EPAPER

Srisailam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి చక్రం తిప్పుతారా ?

Srisailam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి చక్రం తిప్పుతారా ?
AP Election updates

Srisailam Assembly Constituency(AP election updates):


శ్రీశైలం.. జ్యోతిర్లింగం.. శక్తిపీఠం రెండు కొలువైన పరమపవిత్ర క్షేత్రం శ్రీశైలం. 12 జ్యోతిర్లింగాలు.. 18 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల ఆలయం విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఇక్కడి రాజకీయాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనే చెప్పాలి. 2014లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా.. ఇక్కడ వైసీపీ బంపర్‌ మెజారిటీతో గెలిచింది. ఇక 2019లో అయితే ఏకంగా 60 శాతం ఓట్లను సాధించింది. మరి ఈసారి శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ సమీకరణాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయా? లేక టీడీపీకా? ఏ అభ్యర్థి బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఈ అంశాలన్నింటిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్ధాం.

2019 RESULTS


శిల్పాచక్రపాణి రెడ్డి (గెలుపు) VS బుడ్డా రాజశేఖర్ రెడ్డి

2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వార్‌ వన్‌ సైడ్ అయ్యిందనే చెప్పాలి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి ఏకంగా 61 శాతం ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఆయనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డికి కేవలం 35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన అభ్యర్థిగా పోటీచేసిన సన్నపురెడ్డి సుజలాకు కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వెనుకు ఫ్యాన్‌ గాలీతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగి గెలిచారు. ఆయితే 2017లో ఆయన పార్టీ మారారు. అదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న శిల్పా బ్రదర్స్ వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి మాములుగానే శ్రీశైలం నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. దీనికి తోడు 2019లో వైసీపీ వేవ్ నడిచింది. ఇవే గాకుండా బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు బుడ్డా శేష రెడ్డి కూడా వైసీపీకే తన మద్ధతును ప్రకటించారు. దీంతో టీడీపీ ఓట్‌ షేర్‌ దారుణంగా పడిపోయి కేవలం 35 శాతానికే పరిమితమైంది. ఈ కారణాలన్నింటితో వైసీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే ఈ సారి కూడా వీరిద్దరే మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యారు. మరి తాజా పరిస్థితులు ఎవరికి అనుకులంగా ఉన్నాయో అన్న దానిపై బిగ్‌ టీవీ నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను ఇప్పుడు చూద్దాం.

ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం. ఆయనకు అనుకూలించే, ప్రతికూలించే విషయాలను పరిశీలిస్తే..

శిల్పా చక్రపాణిరెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

ప్రజల్లో ఉన్న సానుకూలత

నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీకి ఉన్న మద్ధతు

స్థానిక సమస్యలపై వేగంగా స్పందించడం

ప్రజలు, క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం

సేవా కార్యక్రమాలు

శిల్పా చక్రపాణిరెడ్డి మైనస్ పాయింట్స్

గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి సారించకపోవడం

సాగునీటి సమస్యలపై కొందరు రైతుల్లో నిరుత్సాహం

అంగన్వాడీ, మున్సిపల్ సిబ్బందిలో ఉన్న వ్యతిరేకత

సున్నిపెంటలో తాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం

ఆత్మకూరు మండలంలో డంప్‌యార్డ్ సమస్య

ఇవి శిల్పా చక్రపాణి రెడ్డి ప్లస్, మైనస్ పాయింట్స్. ఇక టీడీపీ టికెట్ దక్కించుకుంటారని ఆశిస్తున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ఆయన ప్లస్ లు ఏంటి? మైనస్ లు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

