EPAPER

Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?

Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?

Gudivada : ఆంధ్రాలో అన్నిటికంటే గరం గరం పొలిటికల్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది గుడివాడే. గుడివాడ రాజకీయం మామూలుగా ఉండదు. తొడ కొట్టడాలు, మీసం తిప్పడాలు, పంచ్ డైలాగ్‌లు ఒక్కటేమిటి అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. కొడాలి నాని గుడివాడను కంచుకోటగా చేసుకున్నారు. వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఇప్పుడు ఐదోసారీ సై అంటున్నారు. అయితే ఇప్పుడు నానిని ఎలాగైనా ఓడించాలన్న గట్టి టార్గెట్‌తో టీడీపీ ఉంది. అందుకే ఈ గుడివాడ సెగ్మెంట్ చాలా వేడెక్కుతోంది. ఎన్టీఆర్ టైం నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్ .. గత పదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయింది. ఇప్పుడు మరో పరీక్షకు సిద్ధమైంది. కమ్మ సామాజికవర్గం తక్కువే అంటే కేవలం 5 శాతం జనాభానే ఉన్నా… ఇక్కడ ఆ కమ్యూనిటీ నేతలదే పూర్తి హవా. ప్రధాన పార్టీలన్నీ కమ్మ సామాజికవర్గం నేతలనే బరిలో దింపుతుంటాయి. ఎన్టీఆర్ 1983, 1985లో గుడివాడ నుంచే పోటీ చేశారు. 2019లో కొడాలి నానిపై టీడీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ఆ తర్వాతి కాలంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇంతగా వేడెక్కిస్తున్న గుడివాడ ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..
కొడాలి నాని (గెలుపు ) VS దేవినేని అవినాశ్
YCP 53%
TDP 42%
OTHERS 5%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన కొడాలి నాని గెలిచారు. ఆయనకు 53 శాతం ఓట్లు లభించాయి. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ కు 42 శాతం ఓట్లు రాగా…ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కాయి. గుడివాడ అంటే కొడాలి నాని అన్నంతగా మారిపోయింది. పార్టీ సెంట్రిక్ కాకుండా.. లీడర్ సెంట్రిక్ గా ఇక్కడి పాలిటిక్స్ మారిపోయాయి. కొడాలి నాని చుట్టూనే గుడివాడ రాజకీయం తిరుగుతోంది. కొడాలి నాని ఏ పార్టీలో ఉంటే అక్కడ ఆయనదే గెలుపు అన్నట్లుగా సీన్ మారిపోయింది. వరుసగా నాలుగు సార్లు గెలవడమే ఇందుకు కారణం. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా…ఇప్పుడు కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. నిజానికి కొడాలి టీడీపీలో ఉన్నప్పుడు టిక్కెట్ రావడానికి ప్రధాన కారణం హరికృష్ణ. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఏ మాట అన్నా కొడాలి నాని నుంచి ఘాటు రిప్లై వస్తుంటుంది. వాళ్లతో అలా అనుబంధం ఉంటే.. చంద్రబాబుతో మాత్రం విబేధించి వేరు పడ్డారు. మరి ఈసారి ఎన్నికల్లో గుడివాడ రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


కొడాలి నాని ప్లస్ పాయింట్స్

  • గుడివాడలో రోజురోజుకూ బలం పెంచుకోవడం
  • ప్రజల్లో సొంత ఇమేజ్‌ను పెంచుకోవడం

కొడాలి నాని మైనస్ పాయింట్స్

  • నాలుగుసార్లు గెలవడంతో తీవ్రమవుతున్న ప్రజా వ్యతిరేకత
  • విపక్ష నేతలపై అసభ్యకరమైన భాష వాడడం
  • నోటి నుంచి తరచూ అన్ పార్లమెంటరీ పదాలు
  • గుడివాడ టౌన్ సమీపంలో భూకబ్జా ఆరోపణలు
  • సొంత ఫంక్షన్ హాల్ ను కేసినోకు రెంట్ కు ఇచ్చారన్న ఆరోపణలు

వెనిగండ్ల రాము ప్లస్ పాయింట్స్

  • గుడివాడలో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం
  • మెడికల్ క్యాంప్‌లు, జాబ్ మేళాల నిర్వహణ
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా ప్రచారాలు
  • అన్న క్యాంటీన్ ద్వారా అన్నార్థులకు ఆహారం
  • నానికి టఫ్ ఫైట్ ఇచ్చే కెపాసిటీ రాము సొంతం

వెనిగండ్ల రాము మైనస్ పాయింట్స్

  • ఓటర్ మైండ్ సెట్ ఎంతవరకు మార్చుతారన్న డౌట్లు

కుల సమీకరణలు
ఎస్సీ మాల 17%
ఎస్సీ మాదిగ 12%
కాపు 14%
యాదవ్ 12%
రెడ్డి 9%
ముస్లిం 8%
కమ్మ 5%

గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీల జనాభా ఎక్కువగా ఉంది. ఎస్సీ మాల కమ్యూనిటీలో 50 శాతం వైసీపీకి, టీడీపీకి 45 శాతం, ఇతరులకు 5 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అలాగే మాదిగ సామాజికవర్గంలో జగన్ పార్టీకి 40 శాతం, టీడీపీకి 55 శాతం ఇతరులకు 5 శాతం సపోర్ట్ ఇస్తామని తెలిపారు. కీలకమైన కాపు సామాజికవర్గంలో 45 శాతం మంది వైసీపీకి, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 45 శాతం, ఇతరులకు పది శాతం సపోర్ట్ ఇస్తామని సర్వేలో తెలిపారు. కాపు నేస్తం స్కీం సహా డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్సీ ఇవ్వడంతో కాపుల్లో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. అదే సమయంలో కాపు సామాజికవర్గం నేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులో ఉండడంతో ఆ ఎఫెక్ట్ తో అటువైపు కూడా కొందరు చూస్తున్నారు. ఇక యాదవ సామాజికవర్గంలో 40 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామంటున్నారు. అటు రెడ్డి కమ్యూనిటీలో 60 శాతం వైసీపీకి, 35 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. ముస్లింలలో 50 శాతం జగన్ పార్టీకి, 40 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు కమ్మ సామాజికవర్గంలో 35 శాతం వైసీపీకి, 60 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…
కొడాలి నాని VS వెనిగండ్ల రాము
YCP 49%
TDP 46%
OTHERS 5%

బిగ్ టీవీ సర్వే ప్రకారం గుడివాడలో ఈసారి టఫ్ ఫైట్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ తరపున బరిలో ఉండే కొడాలి నాని 49 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 46 శాతం ఓట్లు రాబట్టుతారని సర్వేలో తమ అభిప్రాయంగా జనం చెప్పారు. ఇతరులకు 5 శాతం ఓట్లు దక్కనున్నాయి.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×