EPAPER

Rajanagaram Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. రాజానగరం ఎన్నికల్లో రారాజు ఎవరు..?

Rajanagaram Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. రాజానగరం ఎన్నికల్లో రారాజు ఎవరు..?
AP Political news

Rajanagaram Assembly Constituency Survey(AP news live): ఏపీలో రాజానగరానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. కోటలకు ఈ నగరం ప్రసిద్ధి. రాజకీయంగానూ ఈ సెగ్మెంట్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖపోరు కనిపించింది. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేసి రాజానగరంలో తమ అభ్యర్థినే నిలబెడుతామని ప్రకటన చేశారు. రాజోలు కూడా ప్రకటించారు. టీడీపీతో పొత్తులు ఉంటాయని చెబుతున్నా.. అంతకుముందే ఎవరికి వారే సీట్లు అనౌన్స్ చేయడం కీలకంగా మారుతోంది. మరి రాజానగరం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

జక్కంపూడి రాజా (వైసీపీ గెలుపు) VS పెందుర్తి వెంకటేశ్


2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరంలో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖపోరు నడిచింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జక్కంపూడి రాజాకు 51 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన ఘన విజయం సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేశ్‌కు 33 శాతం ఓట్లు, జనసేన అభ్యర్థి రాయపురెడ్డి చిన్నాకు 12 శాతం ఓట్లు వచ్చాయి. పెందుర్తి వెంకటేశ్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేయడం, సహజ వ్యతిరేకతతో ఓడిపోయారు. అదే సమయంలో జనసేన కూడా వేర్వేరుగా పోటీ చేయడం ఓట్ షేర్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఇటు జక్కంపూడి రాజా వేవ్, జగన్ వేవ్ కలిసి వచ్చి భారీ మార్జిన్‌తో గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో రాజానగరం సెగ్మెంట్‌లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Read More: Gopalapuram Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. గోపాలపురంలో గోల్ కొట్టేదెవరు ?

జక్కంపూడి రాజా ( YCP ) ప్లస్ పాయింట్స్

  • జక్కంపూడి కుటుంబం రాజకీయ వారసత్వం
  • జనానికి వెల్ఫేర్ స్కీంలు అందుతుండడం
  • విద్య, వైద్యం విషయంలో మౌలిక వసతులు మెరుగవడం
  • పెద్ద ఎత్తున జనానికి ఇళ్ల పట్టాల పంపిణీ

జక్కంపూడి రాజా మైనస్ పాయింట్స్

  • రాజా విషయంలో వైసీపీ క్యాడర్‌లో అసంతృప్తి
  • సెగ్మెంట్‌లో చాలా వరకు రోడ్లు డ్యామేజ్
  • సీతానగరం నుంచి రాజమండ్రి కనెక్టివిటీ రోడ్లు డ్యామేజ్
  • రోడ్లు నిర్మిస్తామన్న హామీ నెరవేరకపోవడం
  • స్వచ్ఛమైన తాగు నీరు గ్రామాలకు అందకపోవడం

బొడ్డు వెంకటరమణ చౌదరి ( TDP )చౌదరి ప్లస్ పాయింట్స్

  • పార్టీలో కీలక నేతగా గుర్తింపు

బొడ్డు వెంకటరమణ చౌదరి మైనస్ పాయింట్స్

  • స్థానికేతరుడు కావడం
  • జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీకి టిక్కెట్ దక్కే ఛాన్స్ లేకపోవడం
  • గ్రౌండ్ లో యాక్టివ్ గా లేకపోవడం
  • బత్తుల బలరామకృష్ణ (JSP) ప్లస్ పాయింట్స్
  • జనంలో పాజిటివ్ ఇమేజ్ పెంచుకోవడం
  • ప్రజల్లో గత ఐదేళ్లుగా నమ్మకం కలిగించడం
  • ప్రజా సమస్యల పరిష్కారంపై చొరవ చూపడం
  • ప్రజలకు అందుబాటులో ఉండడం
  • అవసరమైన వారికి ఆర్థిక సహాయాలు అందించడం
  • పెందుర్తి వెంకటేశ్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడం

ఇక వచ్చే ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

జక్కంపూడి రాజా VS బత్తుల బలరామకృష్ణ (జనసేన)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజానగరంలో జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు 53 శాతం ఓట్లు, వైసీపీకి 44 శాతం ఓట్లు, ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడం జనసేనకు ప్లస్ అవుతోంది. పవన్ పార్టీకి రాష్ట్రంలో ప్రాధాన్యం పెరగడం, బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై జనంలో నమ్మకం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తుండడం, రాజానగరంలోని టీడీపీ కీలక నేతలైన పెందుర్తి వెంకటేశ్, బొడ్డు వెంకటరమణ చౌదరి సపోర్ట్ ఇస్తుండడం జనసేన అభ్యర్థి గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో అభివృద్ధి సరిగా జరగకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం అధికార పార్టీ అభ్యర్థికి మైనస్ గా మారుతోందని జనం అభిప్రాయంగా తేలింది.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×