EPAPER
Kirrak Couples Episode 1

Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
Balakrishna latest news

Balakrishna latest news(Andhra pradesh political news today):

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఇరు పార్టీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన పొత్తు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన నేరస్థులు, హంతకుల చేతిలో ఉందని విమర్శించారు.


ఇన్ని సీట్లు.. అన్ని సీట్లు కాదు టీడీపీ-జనసేన గెలవాలని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను, పవన్‌ కల్యాణ్‌ ముక్కుసూటిగా మాట్లాడుతామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ పాలన ఇష్టారాజ్యంగా సాగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని కోరారు. రాష్ట్రంలో ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు. పాలన చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

హిందూపురం ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. రోగుల ఫిర్యాదుపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను నిలదీశారు. గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లను నిరుపయోగంగా పడేశారన్నారు. ఆరోగ్యశ్రీని నిలిపేస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులు అంటున్నాయన్నారు.కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం రూ.460 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు.


Related News

YS Sharmila: దీక్షలో వైఎస్ షర్మిల.. ప్లీజ్ రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్..

Pawan’s daughter declaration: వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు.. తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ డిక్లరేషన్

Fake FIR Incident: కర్నూల్‌లో జై భీం మూవీ సీన్ రిపీట్.. మరీ ఇంత దారుణమా..?

SIT probe temporarily stopped: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తు బ్రేక్ వెనుక.. అసలేం జరిగింది?

Waiting For Help: సీఎం గారూ.. నా కొడుకును బ్రతికించండి, ఓ తల్లి కన్నీటి వ్యథ

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Big Stories

×