EPAPER

Kovvur Assembly Constituency : గరంగరంగా కొవ్వూరు రాజకీయం.. ఈ ఎన్నికల్లో కాబోయే కింగ్ ఎవరు ?

Kovvur Assembly Constituency : గరంగరంగా కొవ్వూరు రాజకీయం.. ఈ ఎన్నికల్లో కాబోయే కింగ్ ఎవరు ?
ap news today telugu

Kovvur Assembly Constituency(AP news today telugu):

ప్రముఖ గోష్పాద క్షేత్రం .. గోదారిని ఆనుకుని ఉండే కొవ్వూరులో రాజకీయం గరంగరంగా సాగుతోంది. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్థానం నుంచి ఆమెను తప్పించి.. పక్క నియోజకవర్గం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఇంఛార్జ్‌గా సీఎం జగన్ తెరపైకి తీసుకురావడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగలపూడి అనితను తప్పించి మరో అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించాలని చూస్తుండడంతో.. ఉభయగోదావరి జిల్లాల్లోనే హాట్‌సీట్‌గా మారింది కొవ్వూరు. ఈ నియోజకవర్గంలో మొదట్నుంచీ టీడీపీకి మంచి పట్టుంది. 1999లో కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ తప్ప 1983 నుంచి అక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది. అయితే ఈ సీన్ మార్చేలా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ సారి కూడా గెలిచి తమకు కంచుకోటగా మార్చుకోవాలని చూస్తోంది. మరి కొవ్వూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉంది.. వైసీపీ ప్లాన్ ఫలిస్తుందా.. మళ్లీ టీడీపీ జెండా ఎగురుతుందా.. తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

తానేటి వనిత VS వంగలపూడి అనిత


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత 52 శాతం ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత 36 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 12 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో కొవ్వూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

తలారి వెంకటరావు (YCP) ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ అనుభవం

వైసీపీ ప్రభుత్వ పథకాలు

తలారి వెంకటరావు మైనస్ పాయింట్స్

నియోజకవర్గానికి సడెన్ గా ఇంఛార్జ్ అవడం

హాస్పిటల్స్ లో సరైన వసతులు లేకపోవడం

ఈ సెగ్మెంట్ లో గుంతల రోడ్లతో ఇబ్బందులు

డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సమస్యలు

వనిత మంత్రిగా ఉన్నా సరైన అభివృద్ధి జరగకపోవడం

నిత్యవసరాల ధరలు పెరగడం

ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకపోవడం

కొత్తపల్లి జవహర్ (TDP) ప్లస్ పాయింట్స్

రాజకీయ అనుభవం

ఎవరికి టిక్కెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని ప్రకటించడం

కొత్తపల్లి జవహర్ మైనస్ పాయింట్స్

నియోజకవర్గ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండడం

గత ఎన్నికల్లో నియోజకవర్గం మారడం

ముప్పిడి వెంకటేశ్వరరావు టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండడం

ముప్పిడి వెంకటేశ్వరరావు (TDP) ప్లస్ పాయింట్స్

పూర్తిగా మద్ధతిస్తున్న టీడీపీ క్యాడర్

పార్టీ టికెట్ దక్కితే చేరేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ నేతలు

సామాజికవర్గ పరంగా కూడా కలిసొచ్చే అంశం

ప్రభుత్వ విధానాలపై పోరాడటం

ఎస్సీ వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా మద్ధతివ్వడం

ముప్పిడి వెంకటేశ్వరరావు మైనస్‌ పాయింట్స్‌

తొలిసారి కొవ్వూరు నుంచి పోటీకి ప్రయత్నిస్తుండడం

అధికార పార్టీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం

టీవీ రామారావు (JSP) ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ అనుభవం

2009లో కొవ్వూరులో గెలిచిన రామారావు

జనసేన క్యాడర్ ఫుల్ సపోర్ట్

టీవీ రామారావు మైనస్ పాయింట్స్

రామారావుపై గతంలో వేధింపుల కేసు

ఇక వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

తలారి వెంకటరావు VS కొత్తపల్లి జవహర్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొవ్వూరులో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కొత్తపల్లి జవహర్ పోటీ చేస్తే 51 శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 44 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు రానున్నాయి.

ఇక తలారి వెంకట్రావుతో ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం..

తలారి వెంకటరావు VS ముప్పిడి వెంకటేశ్వరరావు

తలారివెంకట్రావు, ముప్పిడి వెంకటేశ్వరరావు మధ్య పోటీ జరిగితే విజయం టీడీపీనే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ముప్పిడికి 53 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 42 శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఓ రకంగా చూస్తే జవహర్‌ కన్నా ముప్పిడి వెంకటేశ్వరరావుకే నియోజకవర్గంలో ఎక్కువ మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా టీడీపీ ఈ నియోజకవర్గంలో మళ్లీ జయకేతనం ఎగరవేసే ఛాన్స్ ఉంది. ఇక వైసీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణాలు చూస్తే.. మంత్రిగా ఉన్నప్పటికీ తానేటి వనిత నియోజకవర్గ అభివృద్ధి చేయలేకపోయారనే అభిప్రాయం జనంలో వ్యక్తమవుతోంది. అలాగే కొవ్వూరులో పెద్దగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా ప్రస్తుత పార్టీపై వ్యతిరేకత పెరగడానికి కారణంగా తేలింది. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా కీలకంగా మారబోతోంది. కాపు సామాజికవర్గం ఓట్లలో చాలా వరకు ఈ కూటమికే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో గోపాలపురం నుంచి వస్తున్న తలారి వెంకట్రావుకు ఇక్కడ యాక్సెస్ తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం నుంచి స్కీముల రూపంలో లబ్ది పొందుతున్న వారు ఆ పార్టీవైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.

.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×