EPAPER

Vijayawada West Assembly Constituency : విజయవాడ వెస్ట్‌లో విజయం ఎవరిది..? బిగ్ టీవీ సర్వే చెప్పిందిదే..?

Vijayawada West Assembly Constituency : విజయవాడ వెస్ట్‌లో విజయం ఎవరిది..? బిగ్ టీవీ సర్వే చెప్పిందిదే..?

Vijayawada West Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం బెజవాడది. అందులోనూ వాణిజ్యం, ఆధ్యాత్మికం నెలవై ఉన్న ప్రాంతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ వాడీ వేడీగానే ఉంటాయి. వ్యాపార కార్యకలాపాలతో ఏపీ బిజినెస్ క్యాపిటల్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాదు… కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉన్నది కూడా ఈ సెగ్మెంట్ లోనే. నాటి కమ్యూనిష్టుల నుంచి నేటి పాలకులక వరకూ ఎందరో హేమా హేమీ నేతలు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో ఇదే సెగ్మెంట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గంలో 1983 లో తప్ప టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో ఉంది. అదే సమయంలో మరోసారి ఈ నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లో ఎగిరేది వైసీపీ జెండానే అంటోది అధికార పక్షం. మరి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

వెల్లంపల్లి శ్రీనివాస్ VS షబ్నా ముస్రత్


YCP 38%
TDP 33%
JSP 15%
OTHERS 14%

2019 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. మొత్తం 38 శాతం ఓట్లు రాబట్టారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తె షబ్నా ముస్రత్ 33 శాతం ఓట్లు సాధించారు. తండ్రిపై జనంలో ఉన్న నెగెటివిటీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై పడింది. జలీల్ ఖాన్ పార్టీలు మారడం కూడా మైనస్ అయింది. అటు జనసేన నుంచి పోటీ చేసిన పోతిన మహేష్ 15 శాతం ఓట్లు రాబట్టారు. ఈ సెగ్మెంట్ లో నగర కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో ఆ ఓట్లను పోతిన మహేష్ బాగానే రాబట్టుకున్నారు. ఇతరులకు 14 శాతం ఓట్లు పోలయ్యాయి. మరి ఈసారి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

షేక్ ఆసిఫ్ (YCP)

షేక్ ఆసిఫ్ ప్లస్ పాయింట్స్

  • ముస్లిం సామాజికవర్గంలో మంచి పేరు
  • పార్టీలో యాక్టివ్ గా ఉండడం
  • పార్టీ కార్యక్రమాలైన గడప గడపకు పూర్తి చేయడం
  • కృష్ణానదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తవడం
  • ధోబీ ఘాట్స్ నిర్మాణం జరగడం
  • ఏళ్లకేళ్లు పెండింగ్ పడ్డ కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తవడం

షేక్ ఆసిఫ్ మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి కొరత
  • వాలంటీర్ వ్యవస్థ ఈ సెగ్మెంట్ లో సరిగా పని చేయకపోవడం
  • సిటీ పెరుగుతున్నా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం
  • అంతర్గత రోడ్లు చాలా వరకు దెబ్బతినడం

పోతిన మహేశ్ (JSP)

పోతిన మహేశ్ ప్లస్ పాయింట్స్

  • విజయవాడ వెస్ట్ సెగ్మెంట్ లో కీలక కార్యక్రమాలు
  • జనంలో మంచి పేరు తెచ్చుకున్న మహేశ్
  • కాపు, నగర సామాజికవర్గాల మద్దతు

పోతిన మహేశ్ మైనస్ పాయింట్స్

  • వైసీపీ అభ్యర్థిని ఏమేరకు ఢీకొంటారన్న డౌట్లు

టీడీపీ ఆశావహులు..
నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్

టీడీపీ ప్లస్ పాయింట్స్

  • విజయవాడ వెస్ట్ లో వరుసగా ఓడిపోతున్న సానుభూతి

టీడీపీ మైనస్ పాయింట్స్

  • టిక్కెట్ కు పోటీలో నలుగురు లీడర్లు ఉండడం
  • ఒకరికి ఇస్తే మిగితా వారు సహకరిస్తారా అన్న డౌట్లు
  • పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ ఇస్తే సహకరిస్తారా?

కుల సమీకరణాలు

ముస్లిం 15%
నాగర 12%
ఎస్సీ 15%
వైశ్య 10%
కాపు 10 %
గౌడ్ 7%

విజయవాడ వెస్ట్ లో ముస్లిం కమ్యూనిటీ జనాభా ఎక్కువగా ఉంది. ఇందులో 55 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు, 35 శాతం మంది టీడీపీకి, 10 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు నాగర కమ్యూనిటీలో 35 శాతం మంది జగన్ పార్టీకి, 60 శాతం మంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5 శాతం మంది ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. అటు ఎస్సీల్లో 55 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. వైశ్యుల్లో 50 శాతం వైసీపీకి, 45 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక కాపుల్లో 45 శాతం జగన్ పార్టీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. గౌడ్స్ లో వైసీపీ, టీడీపీకి చెరో 50 శాతం మద్దతదు ఇస్తామని సర్వేలో భాగంగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

షేక్ ఆసిఫ్ VS టీడీపీ

YCP 45%
TDP 39%
OTHERS 16%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి బరిలో షేక్ ఆసిఫ్ నిలబడితే ఆయనకు 45 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ నుంచి నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్ ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు పోటీకి దిగినా కేవలం 39 శాతం ఓట్లు మాత్రమే సాధించే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. ఒక్కరికే టిక్కెట్ వస్తుంది. మిగితా వారు సహకరిస్తారా లేదా అన్నది డౌట్ ఫుల్ గా ఉంది. ఇతరులు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి.

షేక్ ఆసిఫ్ VS పోతిన మహేశ్

YCP 43%
JSP 42%
OTHERS 15%

ఇక విజయవాడ వెస్ట్ లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పోతిన మహేశ్ బరిలో దిగితే వైసీపీ అభ్యర్థికి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక్కడ వైసీపీ 43 శాతం ఓట్లు రాబడితే, జనసేన అభ్యర్థి 42 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. అంటే ఫైటింగ్ నెక్ టూ నెక్ ఉడే ఛాన్స్ ఉంది. ఇతరులు 15 శాతం ఓట్లు సాధిస్తారని సర్వేలో తేలింది. పోతిన మహేశ్ ఈ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ అవుతున్నారు. ఎన్నికల నాటికి పరిణామాలు ఎలాగైనా మారొచ్చు.

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×