Assembly Constituency : మైదుకూరు మొనగాడు ఎవరు? అవినాష్ రెడ్డి పోటీ చేస్తారా?

Mydukur Assembly Constituency : మైదుకూరు మొనగాడు ఎవరు? అవినాష్ రెడ్డి పోటీ చేస్తారా?

Mydukur Assembly Constituency : కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి హాట్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటారన్నది పొలిటికల్ గా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైసీపీ టిక్కెట్ రాకపోతే టీడీపీ లేదంటే జనసేనలో చేరుతారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. నిజానికి గత రెండు టర్మ్ లలో వైసీపీ అభ్యర్థులు గెలవడంలో డీఎల్ రవీంద్రారెడ్డి కీ రోల్ పోషించారు. వైఎస్ ఫ్యామిలీతో డీఎల్ కు అనుబంధం ఉంది. అయితే తాజాగా డీఎల్ ను కాంగ్రెస్ నుంచి బరిలో దింపడం కోసం ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఇక్కడి రాజకీయం అంతా ఆసక్తికరంగా మారింది. మరి ఇన్ని ట్విస్టులు నడుస్తున్న మైదుకూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
రఘురామిరెడ్డి వైసీపీ గెలుపు VS పుట్టా సుధాకర్ యాదవ్
YCP 56%
TDP 39%
OTHERS 5%

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామిరెడ్డి పోటీ చేసి ఏకంగా 56 శాతం ఓట్ షేర్ తో ఘనంగా గెలిచారు. అటు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 5 శాతం ఓట్లు సాధించారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి సపోర్ట్ గా డీఎల్ రవీంద్రారెడ్డి ఉండడం, ఆయన పర్సనల్ క్యాడర్ వైసీపీ గెలుపు కోసం కృషి చేయడంతో ఓట్ షేర్ పెరిగి విజయం సాధ్యమైంది. అయితే ఈసారి డీఎల్ టిక్కెట్ రేసులోకి వచ్చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో మైదుకూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


రఘురామిరెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి సపోర్ట్
  • ప్రభుత్వ పథకాల లబ్దిదారులపైనే ఆశలు

రఘురామిరెడ్డి మైనస్ పాయింట్స్

  • డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం
  • ఇల్లీగల్ గా ఇసుక తరలిపోతుండడం
  • కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు
  • క్యాడర్ ను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయాలు
  • డీఎల్ రవీంద్రారెడ్డి రంగంలోకి దిగడం
  • అనుకున్నంతగా నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడం

వైఎస్ అవినాశ్ రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • జగన్ సోదరుడిగా పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్
  • కడప ఎంపీగా పని చేసిన అనుభవం
  • మైదుకూరు సహా కడప అంతా గుర్తించే లీడర్
  • వికలాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించడం
  • అవసరమైన వారికి ఆర్థిక సహాయాలు చేయడం

వైఎస్ అవినాశ్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • వివేకా హత్య కేసులో లింక్ ఉందని విపక్షాల ఆరోపణలు
  • సీబీఐ ఇది వరకే సమన్లు జారీ చేయడం
  • ఉద్యోగ ఉపాధి కల్పన లేదని యువతలో అసంతృప్తి
  • చెత్త ట్యాక్స్ వేయడంపై అసంతృప్తి

పుట్టా సుధాకర్ యాదవ్ ( TDP ) ప్లస్ పాయింట్స్

  • మైదుకూరు లోకల్ లీడర్ గా గుర్తింపు
  • ప్రజలతో, పార్టీ క్యాడర్ తో సత్సంబంధాలు
  • మైదుకూరు అభివృద్ధి కోసం పోరాడడం
  • గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

పుట్టా సుధాకర్ యాదవ్ మైనస్ పాయింట్స్

  • అధికార పార్టీని ఎంత వరకు ఢీకొంటారన్న సందేహాలు

ఇక వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

రఘురామిరెడ్డి VS పుట్టా సుధాకర్ యాదవ్
YCP 44%
TDP 48%
OTHERS 8%

ఇప్పటికిప్పుడు మైదుకూరులో ఎన్నికలు జరిగి.. వైసీపీ నుంచి రఘురామిరెడ్డి, టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉంటే టీడీపీకే ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి పోటీ చేసే రఘురామిరెడ్డికి 44 శాతం ఓట్లు, పుట్టా సుధాకర్ యాదవ్ కు 48 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ఓడిపోవడం జనంలో సానుభూతి పెంచింది. అదే సమయంలో ఓడినప్పటికీ మైదుకూరునే అంటిపెట్టుకుని ఉండడం, అభివృద్ధి కోసం పోరాడడం టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తు కారణంగా వచ్చే ఓట్లన్నీ ప్లస్ అవనున్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు టీడీపీ ఓట్ షేర్ ఈ సినారియోలో పెరగాడానికి కారణం డీఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ కావడం. ఆయన మైదుకూరులో వైసీపీ టిక్కెట్ రేసులో ఉన్నారు. అయితే టిక్కెట్ ఇస్తే పరిస్థితి ఒకలా ఉండబోతోంది. వైసీపీ టిక్కెట్ రాకపోతే టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తే పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు నల్లేరుపై నడకే అవనుందని సర్వేలో జనం అభిప్రాయంగా తేలింది.

వైఎస్ అవినాశ్ రెడ్డి VS పుట్టా సుధాకర్ యాదవ్
YCP 49%
TDP 47%
OTHERS 4%

ఇక మైదుకూరులో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగి వైఎస్ అవినాశ్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ అవినాశ్ రెడ్డికి 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, పుట్టా సుధాకర్ యాదవ్ కు 47 శాతం ఓట్లు, ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ కి ఓట్ షేర్ పెరగడానికి కారణం అవినాశ్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ఒక కారణం కాగా.. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులు మరో కారణం. అయితే నెగెటివిటీ కూడా బాగానే కనిపిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన లేకపోవడం కీ ఫ్యాక్టర్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×