EPAPER

APJAC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట.. కార్యాచరణ ఇదే..!

APJAC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట.. కార్యాచరణ ఇదే..!

APJAC : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమబాట పడుతున్నారు. ఉద్యమ కార్యాచరణను ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.


మార్చి 9, 10 తేదీల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. మార్చి 13, 14న కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఆందోళన చేపడతారు. మార్చి 15, 17, 20 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తారు. మార్చి 21 నుంచి వర్క్‌ రూల్‌ అమలు చేస్తారు. మార్చి 21 నుంచి సెల్‌ డౌన్‌ కార్యక్రమం చేపట్టి.. అన్ని ప్రభుత్వ యాప్‌లను బంద్‌ చేస్తారు. మార్చి 24న హెచ్ వోడీ కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగుతారు.

మార్చి 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఏప్రిల్ 1న .. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను, సమస్యల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఏప్రిల్ 3న స్పందనలో వినతి పత్రాలు అందిస్తారు. ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమయంలో మలిదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.


ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంత్రుల బృందంతో చాయ్‌ బిస్కెట్‌ చర్చలే జరిగాయి తప్ప వాటితో ఎలాంటి ఫలితం లేదన్నారు. ఫిబ్రవరి 13న సీఎస్‌కు 50 పేజీల వినతిపత్రం ఇచ్చామని బొప్పరాజు తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. చలో విజయవాడ నిర్వహించి ఏడాది గడిచినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు. జీతాలు సరిగా రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు సహకరించాలని కోరారు. ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Alekhya Reddy: కార్లలో నిద్రించిన రోజుల నుంచి.. నువ్వు ఒక వారియర్‌.. అలేఖ్య ఎమోషనల్‌ పోస్ట్‌

Tags

Related News

New Excise Policy: మందుబాబులకు భారీ శుభవార్త.. దసరా కానుకగా తక్కువ ధరకే.. రేట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Pawan Kalyan: వామ్మో రాజకీయాలలోనూ పవన్ కళ్యాణ్ ప్రపంచ రికార్డు ను సొంతం చేసుకున్నారుగా? దటీజ్ పవర్ స్టార్

Anchor Syamala: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

YS Jagan: వైవీకి జగన్ బిగ్ షాక్! ఏం జరుగుతుంది?

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Big Stories

×