EPAPER

Deputy CM: రేపు కేంద్రం సమావేశం.. నేడు పవన్ తో భేటీ.. అసలేం జరుగుతోంది ?

Deputy CM: రేపు కేంద్రం సమావేశం.. నేడు పవన్ తో భేటీ.. అసలేం జరుగుతోంది ?

AP Deputy CM: కేంద్రం రేపు వారికి సంబంధించిన అంశం గురించే కీలక సమావేశం నిర్వహించబోతోంది. అయితే ఆ నేతలు మాత్రం ఒక్కసారిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పరుగులు తీశారు. తమ సమస్యలు విన్నవించుకున్నారు. కేంద్రంపై మీరే ఒత్తిడి తెండి.. మా సమస్యలు మీకు తెలుసు.. మీకు అవగాహన కూడా ఉంది.. ఇక మీదే భారం అనే రీతిలో ఆ నాయకులు మాట్లాడారు. ఇంతకు వీరు మాట్లాడిన అంశం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినదే.


వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. రేపు ఢిల్లీలో స్టీల్‌, ఆర్థిక శాఖల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు పవన్ దృష్టికి వారు తీసుకెళ్లిన సమస్యలకు సానుకూలంగా స్పందించారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ అంశం వార్తల్లో హైలెట్ గా నిలుస్తోంది. ప్రవేటీకరణ చేస్తున్నారన్న వాదన నేపథ్యంలో.. ముందు నుండి కార్మికుల నోట వ్యతిరేక పవనాలు వినిపిస్తున్నాయి.

అలాగే ఇటీవల ప్లాంటులో పనిచేస్తున్న 4200 మంది కాంట్రాక్టు కార్మికులను అన్యాయంగా తొలగించారని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అయితే స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన 48 గంటల్లోనే సెప్టెంబర్ 29న తిరిగి విధుల్లోకి తీసుకున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. అనవసరంగా కాంగ్రెస్ రాద్దాంతం చేస్తుందని, కార్మికుల మనసులో అపోహలు పుట్టించేలా పలు పార్టీల వ్యవహారం ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి.


Also Read: Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

కాగా రేపు ఢిల్లీలో స్టీల్, ఆర్థిక అంశాలపై సమావేశంను కేంద్రం నిర్వహిస్తుండగా.. ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చర్చ సాగుతుందన్నది పోరాట కమిటీ నేతల అభిప్రాయం. అయితే తమకు అనుకూలంగా చర్చ అనంతరం కేంద్రం ప్రకటన చేసేవిధంగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ ను నేతలు కోరినట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని విన్నవించిన వారు, స్టీల్‌ప్లాంట్‌ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడితేవాలని ఈ భేటీలో కోరారు.

ఈ అంశంపై చర్చించి సహకరిస్తానని, వారికి పవన్ సమాధానం ఇచ్చారట. ఏదిఏమైనా కార్మికుల్లో గల అభద్రతాభావాన్ని పోగొట్టేందుకు కేంద్రం తగిన ప్రకటన చేస్తే చాలంటూ పోరాట కమిటీ నేతలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్, ఇతర రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

Related News

Politics: ఔను వారిద్దరూ కలిశారు.. ఒకరేమో సీఎం.. మరొకరేమో మాజీ సీఎం.. భేటీ అందుకేనా ?

Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

AP Govt: రేపే వారి ఖాతాల్లో నగదు జమ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. చెక్ చేసుకోండి..

Crime: ఆహా ఏమి అందం.. ఏమి చందం.. లుక్ సూపర్.. కట్ చేస్తే మత్తు.. ప్రవేట్ వీడియోలు.. ఆ తర్వాత..?

Pawan Kalyan: మా కష్టాలు తీరేదెప్పుడు ? మా గతేంటి ? పవన్ కు నిరసన సెగ…!

Divvala Madhuri: నా రాజా డైట్ ప్లాన్ ఇదే.. రోజూ నైట్ ఇదే తింటారు

×