EPAPER

Araku Valley Assembly Constituency : బిగ్ టివీ సర్వే.. అరకు ఓటర్లు పట్టం కట్టేది అతనికేనా..?

Araku Valley Assembly Constituency : బిగ్ టివీ సర్వే.. అరకు ఓటర్లు పట్టం కట్టేది అతనికేనా..?

Araku Valley Assembly Constituency : ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అల్లూరి జిల్లాలో టూరిజం స్పాట్ గా అరకు ఫేమస్. ఆంధ్రా ఒడిశా బార్డర్ లో ఈ సెగ్మెంట్ ఉంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాతో సరిహద్దులు పంచుకుంటోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో అరకు సెగ్మెంట్ ను ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 94 శాతం మంది ఎస్టీ జనాభానే ఉంది. అరకు సెగ్మెంట్ కు ఈసారి ఎంపీ గొడ్డేటి మాధవిని వైసీపీ ఇంఛార్జ్ గా నియమించడంతో టిక్కెట్ దాదాపు కన్ఫామ్ అయినట్లే. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెట్టి ఫాల్గుణ ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొర సియ్యారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమైంది. అరకు కదలిరా సభలో చంద్రబాబు దొన్నుదొర పేరును అధికారంగా ప్రకటించేశారు. మరి వచ్చే ఎన్నికల్లో అరకు ఓటరు నాడి ఎలా ఉండనుంది? మారిన సమీకరణాలు ఏ పార్టీకి ప్లస్ కానున్నాయి? బిగ్‌ టీవీ డీటెయిల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలిందో చూద్దాం.. అంతకు ముందు 2019 ఎన్నికల ఫలితాలు ఓసారి పరిశీలిద్దాం.


2019 ఎన్నికలు
చెట్టి ఫాల్గుణ vs దొన్ను దొర సియ్యారి

YCP 34%
TDP 13%
INDP 18%
OTH 35%

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 13 శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. అటు మొదటి నుంచి వైసీపీలో ఉండి, యాక్టివ్ గా పని చేసినా దొన్నుదొర సియ్యారికి 2014, 2019లో ఆ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. టీడీపీని దాటేసి… 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అరకు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతల్లో ఉన్నారు.మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం అరకు నియోజకవర్గంలో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పరిశీలిద్దాం…


చెట్టి ఫాల్గుణ ( YCP ) ప్లస్ పాయింట్స్

  • వైసీపీ ప్రభుత్వ పథకాలు అందరికీ చేర్చడం
  • గడప గడపకు ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పాల్గొనడం
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్

చెట్టి ఫాల్గుణ మైనస్ పాయింట్స్

  • ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం
  • ఫాల్గుణ సొంత కమ్యూనిటీ వాల్మీకి వర్గానికే ప్రాధాన్యమివ్వడం
  • అరకులో సొంత ఇమేజ్ పెంచుకోకపోవడం
  • యువతకు ఉపాధి లేకపోవడం

గొడ్డేటి మాధవి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • యువ నాయకురాలిగా ప్రజల్లో గుర్తింపు
  • నాన్ లోకల్ అయినా అరకులో యాక్టివ్ రోల్
  • ప్రజల్లోకి చొచ్చుకెళ్లే తత్వం
  • మాధవి తండ్రి రాజకీయ వారసత్వం

గొడ్డేటి మాధవి మైనస్ పాయింట్స్

  • నాన్ లోకల్ కావడంతో వైసీపీ క్యాడర్ గరంగరం
  • లోకల్ పార్టీ క్యాడర్ సహకరిస్తారా లేదా అని డౌట్
  • మాధవి భర్త నాన్ ట్రైబ్ కావడం

దొన్ను దొర సియ్యారి ( TDP ) ప్లస్ పాయింట్స్

  • అరకులో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు
  • టీడీపీలో చాలా యాక్టివ్ రోల్
  • అరకులో మీటింగ్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ లో కీలకం
  • తరచూ గ్రామాలు, మండలాల్లో పర్యటనలు
  • లోకేష్ కు సంఘీభావ పాదయాత్రను ఘనంగా నిర్వహించడం

దొన్ను దొర సియ్యారి మైనస్ పాయింట్స్

  • అరకులో టీడీపీ టిక్కెట్ ఆశావహులు ఎక్కువుండడం
  • అరకులో పర్సనల్ ఇమేజ్ కంటే పార్టీల వేవ్ ఎఫెక్ట్ ఉండడం

కులాల లెక్కలు..
కొండ దొర 36%
బగత 22%
వాల్మీకి 17%
కొటియా 8%
PVTG 10%

అభ్యర్థులు, పార్టీల వారీగా అరకులో వివిధ సామాజికవర్గాల అభిప్రాయం ఎలా ఉంది? బిగ్‌ టీవీ సర్వేలో వాళ్లు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. అరకు నియోజకవర్గంలో కొండ దొర సామాజిక వర్గం 36 శాతంతో డామినెంట్ గా ఉంది. ఈ సామాజికవర్గం ప్రజలు 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. అలాగే బగత సామాజికవర్గం ప్రజల్లో 60 శాతం వైసీపీకి, 30 శాతం తెలుగుదేశం పార్టీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు కీలకమైన వాల్మీకి కమ్యూనిటీలో 60 శాతం జగన్ పార్టీకి జై కొడుతుండగా, 25 శాతం టీడీపీకి, మరో 15 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక కోటియా సామాజికవర్గానికి చెందిన వారిలో కొందరు వైసీపీకి, ఇంకొందరు సీపీఎంకు మద్దతు పలుకుతున్నారు. ఇక ఇతర బలహీన గిరిజన సమూహాలకు చెందిన వారిలో 60 శాతం వైసీపీ, 30 శాతం టీడీపీ, 10 శాతం ఇతరులకు మద్దతు పలుకుతున్నారు.ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

గొడ్డేటి మాధవి VS దొన్నుదొర సియ్యారి
YCP 45%
TDP 37%
OTHERS 18%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా ఉన్న గొడ్డేటి మాధవి బరిలో దిగితే 45 శాతం ఓట్ షేర్ సాధించే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ లో తేలింది. అదే సమయంలో టీడీపీ నుంచి దొన్నుదొర సియ్యారి 37 శాతం ఓట్ షేర్ సాధించి పెడుతారన్నది ప్రజల అభిప్రాయంగా తేలింది. అయితే అరుకులో టిక్కెట్ ఆశించిన శ్రావణ్ సహా ఇతర నేతలు దొన్నుదొరకు సపోర్ట్ గా కదిలి వస్తే ఓట్ల శాతం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అరకులో నేతల మధ్య సయోధ్యను కుదర్చడంపైనే టీడీపీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్నది తాజా సమీకరణాలను బట్టి, జనం అభిప్రాయాలను బట్టి అర్థమవుతోంది. ఇతరులకు 18 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు వైసీపీ క్యాడర్ శ్రీదేవి అభ్యర్థిత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మారుస్తారా లేదా అన్నది కూడా కీలకమే.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×