EPAPER

YS Sharmila Debts: అన్నా.. చెల్లి.. ఓ అప్పు కథ

YS Sharmila Debts: అన్నా.. చెల్లి.. ఓ అప్పు కథ

Debt Issue Between YS Sharmila And CM Jagan Mohan Reddy: వైఎస్‌ఆర్ ఫ్యామిలీలో అసలు ముసలం ఎందుకు మొదలైంది..? షర్మిల, జగన్‌ మధ్య అసలు పంచాయితీ ఏంటి? ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన పులివెందుల చెల్లెమ్మ. ఈరోజు తాను జగనన్నకు వచ్చిన గుచ్చే బాణాన్ని అనేంతగా టోన్ ఎందుకు మారింది? ఇది నిన్నా, మొన్నటి వరకు అందరి మెదళ్లలో నలిగిన ప్రశ్న కానీ ఇప్పుడీ ప్రశ్నకు ఆన్సర్ అన్నట్టుగా ఓ విషయం తెరపైకి వచ్చింది. కాస్త క్లారిటీతో పాటు.. చాలా కన్‌ఫ్యూజన్‌ కూడా క్రియేట్ చేసింది. ఈ పంచాయితీ ఏంటో అర్థం కావాలంటే ముందు మీరు షర్మిల చేసిన ఓ స్టేట్‌మెంట్ వినాలి. కొందరు అన్నలు ఉంటారు అంటూ చెప్పకనే అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి అంతా చెప్పేశారు వైఎస్ షర్మిల అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆమె నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్
ఈ అఫిడవిట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం.


మొత్తం ఆస్తుల విలువ రూ. 182.82 కోట్లు. వీటిలో 82 కోట్ల 58 లక్షల 15 వేల రూపాయలు తన సోదరుడు సీఎం జగన్ కు వద్ద అప్పు తీసుకున్నారు. వదిన భారతీ రెడ్డి వద్ద 19 లక్షల 56 వేల 682 రూపాయల అప్పు. ఏడాదికి తన ఆదాయం 97 లక్షల 14 వేల 213 రూపాయలు. భర్త అనిల్‌ కుమార్ ఆదాయం 3 లక్షల 261 రూపాయలు. తనపై 8 కేసులు, వాటిల్లో ఒకటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. ఇవీ షర్మిల అఫిడవిట్ చెబుతున్న మెయిన్ డిటేయిల్స్. అన్న కోసం ఎంతో చేసిన షర్మిల.. సడెన్‌గా ఆయనతో ఎందుకు విభేదించింది. అనే దానికి ఆస్తి గొడవలే కారణమన్న ప్రచారం జరిగింది. అవును.. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఉన్నాయి షర్మిల వ్యాఖ్యలు. అన్నలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో చెప్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: పెమ్మసాని ఆస్తులు, రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి


అంటే అసలు పంచాయితీ ఈ ఆస్తుల గురించే అనేది అర్థమవుతుంది. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఇంకా ఇద్దరికి వాటాలు ఫైనల్ కాలేదు. వాటాలు ఇవ్వలేదనే కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని టాక్. పలు వ్యాపార సంస్థల్లో ఇద్దరికి వాటాలు ఉన్నా.. ఎక్కడా వాటి వివరాలు షర్మిల ఇవ్వలేదు. కానీ అన్న జగన్‌, వదిన భారతీ రెడ్డి దగ్గర తీసుకున్న అప్పు వివరాలను మాత్రం డిక్లేర్ చేశారు. అటు సీఎం జగన్‌ కూడా ఈ అప్పుల విషయాలను తన అఫిడవిట్‌లో ప్రస్తావించారు. 136 కోట్ల 15 లక్షల 54 వేల 339 రూపాయలను ఇతరులకు అప్పుగా ఇచ్చానన్నారు. సో ఇందులో షర్మిల చెప్తున్న 82 కోట్ల రూపాయలు కూడా ఉండే ఉంటాయి.

అయితే ఇక్కడో విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ అప్పులు 2019కు ముందు ఇచ్చినవా? తర్వాత ఇచ్చినవా? ఈ విషయంపై ఇద్దరి అఫిడవిట్లలో క్లారిటీ లేదు. ఈ విషయం తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది..ఇద్దరి మధ్యా విబేధాలు ఉన్నా కూడా షర్మిలకు జగన్ అంత అప్పు ఇచ్చినట్టు తెలుతుంది. లేదా ఇద్దరి మధ్య టర్మ్స్ బాగా ఉన్నప్పుడు జరిగిన ట్రాన్సక్షన్సా? అనేది తేలాలి. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి.

కానీ అప్పు ఇవ్వడం ఏంటి? అన్నది షర్మిల క్వశ్చన్.. కానీ ఆన్సర్ చెప్పాల్సిన షర్మిలనే తిరిగి క్వశ్చన్ వేయడం ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్‌ పాయింట్. తన తండ్రి సంపాదించిన ఆస్తిని జగన్‌ తనకు పంచి ఇవ్వడం లేదని చెప్పడం లేదు షర్మిల. లేదు ఇచ్చారని చెప్పడం లేదు. మరోవైపు జగన్‌ ఈ విషయంపై ఏం మాట్లాడటం లేదు.. మాట్లాడే అవకాశం కూడా కన్పించడం లేదు. సో విశ్లేషకులు, ప్రజల మెదళ్లకే పని చెప్తున్నారు షర్మిల. మొత్తానికి ఆమె వ్యాఖ్యలు, అఫిడవిట్ చూస్తుంటే.. ఆస్తి పంచాయతే ఆమెను అన్నకు దూరంగా నడిపించిందన్న విషయం అర్థమవుతుంది.

Related News

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

AP Govt on BigTV News: మద్యం ప్రియుల డిమాండ్స్‌తో ‘బిగ్ టీవీ’ కథనం.. కిక్కిచ్చే న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Rain Alert: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

Duvvada Srinivas Madhuri: అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?

Ram Mohan Naidu: 3 రోజుల్లో 30 కి పైగా బెదిరింపులు.. విమానయాన శాఖ అలర్ట్.. ఇంతకు బెదిరింపులకు పాల్పడింది ఎవరంటే ?

Big Stories

×