EPAPER

Avanigadda YCP Simhadri: డాక్టర్ సింహాద్రి.. అవనిగడ్డ ఆపరేషన్ ఫెయిల్?

CM Jagan Headache Over Avanigadda YCP Simhadri: అభ్యర్దుల మార్పులు చేర్పుల ఎఫెక్ట్‌తో పలు సెగ్మెంట్లతో వైసిపీ నేతలు, కేడర్ తలలు పట్టుకుంటున్నారు.

Avanigadda YCP Simhadri: డాక్టర్ సింహాద్రి.. అవనిగడ్డ ఆపరేషన్ ఫెయిల్?
Avanigadda MLA Simhadri News

Avanigadda MLA Simhadri News(AP politics): అభ్యర్దుల మార్పులు చేర్పుల ఎఫెక్ట్‌తో పలు సెగ్మెంట్లతో వైసిపీ నేతలు, కేడర్ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల టికెట్ ఆశావహులు తిరుగుబాటు చేస్తూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నారు. ఇకొందరు మింగలేక, కక్కలేక కేటాయించిన సెగ్మెంట్లో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ డిఫరెంట్‌గా కనిపిస్తోంది. అక్కడ కొత్తగా వచ్చిన అభ్యర్థి తనకు సీటు వద్దు మహాప్రభో అంటుంటే పోటి చేయాల్సిందేనని బలవంతం చేస్తున్నారంట వైసీపీ అధినేత. ఆ బలవంతపు పెళ్లి చూస్తూ .. క్యాడర్ ఉన్న నేతని.. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదంటే?


సీట్ల మార్పు చేర్పుల వ్యవహారం వైసీపీలో ఇంటిపోరుకి దారితీస్తోంది. నియోజకవర్గాలు మార్చిన వారికి, అసలు టికెట్లే దక్కని వారికి పెద్దతలనొప్పిగా మారింది ఆ వ్యవహారం. అయితే క‌ృష్ణా జిల్లా అవనిగడ్డలో అభ్యర్థి మార్పు వైసీపీ పెద్దలనే ఆలోచనలో పడేలా చేస్తోందంట . అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం పార్లమెంట్ ఇన్చార్జ్‌గా మార్చింది వైసీపీ. అవనిగడ్డ ఇన్చార్జ్‌గా మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు హైదరాబాద్‌లో డాక్టర్‌గా స్థిరపడ్డ సింహాద్రి చంద్రశేఖర్‌ని ప్రకటించింది.

లిస్ట్‌లో చంద్రశేఖర్ పేరు చూసి సంతోషపడ్డ వైసీపీ క్యాడర్ నాలుగురోజుల్లోనే ఈ డాక్టర్ ఇచ్చిన షాక్‌తో డీలాపడిపోయింది. ఎన్నికల ప్రచారాల్లో తిరగడాలు, సమావేశాలు ఇవన్ని తన వల్ల కాదంటూ జగన్ ముందే బాంబు పేల్చారు సింహాద్రి చంద్రశేఖర్. కావాలంటే తన బదులు తన కొడుకు రామ్‌చరణ్ బాగా తిరుగుతాడని సిఫార్సు చేస్తూ అతనికి టికెట్ ఇవ్వండని ప్రతిపాదించడంతో జగనే అయోమయంలో పడ్డారట. ఎన్నో పార్టీలు సంప్రదించినా రాజకీయాల్లోకి ‌రాని సింహాద్రి చంద్రశేఖర్‌ను. జగన్ ఎలా ఒప్పించారో అని పెద్ద ఎత్తున చర్చ జరిగితే ఇప్పుడు చంద్రశేఖర్‌కు ఇష్టంలేకుండానే సీటు ప్రకటించారా? అన్న డిస్కషన్ మొదలైంది.


సింహాద్రి చంద్రశేఖర్ కి అవనిగడ్డలో మంచి పేరుంది. వృత్తిరీత్యా హైదరాబాదులో డాక్టర్‌గా స్థిరపడ్డా అవనిగడ్డ నుండి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకిస్తారని ఆయన అవనిగడ్డ వస్తే తానొక ప్రముఖ డాక్డర్ అన్న దర్పానికి పోకుండా అందరిలో కలివిడిగా ఉంటారన్న పేరుంది. తన తండ్రి మూడుసార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండా డాక్టర్ గానే స్ధిరపడిపోయారు చంద్రశేఖర్.

గత మూడు ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని బరిలో దింపాలని ప్రయత్నించినా పొలిటికల్ ఎంట్రీకి చంద్రశేఖర్ ఇష్టపడలేదు. అయితే ఈ సారి సింహాద్రి చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారు . దాంతో కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు ఉన్న సింహాద్రి కుటుంబం నుంచి వైసీపీ ఇద్ద‌రికి టికెట్లు ఇచ్చినట్లైంది. ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు హ‌యాంలలో మంత్రిగా ప‌నిచేసిన సింహాద్రి స‌త్య‌నారాయ‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సింహాద్రి ర‌మేష్‌బాబు అవ‌నిగ‌డ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్నిప్పుడు బందరు ఎంపీ అభ్యర్ధిగా షిఫ్ట్ చేసి సింహాద్రి స‌త్య‌నారాయ‌ణ కుమారుడు డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌ను తీసుకొచ్చించి ఆ పార్టీ.

అవ‌నిగ‌డ్డ అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ‌. సింహాద్రి కుటుంబం అదే సామాజిక‌వ‌ర్గం కావ‌డం, సింహాద్రి కుటుంబానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ఉన్న మంచి పేరు . పార్టీకి విజయాన్ని అందిస్తాయని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాల గురించి పట్టించుకోని చంద్రశేఖర్. అవనిగడ్డ వైసీపీగా ఎంట్రీ ఇవ్వడం అదికూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారనడాన్ని అక్కడి పార్టీ శ్రేణులే నమ్మలేకపోయాయి.

చంద్రశేఖర్‌కు మంచిపేరే ఉన్నా ఆయన తిరిగే పరిస్ధితి ఉంటుందా అని వైసీపీ నాయకులు అనుమానపడినట్టే. నాలుగురోజుల్లోనే చంద్రశేఖర్ తన కుమారుడితో సీఎంను కలిసి తాను తిరగలేని తెగేసి చెప్పేశారు. ఆయన తన కొడుకు రామ్‌చరణ్ పేరు ప్రతిపాదించడంతో ఊ అనాలో ఊహూ అనాలో అర్దంకాని జగన్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారంట. చంద్రశేఖర్ ఎందుకు రాజకీయాల్లో వచ్చినట్టు? ఎందుకు తన బదులు తన కుమారుడికి సీటు ఇవ్వమని అడుగుతు‌న్నారో తెలియక తికమకపడుతున్నాయి అవనిగడ్డ వైసీపీ శ్రేణులు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×