EPAPER
Kirrak Couples Episode 1

Mangalagiri Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ కు అనుకూలంగా ఉందా ?

Mangalagiri Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ కు అనుకూలంగా ఉందా ?
AP political news

Mangalagiri Assembly Constituency(AP political news):


ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి నియోజకవర్గం చాలా ప్రత్యేకం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు షర్మిలతోనే అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ నియోజకవర్గం రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా కీలకం. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి ఆలయం ప్రాచీనమైనది. మంగళగిరి హ్యాండ్లూమ్ కూడా ప్రసిద్ధి చెందింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయినా ఈ ప్రాంత ప్రజలు లోకేష్ ను ఓడించారు. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ అమరావతిని పక్కన పెట్టేసింది. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెచ్చింది. మరి ఈసారి మంగళగిరి ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతోందో సర్వే రూపంలో వారి అభిప్రాయాలు రాబట్టింది బిగ్ టీవీ. మంగళగిరి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS


ఆళ్ల రామకృష్ణారెడ్డి VS నారా లోకేష్

2019 ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలిచింది. ఇక్కడ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేశారు. అయితే అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డితో పోటీలో 5337 ఓట్లతో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే గెలవడానికి ప్రధాన కారణం.. టీడీపీ హయాంలో సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల మంగళగిరిని పూర్తిస్థాయి అభివృద్ధి చేయలేకపోయానని మరోసారి గెలిపిస్తే అన్నీ కంప్లీట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో నమ్మిన జనం.. మరోవైపు లోకేష్ నిలబడ్డా ఆర్కేకే ఓటు వేసి గెలిపించారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో భూముల వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలు టీడీపీని దెబ్బతీశాయి. గత ఎన్నికల్లో మంగళగిరిలో జనసేన, సీపీఐ పొత్తుతో కమ్యూనిస్ట్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. మరి ఇప్పుడు పరిస్థితులు మారాయ్, పరిణామాలు మారాయ్. వైసీపీ అభ్యర్థి మారారు. లోకేష్ మరో పరీక్షకు సిద్ధమయ్యారు. మరి ఈసారి ఎన్నికల్లో మంగళగిరి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

గంజి చిరంజీవి (YCP)

మంగళగిరిలో 14 ఏళ్లుగా మంచి పరిచయాలు
సెగ్మెంట్ లో పెరిగిన వ్యక్తిగత ఇమేజ్
2014లో కేవలం 12 ఓట్లతో ఓడిన సానుభూతి
ప్రజలకు అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం

గంజి చిరంజీవి మైనస్ పాయింట్స్

అమరావతి ఉద్యమంలో పాల్గొనకపోవడం
రాజధాని ప్రాంత వాసులు ఏమేరకు కలిసివస్తారన్న డౌట్లు
మంగళగిరిలో సమస్యలు పరిష్కారం కాకపోవడం
పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం
భూములిచ్చిన రైతులు వ్యతిరేకంగా ఉండడం
కల్వెలపూడి, రేవేంద్రపాడు మధ్య బ్రిడ్జి పూర్తవకపోవడం
దుగ్గిరాల మండలంలో డ్రైనేజ్, తాగునీటి సమస్యలు

నారా లోకేష్ ప్లస్ పాయింట్స్

యువగళం పాదయాత్రతో జనానికి దగ్గరవడం
గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి
అమరావతి ప్రాంత వాసుల మద్దతు
వైసీపీపై పెరిగిన అసంతృప్తి
మంగళగిరిలో టీడీపీ కార్యకలాపాల్లో వేగం పెరగడం
అమరావతినే తిరిగి రాజధాని చేస్తామన్న హామీలు
లోకేష్ తో మంగళగిరి అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్న నమ్మకం
టీడీపీ-జనసేన పొత్తుతో విజయానికి దగ్గరి మార్గం

Caste Politics

మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా 27 శాతంగా ఉంది. ఇందులో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అదే సమయంలో పద్మశాలి వర్గం 15 శాతం ఉంది. వైసీపీ నుంచి బరిలో దిగుతున్న గంజి చిరంజీవిది ఇదే సామాజికవర్గం. అయినప్పటికీ 45 శాతం మంది మాత్రమే వైసీపీ వైపు నిలుస్తామని సర్వేలో చెప్పారు. అదే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 50 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు ఇస్తామన్నారు. అదే సమయంలో కాపు సామాజికవర్గం కూడా బలంగానే అంటే 11 శాతంగా ఉంది. ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి.. నారా లోకేష్ కు కాపు సామాజికవర్గం గుంపగుత్తగా సపోర్ట్ ఇస్తుందన్న నమ్మకంతో టీడీపీ వర్గాలు ఉన్నాయి.

సర్వేలోనూ 35 శాతం మంది కాపులు వైసీపీకి సపోర్ట్ ఇస్తామంటే.. 60 శాతం మంది టీడీపీ జనసేనకు మద్దతుగా ఉంటామన్నారు. 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో వెల్లడించారు. ఇక యాదవ వర్గం 10 శాతంలో 40 శాతం వైసీపీ వైపు, 55 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామన్నారు. కమ్మ సామాజికవర్గం 8 శాతంగా ఉంది. ఇందులో 30 శాతం వైసీపీ, 65 శాతం టీడీపీ, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామన్నారు. మొత్తంగా కుల సమీకరణాలు కాకుండా రాజధాని ప్రాంత సెంటిమెంట్ ఆధారంగా ఓటింగ్ జరిగితే టీడీపీకి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుందన్న అంచనాలతో ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

గంజి చిరంజీవి VS నారా లోకేష్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంగళగిరిలో టీడీపీకే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది.. నారా లోకేష్ 51 శాతం ఓట్లు రాబట్టి గెలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి 42 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తేలింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ సెగ్మెంట్లో బలంగా కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పాదయాత్ర వేవ్ కనిపిస్తోంది. పాదయాత్రలో అన్ని సామాజికవర్గాలను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. జనంతో మమేకం అయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చారు. పాదయాత్ర సమయంలో తమకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకున్న వారికి చేయాల్సిన ఆర్థిక సహాయాలు వెను వెంటనే చేశారు. అంతే కాదు.. మంగళగిరిని మరో ఐటీ హబ్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పన ఉద్యోగావకాశాలు కల్పిస్తానని లోకేష్ హామీలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా లోకేష్ పట్ల సానుభూతి పెరగడానికి కారణమైందని సర్వేలో తేలింది. వీటితోపాటు అమరావతి నుంచి రాజధానిని తరలించిన ఇష్యూ కూడా ఎలక్షన్ లో చాలా ప్రభావం చూపుతుందని సర్వేలో వెల్లడైంది.

.

.

Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×