EPAPER

Gopalapuram Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. గోపాలపురంలో గోల్ కొట్టేదెవరు..?

Gopalapuram Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. గోపాలపురంలో గోల్ కొట్టేదెవరు..?

Gopalapuram Assembly Constituency: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోపాలపురం నియోజకవర్గం పొలిటికల్ ఈక్వేషన్స్ కీలకంగా మారుతున్నాయి. మినీ తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల ఈ నియోజకవర్గంలోనే ఉంది. దేవరపల్లి మండలంలో క్వారీలు, క్రషింగ్ యూనిట్లతో ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తుంటుంది. ఇది ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్. మరి ఈ దఫా గోపాలపురం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

తలారి వెంకటరావు VS ముప్పిడి వెంకటేశ్వరరావు


2019 ఎన్నికల్లో దర్శిలో వైసీపీ నుంచి తలారి వెంకటరావు పోటీ చేసి 56 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు దక్కాయి. 2014లో ఓడిన సానుభూతి 2019లో తలారి వెంకటరావుకు పని చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్ కూడా చాలా పని చేసింది. దీంతో టీడీపీకి ఓటమి తప్పలేదు. మరి ఈసారి ఎన్నికల్లో గోపాలపురం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

తానేటి వనిత (YCP) ప్లస్ పాయింట్స్

హోంమంత్రిగా జనంలో ఇమేజ్

గోపాలపురంలో స్కూల్స్ డెవలప్ అవడం

నల్లజెర్లలో జూనియర్ కాలేజ్ ఏర్పాటవడం

గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా గెలవడం

గోపాలపురంలో యాక్టివ్ గా ప్రచారాలు

Read More: Mandapeta Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. మండపేటలో టీడీపీ హవా కొనసాగేనా..?

తానేటి వనిత మైనస్ పాయింట్స్

సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీం అమలు కాకపోవడం

ఇల్లీగల్ గా మట్టి, ఇసుక తరలింపుతో సమస్య

అధ్వాన్నంగా దూబచెర్ల – ద్వారకా తిరుమల రోడ్డు

అన్ని మండలాల్లో బీటీ రోడ్లు అధ్వాన్నంగా మారడం

సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి అనుచరులు ఎంత వరకు సహకరిస్తారన్న డౌట్లు

మద్దిపాటి వెంకటరాజు (TDP) ప్లస్ పాయింట్స్

జనంలో ఇప్పుడిప్పుడే ఇమేజ్ పెంచుకోవడం

నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం

టీడీపీ కార్యక్రమాలను చేపట్టడం

టీడీపీ, జనసేన పొత్తు కలిసి వచ్చే ఛాన్స్

మద్దిపాటి వెంకటరాజు మైనస్ పాయింట్స్

మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నుంచి కనిపించని సపోర్ట్

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో పోలిస్తే అంత బలంగా లేకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

తానేటి వనిత VS మద్దిపాటి వెంకటరాజు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గోపాలపురంలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. కాస్త ఎడ్జ్ వైసీపీవైపే కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగే తానేటి వనితకు 49 శాతం ఓట్లు, టీడీపీకి 47 శాతం ఓట్లు, ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా గోపాలపురంలో స్వింగ్ ఓటర్లు కీలకం కాబోతున్నారు. వైసీపీ ఓట్ షేర్ కు కారణం తానేటి వనిత పర్సనల్ ఇమేజ్, అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్న వారు. అదే సమయంలో గోపాలపురం సెగ్మెంట్ అనుకున్నంతగా డెవలప్ కాకపోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ లో అధికార పార్టీ నేతలున్నారన్న ఆరోపణలు మైనస్ పాయింట్ గా మారుతున్నాయి. అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నిలబడుతున్న మద్దిపాటి వెంకటరాజుకు 13 శాతంగా ఉన్న కాపుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే 17 శాతంగా ఉన్న కమ్మ కమ్యూనిటీ కూడా అదనపు బలంగా ఉండబోతోంది. ఫైనల్ గా తటస్థ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు గోపాలపురంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కాబోతున్నారన్నది సర్వే రిపోర్ట్ సారాంశం.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×