బుడ్డా రాజశేఖర్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

స్థానికంగా యాక్టివ్‌గా ఉండటం

ప్రభుత్వ లోపాలను సమర్థవంతంగా ఎత్తిచూపడం

గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి

బుడ్డా రాజశేఖర్ రెడ్డి మైనస్ పాయింట్స్

శిల్పా చక్రపాణికి గట్టి పోటీ ఇవ్వలేరని ప్రజలు భావించడం

Caste Politics

శ్రీశైలం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నవారు ముస్లింలు. మొత్తం ఓటర్లలో వారి వాటా 21 శాతం. 2004 నుంచి ఇక్కడి ముస్లింలంతా కాంగ్రెస్‌కు మద్ధతిస్తూ వస్తున్నారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత జగన్‌ పార్టీకి తమ మద్ధతును కొనసాగిస్తూ వస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 60 శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు. అయితే 35 శాతం మంది మాత్రం టీడీపీ కూటమికి మద్ధతిస్తామన్నారు. ఇక మిగిలిన 5 శాతం మంది ఇతరులకు మద్ధతు పలుకుతున్నారు.

ముస్లింల తర్వాత ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో కూడా 55 శాతం మంది వైసీపీకి మద్ధతు పలుకుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీకి మద్ధతు పలికేలా చేస్తున్నాయి. ఇక 40 శాతం మంది టీడీపీ, జనసేన కూటమికి జైకొడుతున్నారు. వీరిలో టీడీపీ సాంప్రదాయ ఓటర్లతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారు కూడా ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎలాంటి ఫండ్స్‌ అందని వారు కూడా నిరుత్సాహంలో ఉన్నారు.

ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 19 శాతం ఉన్నారు. ఇందులో 60 శాతం మంది వైసీపీకి తమ మద్ధతు పలుకుతున్నారు. వీరంతా కూడా కాంగ్రెస్‌ హయాం నుంచి వైఎస్ కుటుంబానికి మద్ధతు పలుకుతున్న వారే ఉన్నారు. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగేది కూడా ఈ సామాజిక వర్గ నేతే కావడంతో ఆయనకు సపోర్ట్ చేసేవారు 35 శాతం మంది ఉన్నారు. ఇక మిగిలిన 5 శాతం మంది ఇతర పార్టీలకు మద్ధతు పలుకుతున్నారు.

బెస్త సామాజిక వర్గ ప్రజలు 10 శాతం ఉన్నారు. ఇందులో వైసీపీకి 45 శాతం మంది మద్ధతు తెలుపుతుండగా.. టీడీపీ కూటమికి 50 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. మిగిలిన 5 శాతం ఇతరులకు సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు. 6 శాతం ఉన్న ఎస్టీ సామాజిక వర్గ ప్రజల్లో అధికశాతం అంటే 55 శాతం మంది వైసీపీకి జైకొడుతుండగా.. 40 శాతం మంది టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తారని తెలిపారు.

నాలుగు శాతం ఉన్న పద్మశాలి సామాజిక వర్గ నేతల్లో కూడా 40 శాతం మంది వైసీపీకి, టీడీపీ కూటమికి 55 శాతం మంది, ఇతరులకు 5 శాతం మంది సపోర్ట్‌ చేస్తారని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

శిల్పా చక్రపాణి రెడ్డి VS బుడ్డా రాజశేఖర రెడ్డి

ఇక వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో ఎన్నికలు జరిగితే శిల్పా చక్రపాణి రెడ్డి గెలిచేందుకు 51 శాతం అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి 42 శాతం అవకాశం ఉంది. ఇక ఇతరులకు 7 శాతం అవకాశముంది. వైసీపీకి మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌తో పాటు.. ప్రజల్లో సానుకూలత ఉంది. అంతేగాకుండా ప్రభుత్వ పనితీరుతో ఈ నియోజకవర్గ ప్రజలు సంతృప్తి చెందినట్టు సర్వేలో తేలింది. వెలగుగోడు రిజర్వాయర్ పూర్తి చేయడం కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశం. అయితే ప్రభుత్వ తీరుతో సంతృప్తి చెందని వారు మాత్రం టీడీపీకి ఓటు వేయనున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సింపతి ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×