EPAPER

Anantapur Urban Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. అనంతపురం అర్బన్ అధికారం ఇచ్చేదెవరికి ?

Anantapur Urban Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. అనంతపురం అర్బన్ అధికారం ఇచ్చేదెవరికి ?
Andhra pradesh today news

Anantapur Urban Assembly Constituency(Andhra pradesh today news):

రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లా అనంతపురం. ఒకప్పుడు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయితే గత ఎన్నికల్లో పసుపు హవా తగ్గి వైసీపీ జోరు కొనసాగింది. గతంలోనూ జిల్లా అంతా పసుపు జెండా రెపరెపలాడినా.. జిల్లా కేంద్రం అనంతపురంలో కాంగ్రెస్ హవాయే నడిచేది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ చేజిక్కించుకుంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు సార్లు గెలిచిన ఏకైక నేత గురునాథ రెడ్డి ఒక్కరే. అలాంటి స్థానంలో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అనంత వెంకట రామిరెడ్డి. తండ్రి అనంత వెంకటరెడ్డి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన అనంత వెంకట్రామిరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న నేత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అనంత గడ్డపై మరోసారి టీడీపీ జెండా పాతేందుకు వ్యూహాలు రెడీ చేసుకుంది. మరి మరోసారి గెలిచి వెంకట రామిరెడ్డి గురునాథ రెడ్డి రికార్డ్‌ను సమం చేస్తారా? లేక గత రికార్డులను తిరగరాస్తూ సైకిల్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందా? అనే అంశాలపై బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే నిర్వహించింది. అనంతపురంలో అసక్తికర రాజకీయ వివరాలను చూసే ముందు 2019 ఫలితాలను ఓ సారి పరిశీలిద్దాం.


2019 RESULTS

అనంత వెంకటరామిరెడ్డి (గెలుపు) VS వైకుంఠం ప్రభాకర్ చౌదరి


2019 ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి అనంత వెంకట రామిరెడ్డి. ఆయన ఏకంగా 54 శాతం ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి 36 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి వరకు ఎంపీగా పోటీ చేసిన వెంకట రామిరెడ్డి.. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగారు. ఆయనకు ఉన్న పర్సనల్ పాజిటివ్ ఇమేజ్‌కు తోడు వైసీపీ వేవ్‌ కూడా బాగా కలిసి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్‌ షేర్ తగ్గిపోవడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో తన ప్రభావం చూపగల జేసీ దివాకర్‌ రెడ్డి వర్గం ప్రభాకర చౌదరికి పూర్తి స్థాయిలో సహకరించలేదు. మరోవైపు జనసేన తరపున బరిలోకి దిగిన టీసీ వరుణ్‌ 7 శాతం ఓట్లను సాధించారు.

రాబోయే ఎన్నికల్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకట రామిరెడ్డి ప్లస్‌ అండ్ మైనస్‌ పాయింట్స్‌ ఏంటో చూద్దాం.

అనంత వెంకట రామిరెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్

గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించడం

వివాదాలకు దూరంగా ఉండటం

ఇవి అనంత వెంకట రామిరెడ్డి ప్లస్ పాయింట్స్ కాగా.. ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

అనంత వెంకట రామిరెడ్డి మైనస్‌ పాయింట్స్

వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య

సొంత వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు

ముస్లింలకే అధికా ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు

ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం

నియోజకవర్గ ప్రజలను వేధిస్తున్న రోడ్ల సమస్య

ప్రజలకు ఇబ్బందిగా మారిన డ్రైనేజీ సమస్య

ఇవి అనంత వెంకట రామిరెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇప్పుడు టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

వైకుంఠం ప్రభాకర్ చౌదరి (TDP) ప్లస్ పాయింట్స్

మొదటి నుంచి నియోజకవర్గాన్నే అంటి పెట్టుకొని ఉండటం

వరుసగా ఓడిపోతున్నారన్న సానుభూతి

ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్

పూర్తి స్థాయిలో సహకరిస్తున్న క్యాడర్

నిత్యం నేతలు, ప్రజలతో సమావేశమవుతుండటం

వైకుంఠం ప్రభాకర్ చౌదరి మైనస్‌ పాయింట్స్

జేసీ దివాకర్ రెడ్డి వర్గంతో ఉన్న విబేధాలు

జనసేన నేతకు టికెట్ దక్కుతుందన్న ప్రచారం

ఇక వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

అనంత వెంకట రామిరెడ్డి VS వైకుంఠం ప్రభాకర్ చౌదరి

ఇప్పటికిప్పుడు అనంతపురం అర్బన్‌లో ఎన్నికలు జరిగి టీడీపీ అభ్యర్థిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కితే… ఆయనకు 51 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అనంత వెంకట రామిరెడ్డికి కేవలం 44 శాతం ఓట్లు మాత్రమే దక్కి ఓటమి తప్పదని తెలుస్తోంది. అదే సమయంలో ఇతరులకు 5 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది.

వైకుంఠం ప్రభాకర చౌదరిపై ప్రజలకు ఉన్న పాజిటివ్ ఇమేజ్‌తో పాటు జనసేనతో ఉన్న పొత్తు కూడా కలిసి రానున్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది. సామాజిక వర్గాల పరంగా చూసుకున్న ఆయన అన్ని సామాజిక వర్గ నేతలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకు కలిసి రానుంది.

ఇక పర్సనల్ పాజిటివ్ ఇమేజ్‌తో అనంత వెంకట రామిరెడ్డి ఓట్లు సాధించుకున్నా నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం ఆయనకు వ్యతిరేకంగా మారనుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×