EPAPER

APPSC Group-1 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూపు 1 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

APPSC Group-1 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూపు 1 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

APPSC Group 1 updates


APPSC Group 1 Hall Tickets Released: ఏపీపీఎస్సీ గ్రూపు 1 పరీక్షలకు అంతా సిద్ధమైంది. గ్రూపు-1 ప్రిలిమ్స్ సంబంధించిన హాల్ టికెట్ ను నేడు(2024 మార్చి 10న) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 హాల్ టికెట్ లను https://psc.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని.. అభ్యర్ధులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.

ఏపీపీఎస్సీ మార్చి 17 వ తేదీనా రెండు సెషన్ లలో నిర్వహించనున్నారు. గ్రూప్-1 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌కు స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 17న ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు (పేపర్-I) , కమిషన్ పేపర్ IIని మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల మధ్య 18 జిల్లా కేంద్రాలలో నిర్వహించనుంది.


గత ఏడాదితో  పోలిస్తే ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఏయే పోస్టులు ఖాళీగా  ఉన్నాయంటే..  డిప్యూటి కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 18, డీఎస్పీ 26, డిప్యూటి రిజిస్టార్ 5, ఆర్టీవో పోస్టులు 6, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ పోస్టులు 4, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైల్ల శాఖ సూపరింటెండెంట్1, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ 2 పోస్టులు 1, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 1, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 1 ఖాళీగా ఉన్నాయి. గ్రూపు-1 ప్రిలిమ్స్ ఎగ్జాన్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. 

గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష , మెయిన్ ఎక్జామినేషన్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 (జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు- 120 మార్కులు) పేపర్-2 జనరల్ ఆప్టిట్ యూడ్ 120 ప్రశ్నలు- 120 మార్కులు.) గ్రూపు -1 మెయిన్ పరీక్షలో 5 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కి 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవి పేపర్ -1 జనరల్,పేపర్-2 ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి. భౌగోళిక శాస్త్రం, పేపర్-3 పాలిటిక్స్, రాజ్యాంగం, ఎథిక్స్, లా, పేపర్-4 ఎకానమీ, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. పేపర్-5 పర్యావరణ సంబంధించిన అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మార్కులు ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వూ నిర్వహిస్తారు.

Tags

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×