EPAPER
Kirrak Couples Episode 1

Achanta Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఆచంట ప్రజలు పితానికే పట్టం కడతారా..?

Achanta Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఆచంట ప్రజలు పితానికే పట్టం కడతారా..?
Achanta Assembly Constituency

Achanta Assembly Constituency : ఆచంట.. ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారం అని పిలుచుకునే ఈ నియోజకవర్గం పోరాటాల కోట. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ఏ ప్రజాపోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి 1962లో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకూ ఇది ఎస్సీ రిజర్వుడుగా ఉన్న నియోజకవర్గం.. పునర్విభజనలో 2009లో జనరల్‌ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ప్రత్యర్థి పితాని సత్యనారాయణపై 12 వేలకు పైగా ఓట్ల మెఎజారిటీతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో ఈ సారి గెలుపు ఎవరిది కానున్నది..? ఎవరి బలాలు ఎలా ఉన్నాయి? ఓ సారి పరిశీలిద్దాం. అంతకు ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిద్దాం.


2019 RESULTS : చెరుకువాడ శ్రీరంగనాథ రాజు vs పితాని సత్యానారాయణ

YCP 48%
TDP 37%
JANASENA 10%
OTHERS 5%


క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీరంగనాథ రాజు.. 2019లో 12 వేల 886 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం ఆచంటలో సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

శ్రీరంగనాథ రాజు (వైసీపీ)

శ్రీరంగనాథ రాజు ప్లస్‌పాయింట్స్‌

  • ప్రజల్లో ఇప్పటికీ మంచి పేరు ఉండటం
  • పార్టీకి విధేయుడిగా, క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం
  • సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం

శ్రీరంగనాథ రాజు మైనస్‌ పాయింట్స్‌

  • 2019 ఎన్నికల హామీలను పూర్తిగా నేరవేర్చకపోవడం
  • ప్రజలతో కఠినంగా వ్యవహరించడం
  • ఓ వర్గం క్యాడర్‌ ఆయనపై అసంతృప్తితో ఉండటం
  • లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ నిర్మించపోవడం

పితాని సత్యనారాయణ (టీడీపీ)

పితాని సత్యనారాయణ ప్లస్‌పాయింట్స్‌

  • గత ఎన్నికల్లో ఓడినా యాక్టివ్‌గా ఉండటం
  • ప్రజలతో సత్సంబంధాలు ఉండటం
  • నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గ వ్యక్తి కావడం

పితాని సత్యనారాయణ మైనస్‌ పాయింట్స్‌

  • టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య సమన్వయ లోపం
  • మళ్లీ శ్రీరంగనాథ రాజు బరిలోకి దిగడం

చేగొండి సూర్యప్రకాశ్‌ (జనసేన)

చేగొండి సూర్యప్రకాశ్‌ ప్లస్‌పాయింట్స్‌

  • కాపు సామాజిక వర్గ నేత హరిరామజోగయ్య కుమారుడు కావడం

చేగొండి సూర్యప్రకాశ్‌ మైనస్‌ పాయింట్స్‌

  • ప్రజల్లో ఎక్కువగా లేకపోవడం
  • హరిరామ జోగయ్య కుమారుడిగా మాత్రమే పరిచయం

కులాల వారీగా
శెట్టిబలిజ 29%
ఎస్సీ 19%
కాపు 15%
రెడ్డి 11%
గౌడ్స్ 8%
క్షత్రియ 5%

ఈసారి ఆచంటలో మారిన రాజకీయ సమీకరణాలు, జనసేనతో పొత్తు కారణంగా గతంలో కంటే పరిస్థితులు మారే అవకాశం ఉందని బిగ్‌టీవీ సర్వేలో తేలింది. ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజ సామాజిక వర్గంలో 29 శాతం ఉండగా.. టీడీపీ, జనసేనకు 60 శాతం, వైసీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. ఎస్సీ సామాజికవర్గ ఓటర్లు 19 శాతం ఉండగా టీడీపీ, జనసేనకు 35 శాతం, వైసీపీకి 60 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. కాపు ఓటర్లు 15 శాతం ఉండగా.. ఇందులో టీడీపీ, జనసేనకు 60 శాతం, వైసీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక ఓటర్లు 11 శాతం ఉండగా.. ఇందులో టీడీపీ, జనసేనకు 35 శాతం, వైసీపీకి 60 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. గౌడ్ సామాజిక వర్గ ఓటర్లు 8 శాతం ఉండగా.. టీడీపీ ప్లస్ జనసేన, వైసీపీకి సమంగా 45 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఇతరులకు 10 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు 5 శాతం ఉండగా.. ఇందులో టీడీపీ, జనసేనకు 55 శాతం, వైసీపీకి 40 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు పడతాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే.. ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

శ్రీరంగనాథరాజు vs పితాని సత్యనారాయణ

TDP 49%
YCP 46%
ఇతరులు 5 %

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆచంటలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ నుంచి శ్రీరంగనాథరాజు, టీడీపీ-జనసేన పొత్తులో పితాని సత్యనారాయణ రంగంలోకి దిగే అభ్యర్థిని ఢీకొంటే శ్రీరంగనాథ రాజుకు 46 శాతం గెలుపు అవకాశం ఉండగా.. పితాని సత్యనారాయణకు 49 శాతం అవకాశం ఉంది. మొత్తంగా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎడ్జ్‌ ఎక్కువగా ఉన్నట్లు బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related News

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Big Stories

×