EPAPER

Nellore Rural Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నెల్లూరు రూరల్ వార్ లో నెగ్గేదెవరు ?

Nellore Rural Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నెల్లూరు రూరల్ వార్ లో నెగ్గేదెవరు ?
AP Updates

Nellore Rural Assembly Constituency(AP updates):

నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ నుంచి గెలిచి పెత్తనం చెలాయించిన ఈ నేత.. కొన్ని రోజుల క్రితం ఫ్యాన్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసి సైకిల్‌పై సవారీకి సై అన్నారు. మాములుగా ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానిదే హవా. గత మూడు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడా నేతలే పరస్పర విమర్శలతో నెల్లూరు రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కించారు. మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న కోటంరెడ్డి ఇప్పుడు టీడీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. మరోవైపు కోటంరెడ్డి స్థానంలో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. మరి వైసీపీని మట్టి కరిపిస్తానంటున్న కోటంరెడ్డి వ్యాఖ్యలు నిజమవుతాయా? ఆదాల వైసీపీ జెండా ఎగురవేస్తారా? అసలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉంది? అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (గెలుపు) VS అబ్దుల్ అజీజ్ షేక్


2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రెండోసారి బరిలోకి దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకు ఏకంగా 52 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన అబ్దుల్ అజీజ్‌ షేక్‌కు 39 శాతం ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన చెన్నారెడ్డి 5 శాతం ఓట్లను సాధించారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌లో చిత్రమైన పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి. వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి రెండోసారి టికెట్ దక్కించుకోగా.. టీడీపీ టికెట్ కేటాయించిన అదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొని ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో వైసీపీ నేత, అంతకుముందు మేయర్‌గా పనిచేసిన అజిజ్ షేక్‌ టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. అయితే కోటంరెడ్డి పాజిటివ్ ఇమేజ్‌.. ఆ ఎన్నికల్లో కనిపించిన జగన్ వేవ్.. ఆయన గెలుపును సునాయాసం చేశాయి.

అయితే ఈసారి పరిస్థితులు మరింత విచిత్రంగా మారాయి. అధిష్టానంతో విబేధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని.. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తాను ఈసారి టీడీపీ గుర్తుపై పోటీ చేస్తున్నానన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. కోటంరెడ్డి పార్టీ మారడంతో ఆదాలను బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. మరి ఈసారి నెల్లూరు రూరల్ సెగ్మెంట్‌లో వీరిద్దరు బరిలోకి దిగితే ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

వరుసగా రెండుసార్లు గెలవడం

గ్రౌండ్ లెవల్‌లో చాలా యాక్టివ్‌గా ఉండటం

సొంత క్యాడర్ ఉండటం

ఆయన వెంటే కీలక నేతలు కూడా టీడీపీలో చేరడం

ఇంటింటికి కోటంరెడ్డి కుటుంబం పేరుతో నిర్వహించిన కార్యక్రమం

ఒక్కడే.. ఒంటరిగా.. పేరుతో నిర్వహించిన పాదయాత్ర

ఇవి కోటంరెడ్డి ప్లస్ పాయింట్స్ కాగా.. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మైనస్ పాయింట్స్

వైసీపీ క్యాడర్‌ పూర్తిగా సహకరించకపోవడం

అదాల ఎంట్రీతో మారిన సీన్‌

నియోజకవర్గాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్య

ఇవి టీడీపీ నుంచి బరిలోకి దిగే కోటంరెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

ఆదాల ప్రభాకర్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

కలిసిరానున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం

ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉండటం

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్

ఆదాల ప్రభాకర్ రెడ్డి మైనస్ పాయింట్స్

గ్రౌండ్ లెవల్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

ఆదాల ప్రభాకర్ రెడ్డి VS కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఇప్పటికిప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే.. వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి బరిలో దిగే ఆదాల ప్రభాకర్ రెడ్డికి 43 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 42 శాతం ఓట్లు, ఇతరులకు 15 శాతం ఓట్లు వస్తాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

నిజానికి కోటంరెడ్డికి బలమైన వర్గం ఉన్నా.. ఆదాల ఎంట్రీతో సీన్ మారినట్టు తెలుస్తోంది. ఆయనకు ఉన్న పాజిటివ్ ఇమేజ్‌కు తోడు సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వైసీపీ సాంప్రదాయ ఓటర్లు ఆయనకు మద్ధతు పలుకుతున్నారు. ఈ కారణాల కారణంగానే కోటంరెడ్డి కంటే ఒక్క శాతం ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అయితే కోటంరెడ్డితో పాటు వైసీపీ కీలక నేతలు కూడా టీడీపీ కండువా కప్పుకోవడం ఆయనకు ప్లస్‌గా మారింది.

.

.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×