Arcelor Mittal-Japan’s Nippon: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది ఏపీ సర్కార్. మరో రెండేళ్లలో కంపెనీలు తమ ఉత్పత్తి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఓ వైపు మంత్రి లోకేష్ పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు సీఎం చంద్రబాబు అమరావతిలో ఉంటూ కంపెనీలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
లేటెస్ట్‌గా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది ఉక్కు కంపెనీ ఆర్సెలార్ మిట్టర్-జపాన్‌కు నిప్పన్ కంపెనీ. ఈ రెండు కంపెనీలు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో మంతనాలు చేస్తోంది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమేనంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇరుకంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే 2029 నాటికి ఉత్పత్తి తీసుకు రావాలన్నది ప్లాన్. కానీ ప్రభుత్వం మాత్రం ముందుగా ఉత్పత్తి మొదలుపెట్టాలని అంటోంది.
తొలి దశ పెట్టుబడి 70 వేల కోట్లు కాగా, రెండో దశలో మరో 70 వేల కోట్ల రూపాయలు పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఓవరాల్‌గా చూస్తే లక్షా 70 వేల కోట్ల రూపాయలన్నమాట. ఒకవిధంగా ఉత్తరాంధ్రకు ఊహించని బూస్ట్ అన్నమాట.
ALSO READ: టీటీడీ బోర్డులో జనసేన, బీజేపీ.. ముగ్గురు చొప్పున ఛాన్స్
ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉపాది కలుగుతుందని ప్రభుత్వ అంచనా. వారిపై ఆధారపడిన వారితో కలిపి పరిశ్రమ చుట్టుపక్కల 60 వేల మంది నివసించే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ముడి ఖనిజానికి ఢోకా లేదు.
ఛత్తీస్‌గడ్, ఒడిశా నుంచి ముడి ఖనిజాన్ని పైపు లైన్ల ద్వారా విశాఖ ప్లాంట్‌కు తీసుకొచ్చే అవకాశముంది. ఆ ముడి ఖనిజాన్ని వినియోగించుకునే అవకాశముందని అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. ఈ లెక్కన మరో ఉక్కు నగరం రూపుదిద్దుకోనుంది.
🚨 Massive investment into Andhra Pradesh.
Steel giants ArcelorMittal and Japan's Nippon Steel have proposed to invest a massive Rs 1,40,000 crore in 2 phases in Anakapalli, Andhra Pradesh. pic.twitter.com/3bxlByqeo5
— Indian Tech & Infra (@IndianTechGuide) October 31, 2024