EPAPER

Tenali Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. తెనాలిలో గెలుపు వరించేదెవరిని ?

Tenali Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. తెనాలిలో గెలుపు వరించేదెవరిని ?
Latest news in andhra pradesh

Tenali Assembly Constituency(Latest news in Andhra Pradesh):

తెనాలి.. ఆంధ్రా పారిస్‌గా ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి. మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య తెనాలి నుంచి పోటీ చేసినవారే. అలాగే అన్నాబత్తుని సత్యాన్నారాయణ , ఆలపాటి వెంకట్రామయ్య వంటి నేతలు కూడా ఇక్కడ నుంచి గెలిచి మంత్రులయ్యారు. ఇక జనసేనలో అత్యంత కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ కూడా తెనాలి నుంచి పోటీ చేశారు. 2019లో జనసేన తరపున బరిలోకి దిగి మూడోస్థానానికి పరిమితమయ్యారు నాదెండ్ల. వైసీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్‌, టీడీపీ నుంచి మాజీ ఆలపాటి రాజా పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ గెలుపొందారు. మరి గతంలో విడివిడిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన ఈసారి ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో తెనాలిలో సమీకరణాలు మారిపోయాయి. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్‌ చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

అన్నాబత్తుని శివకుమార్ (గెలుపు) vs ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌


2019 ఎన్నికల్లో తెనాలి నుంచి బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన 46 శాతం ఓట్‌ షేర్‌ను సాధించారు. ముఖ్యంగా వైసీపీ వేవ్‌ ఆయన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 37 శాతం ఓట్లను సాధించారు. 2014లో గెలిచినా.. పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓట్లు ఉన్నా.. ఆయన మరోసారి విజయం సాధించలేకపోయారు. దీనికి ముఖ్య కారణం కాపు సామాజిక ఓట్లు చీలడమే అని చెప్పాలి. జనసేన నుంచి బరిలోకి దిగిన నాదెండ్ల మనోహార్‌కు 15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆయనకు ఉన్న పర్సనల్ ఇమేజ్‌కు తోడు.. కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వెంటే నడవడంతో టీడీపీ ఓట్లు దారుణంగా చీలిపోయాయి. దీంతో వైసీపీ విక్టరి కొట్టింది. అయితే ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే జనసేన నేత నాదెండ్ల మనోహార్ తేల్చి చెప్పారు. మరి ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ముందుగా వైసీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ ప్లస్ అండ్ మైనస్‌ పాయింట్స్ ఏంటో చూద్దాం..

అన్నాబత్తుని శివకుమార్ (YCP) ప్లస్ పాయింట్స్

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్‌

ప్రజలతో ఉన్న సత్సంబంధాలు

ఆరోగ్య సమస్యలున్న వారికి ఆర్థిక సహాయం చేయడం

27 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించడం

అన్నాబత్తుని శివకుమార్ మైనస్ పాయింట్స్

నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం

ఇసుక మాఫియా ఆరోపణలు

ప్రశ్నించిన వారిని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు

క్యాడర్‌లోని ఓ వర్గంలో ఉన్న అసంతృప్తి

సొంత వర్గానికే కాంట్రాక్టులు దక్కుతున్నాయన్న ఆరోపణలు

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ (TDP) ప్లస్ పాయింట్స్

ఆలపాటి హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్

టికెట్ ఎవరికి దక్కినా సపోర్ట్ చేస్తానన్న ప్రకటన

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మైనస్ పాయింట్స్

పొత్తులో భాగంగా టికెట్‌ దక్కే అవకాశం లేకపోవడం

తెనాలి నుంచి పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ ప్రకటించడం

నాదెండ్ల మనోహర్‌ (JSP) ప్లస్‌ పాయింట్స్

నియోజకవర్గంలో ఉన్న పాజిటివ్‌ ఇమేజ్‌

రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం

నియోజకవర్గ నేతలతో నిత్యం సమావేశాలు

పార్టీ క్యాడర్ పూర్తిగా సహకరించడం

టీడీపీతో కలిసి రానున్న పొత్తు

కలిసి రానున్న పవన్ కళ్యాణ్‌ ఇమేజ్

కాపు సామాజిక వర్గం పూర్తిగా సహకరించడం

ఇక వచ్చే ఎన్నికల్లో తెనాలి బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

అన్నాబత్తుని శివకుమార్ (YCP) vs నాదెండ్ల మనోహర్‌ (JSP)

ఇప్పటికిప్పుడు తెనాలిలో ఎన్నికలు జరిగి అన్నాబత్తుని శివ కుమార్, నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగితే.. జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. నాదెండ్లకు 54 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. అదే సమయంలో శివకుమార్‌కు కేవలం 41 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు పడనున్నట్టు సర్వే రిపోర్ట్ చెబుతోంది.

నాదెండ్లకు చాలా అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆయన పాజిటివ్‌ ఇమేజ్‌తో పాటు.. 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డ్ ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక టీడీపీతో ఉన్న పొత్తుతో పాటు.. ఆలపాటి ఇప్పటికే పూర్తిగా సహకరిస్తానని ప్రకటించడంతో టీడీపీ ఓట్లు కూడా ఆయనకు మళ్లనున్నాయి. ఇక జనసేనను మొదటి నుంచి ఆదరిస్తున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు ఆయనకు జై కొట్టనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 శాతం కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీటన్నింటితో పాటు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వారు కూడా నాదెండ్లకే జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×