EPAPER

Chirala Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. చీరాలలో సీటును నిలబెట్టుకునేది ఎవరు ?

Chirala Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. చీరాలలో సీటును నిలబెట్టుకునేది ఎవరు ?

Chirala Assembly Constituency: ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో చీరాల ఒకటి. ఇక్కడి టెక్స్ టైల్ ఇండస్ట్రీ కారణంగా దీన్ని మినీ ముంబైగా పిలుచుకుంటారు. ఏపీలో అతిపెద్ద టెక్స్ టైల్ మార్కెట్ కూడా చీరాలలోనే ఉంది. అలాగే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేసిన కొణిజేటి రోశయ్య కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందిన వారు. 1989, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఈ నియోజకవర్గంలో దేవాంగ కమ్యూనిటీకి చెందిన జనాభా 19 శాతం ఉంటే.. 15 శాతం జనాభా పద్మశాలి వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఆమంచి బ్రదర్స్ వర్సెస్ కరణం బలరాం వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుంటుంది. ఆమంచి కృష్ణమోహన్‌ను పక్కనే ఉన్న పరుచూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని పంపించారు జగన్. అయితే కృష్ణమోహన్ మాత్రం విముఖంగా ఉన్నారు. అటు ఆమంచి సోదరుడు ఇటీవలే జనసేనలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మరి చీరాల నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

కరణం బలరాం (గెలుపు) VS ఆమంచి కృష్ణమోహన్


2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చీరాలలో గెలిచారు. 53 శాతం ఓట్ షేర్ సాధించారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ 42 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చాయి. అయితే వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కరణం బలరాంకు బలంగా పని చేసింది. అటు వరుసగా రెండుసార్లు గెలిచిన ఆమంచికి గత ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. నియోజకవర్గం అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోవడం, వరుసగా రెండుసార్లు గెలవడంతో మొదలైన సహజ వ్యతిరేకత గత పోల్స్‌లో స్పష్టంగా కనిపించింది. మరి ఈసారి ఎన్నికల్లో చీరాల సెగ్మెంట్‌లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కరణం వెంకటేశ్ (YCP) ప్లస్ పాయింట్స్

తండ్రి కరణం బలరాం రాజకీయ వారసత్వం
బలరాం హయాంలో స్కూల్స్, రోడ్లు బాగు చేయడం
పార్టీలో యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం
జనంలో పాజిటివ్ పబ్లిక్ టాక్

కరణం వెంకటేశ్ మైనస్ పాయింట్స్

డ్రైనేజ్ కోసం చేపట్టిన కొండేరు కెనాల్ అన్ని ప్రాంతాలను కవర్ చేయకపోవడం
చీరాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కట్టకపోవడం
కరెంట్ సమస్యలు, తరచూ విద్యుత్ కోతలు
వేటపాలెం మండలలో బస్టాండ్ లేకపోవడం

ఎం.ఎం. కొండయ్య (TDP) ప్లస్ పాయింట్స్

  • సీనియర్ టీడీపీ నేతగా జనంలో గుర్తింపు
  • కరణం బలరాం పార్టీని వీడడంతో కొండయ్యకు ఇంఛార్జ్ బాధ్యతలు
  • జనం సమస్యల పరిష్కారం కోసం చొరవ
  • టీడీపీ కార్యక్రమాలను సెగ్మెంట్‌లో విస్తృతం చేయడం
  • క్యాడర్‌కు సహాయ సహకారాలు అందించడం

ఆమంచి కృష్ణమోహన్ (INDP) ప్లస్ పాయింట్స్

  • చీరాల సెగ్మెంట్‌లో బలమైన నేతగా ఆమంచికి గుర్తింపు
  • రాజకీయాలను శాసించేలా కెపాసిటీ
  • ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సిగ్నల్స్

ఆమంచి కృష్ణమోహన్ మైనస్ పాయింట్స్

  • చీరాలలో యాక్టివిటీస్ తగ్గించడం
  • గతంలో వచ్చిన ఆరోపణల ఎఫెక్ట్

ఇక వచ్చే ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

కరణం వెంకటేశ్ VS ఎం.ఎం. కొండయ్య

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీరాలలో ఒక సినారియో ప్రకారం టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఆమంచి కృష్ణమోహన్ ఒకవేళ కరణం కుటుంబానికి సపోర్ట్ ఇవ్వకపోతే టీడీపీ అభ్యర్థికి 47 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్‌కు 44 శాతం ఓట్లు, ఇతరులకు 9 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆమంచి కృష్ణమోహన్‌ను పక్కనే ఉన్న పరుచూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. ఆయన్ను పరుచూరు వైసీపీ ఇంఛార్జ్‌గా కూడా నియమించారు. అయితే అది తనకు కొత్త నియోజకవర్గం కావడంతో చీరాల నుంచే అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలడం వంటి పరిస్థితులతో వైసీపీ చీరాలలో వెనుకంజ వేసే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీపై పాజిటివ్ ఇమేజ్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

కరణం వెంకటేశ్ VS ఆమంచి కృష్ణమోహన్

ఇక మరో సినారియో ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి సపోర్ట్ ఇస్తే చీరాలలో కరణం వెంకటేశ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఆమంచి సపోర్ట్‌తో కరణం వెంకటేశ్ పోటీ చేస్తే ఆయనకు ఏకంగా 51 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక టీడీపీకి 44 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం చేసిన అభివృద్ధికి తోడు ఆమంచి సపోర్ట్ చేస్తే వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని సర్వే రిపోర్ట్‌లో తేలింది. ఆమంచి కృష్ణమోహన్‌కు చీరాలలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆయన సోదరుడు ఆమంచి శ్రీనివాస్ ఇటీవలే జనసేనలో చేరారు. ఆయన మద్దతు టీడీపీవైపు ఉన్నా.. కృష్ణమోహన్ సపోర్ట్ ఇస్తే గనుక వైసీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి.

Related News

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Big Stories

×