EPAPER

Kovur Assembly Constituency : కోవూరు కెప్టెన్ మిల్లర్ ఎవరవుతారు.. బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Kovur Assembly Constituency : కోవూరు కెప్టెన్ మిల్లర్ ఎవరవుతారు.. బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Kovur Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ లో కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్ కు చాలా ప్రాధాన్యం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ చాలా బలంగా ఉంది. 1962 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా రెడ్లు మాత్రమే గెలుస్తున్నారు. ఏ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టినా ప్రయోగాల జోలికి వెళ్లకుండా రెడ్డి సామాజికవర్గం లీడర్లనే బరిలోకి దింపుతున్నాయి. ఒక్కోసారి ఒక్కో పార్టీకి అనుకూలంగా కోవూరు తీర్పు ఇస్తోంది. కోవూరు డెల్టా ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ మూడు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నిజానికి కోవూరు సెగ్మెంట్ లో నల్లపరెడ్డి ఫ్యామిలీ, పోలంరెడ్డి ఫ్యామిలీల మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. ఒకరు ఒక పార్టీలో ఉంటే.. మరొకరు ఇంకో పార్టీకి షిఫ్ట్ అవడం కామన్ గా జరుగుతూ వస్తోంది. ఈ రెండు కుటుంబాల నేతలు టీడీపీ గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ మధ్య స్విచ్ అవుతూ వస్తున్నారు. పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కోవూరు పాలిటిక్స్ గరం గరం అయ్యాయి. అసలు కోవూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి VS పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి


YCP 57%
TDP 37%
JSP 3%
OTHERS 3%

కోవూరులో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 57 శాతం ఓట్ షేర్ తో గెలిచారు. టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 37 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన 3 శాతం ఓట్లు సాధించింది. అలాగే ఇతరులు 3 శాతం ఓట్లు రాబట్టారు. అయితే ఈసారి పోలంరెడ్డి తన కొడుకును బరిలో దింపుతున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కోవూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (YCP)

నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ గా గుర్తింపు
  • జనంతో మంచి కమ్యూనికేషన్
  • కరోనా టైంలో చాలా మందికి సహాయాలు
  • ప్రజలకు అందుబాటులో ఉండడం

నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ఇసుక వ్యాపారంపై ఆరోపణలు
  • ప్రసన్నకుమార్ రెడ్డి పెట్టిన మండల ప్రతినిధులతో సమస్యలు

పోలంరెడ్డి దినేష్ రెడ్డి (TDP)

పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • కరోనా టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ
  • నిత్యవసరాలు, ఆర్థిక సహాయాలతో జనంలోకి
  • తండ్రి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వారసత్వం
  • రా .. కదలిరా కార్యక్రమంలో కీలకం
  • బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ నిర్వహణ

పోలంరెడ్డి దినేష్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • రాజకీయాలకు కొత్త కావడం
  • తండ్రి ఓట్ షేర్ ను ఎంత వరకు రాబడుతారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి VS పోలంరెడ్డి దినేష్ రెడ్డి

YCP 46%
TDP 49%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కోవూరులో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి 49 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి 46 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరులు 5 శాతం ఓట్లు సాధించే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. టీడీపీ ఎడ్జ్ పెరగడానికి కారణం.. సంప్రదాయ ఓటు బ్యాంకు మరింత పటిష్టం కావడం. అలాగే టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి దినేష్ రెడ్డి వ్యక్తిగతంగా సెగ్మెంట్ లో ఇమేజ్ పెంచుకోవడం ఇవన్నీ తెలుగుదేశం విజయావకాశాలు పెంచడంలో కీలకంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. నల్లపరెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదన్న అభిప్రాయం జనంలో వ్యక్తమవుతోంది. అంతే కాదు.. ప్రసన్నకుమార్ రెడ్డి పెట్టిన మండల ప్రతినిధుల వ్యవహారం కూడా వారి మెడకే చుట్టుకుందని, వీరు సమస్యల పరిష్కారం కాకుండా మరింత జటిలం చేశారని జనంలో వీరిపై తీవ్ర ఆగ్రహం ఉందని సర్వేలో తేలింది. మరోవైపు జగన్ సంక్షేమ పథకాలతో లబ్ది పొందిన వారు వైసీపీ వైపు చూస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×