EPAPER

Vizag East Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. విశాఖ తూర్పులో ఉదయించేదెవరు ?

Vizag East Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. విశాఖ తూర్పులో ఉదయించేదెవరు ?
Latest News in andhra pradesh

Big TV Survey in Vizag East Assembly Constituency (Latest news in Andhra Pradesh):

విశాఖ తూర్పు నియోజకవర్గం గత కొన్నేళ్లుగా తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ఏపీ మొత్తం జగన్ వేవ్ వీసినా.. విశాఖ లో మాత్రం టీడీపీ సత్తా చాటింది. విశాఖలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ గెలిచింది సైకిల్ పార్టీ. అలా టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచిన స్థానాల్లో ఒకటి విశాఖ తూర్పు నియోజకర్గం. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక విజయాలను సాధించారు స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. గత రెండు ఎన్నికల్లో వెలగపూడికి ధీటైన నాయకుడిని దింపడంలో వైసీపీ ఫెయిల్ అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఈ సారి ఒక్క ఈ నియోజకవర్గంపైనే కాదు.. మొత్తం విశాఖపైనే స్పెషల్ ఫోకస్‌ పెట్టింది వైసీపీ. ఈ తీరప్రాంత నగరాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మార్చి.. తన మకాంని అమరావతి నుంచి ఇక్కడికి మార్చేయాలనుకున్నారు సీఎం జగన్. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో జెండా పాతేయాలని చూస్తున్నారు. అందుకే కీలక నియోజకవర్గమైన తూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాదు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఈ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా రంగంలోకి దింపుతున్నారు. అంగ, అర్ధబలాలు ఉన్న వెలగపూడికి సమ ఉజ్జీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ బరిలోకి దిగడంతో విశాఖ తూర్పు పోరు హాట్ హాట్ గా మారింది. మరి టీడీపీ హవాకు బ్రేక్‌ పడుతుందా? ఎంవీవీ ఈ సారి మ్యాజిక్‌ చేస్తారా? అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.


2019 RESULTS

వెలగపూడి రామకృష్ణబాబు (గెలుపు) vs అక్కరమాని విజయ నిర్మల


2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వేవ్‌ కనిపించినా విశాఖ తూర్పులో మాత్రం ఆ ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో ఏకంగా 50 శాతం ఓట్లు సాధించారు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అక్కరమాని విజయ నిర్మల కేవలం 35 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో 15 శాతం ఓట్ల మార్జిన్‌తో బంపర్‌ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు వెలగపూడి. అయితే ఆయన గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న పాజిటివ్‌ ఇమేజ్‌తో పాటు అంతకుముందు వచ్చిన హుద్‌హుద్‌ తుపాన్ సమయంలో టీడీపీ సర్కార్ నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రజలు గుర్తుంచుకున్నారు. హుద్‌హుద్‌ సమయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు వైజాగ్‌లోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న విశాఖ తూర్పు ప్రజలు ఆయనకు మరోసారి అధికారం కట్టబెట్టారు.

మరోవైపు వైసీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల మాములుగానే నియోజకవర్గంలో అంత గుర్తింపు ఉన్న నేత కాకపోవడం.. దీనికి తోడు స్థానిక వైసీపీ నేత వంశీ కృష్ణ నుంచి సరైన సహాకారం లేకపోవడంతో ఆమెకు ఓటమి తప్పలేదు. ఇక జనసేన నుంచి బరిలోకి దిగిన కోన తాతారావు కూడా 10 శాతం ఓట్లను సాధించారు.

ఇది 2019 ఎన్నికల నాటి పరిస్థితి. మరి ఈసారి వైసీపీ వ్యూహాలు మారాయి. ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దింపుతోంది వైసీపీ. మరి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిపై బిగ్ టీవీ నిర్వహించిన ఎలక్షన్‌ సర్వే వివరాలను ఇప్పుడు చూద్దాం.

ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు ప్లస్‌ అండ్ మైనస్‌ పాయింట్స్ ఏంటో చూద్దాం..

వెలగపూడి రామకృష్ణబాబు (TDP) ప్లస్ పాయింట్స్

ఇప్పటికి మూడు సార్లు వరుసగా గెలుస్తూ రావడం

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్

వివాదాలకు దూరంగా ఉండటం

అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం

ప్రజల మనిషిగా గుర్తింపు పొందడం

కలిసి రానున్న జనసేనతో పొత్తు

పూర్తిగా సహకరించే క్యాడర్

వెలగపూడి రామకృష్ణబాబు మైనస్ పాయింట్స్

నియోజకవర్గంలో పెద్దగా జరగని అభివృద్ధి

ఎంవీవీ సత్యనారాయణ (YCP)ప్లస్ పాయింట్స్

ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉండటం

ఆర్థికంగా బలంగా ఉండటం

జనంలో.. జనం కోసం.. పేరుతో నిర్వహించిన కార్యక్రమం

అన్ని సామాజిక వర్గ నేతలతో నిర్వహించిన సమావేశాలు

ఎంవీవీ సత్యనారాయణ మైనస్ పాయింట్స్

నియోజకవర్గ ప్రజలతో పెద్దగా మమేకం కాకపోవడం

వంశీకృష్ణ యాదవ్ పార్టీని వీడటం

ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖ ఈస్ట్‌ బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

ఎంవీవీ సత్యనారాయణ VS వెలగపూడి రామకృష్ణ బాబు

ఇప్పటికిప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగి ఎంవీవీ సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు బరిలో నిలిస్తే.. మరోసారి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని బిగ్‌ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది. టీడీపీ అభ్యర్థి వెలగపూడికి ఏకంగా 54 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి 41 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఎమ్మెల్యేపై ఉన్న పాజిటివ్ ఇమేజ్, టీడీపీ, జనసేన పొత్తు కలసివస్తున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు పొత్తులో భాగంగా టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉంది. అదే సమయంలో యాదవ సామాజిక వర్గ ప్రజలు కూడా వంశీకృష్ణ కారణంగా టీడీపీవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఇక వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కూడా గట్టిగానే పోటీ ఇవ్వనున్నారు. ప్రస్తుత ఎంపీగా ఉండటం.. ఆర్థికంగా బలంగా ఉండటంతో ఆయన 41 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

.

.

Related News

Rain Alert: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Duvvada Srinivas Madhuri: అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

Ram Mohan Naidu: 3 రోజుల్లో 30 కి పైగా బెదిరింపులు.. విమానయాన శాఖ అలర్ట్.. ఇంతకు బెదిరింపులకు పాల్పడింది ఎవరంటే ?

CPI Narayana: బ్రాందీ షాపుకు వెళ్లిన సీపీఐ నారాయణ.. అసలు ఇలా చేస్తారని మీరు ఊహించరు కూడా..

Pawan Kalyan Tweet: ఆ ఒక్క ట్వీట్ తో పొలిటికల్ హీట్.. తమిళనాట భగ్గుమంటున్న రాజకీయం.. పవన్ ప్లాన్ ఇదేనా?

SAJJALA : సజ్జలను విచారించిన మంగళగిరి పోలీసులు, సజ్జల ఏమన్నారంటే ?

Mystery in Nallamala Forest: నల్లమలలో అదృశ్య శక్తి? యువకులే టార్గెట్.. అతడు ఏమయ్యాడు?

Big Stories

×