EPAPER
Kirrak Couples Episode 1

AP Protests | టెన్షన్‌లో జగన్ సర్కార్.. రాష్ట్రమంతా నిరసనలు

AP Protests | ఏపీలో అన్ని వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పుడు పట్టు బట్టితేనే పనులు పూర్తవుతాయనుకుంటున్నారు. అందుకే నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అంగన్వాడీలతో మొదలైన నిరసనల హోరు వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తల దాకా వెళ్లింది. ఓవైపు జగన్ సర్కార్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. ఇదే సమయంలో వరుస ఆందోళనలు పెను సవాళ్లుగా మారుతున్నాయి.

AP Protests | టెన్షన్‌లో జగన్ సర్కార్.. రాష్ట్రమంతా నిరసనలు

AP Protests | ఏపీలో అన్ని వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పుడు పట్టు బట్టితేనే పనులు పూర్తవుతాయనుకుంటున్నారు. అందుకే నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అంగన్వాడీలతో మొదలైన నిరసనల హోరు వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తల దాకా వెళ్లింది. ఓవైపు జగన్ సర్కార్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. ఇదే సమయంలో వరుస ఆందోళనలు పెను సవాళ్లుగా మారుతున్నాయి.


ఏపీలో జగన్ సర్కార్ కు సవాళ్ల మీద సవాళ్లు ఎదురవుతున్నాయి. వరుసగా నిరసనలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలకు తోడు వాలంటీర్లు రెడీ అవుతున్నారు. అటు మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. అటు ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కారు. దీంతో ఎన్నికలకు 3 నెలల ముందు వైసీపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. ఒకరి సమస్య పరిష్కరిస్తే ఇంకోటి ఇబ్బంది వస్తుంది. అలాగని తీర్చకుండా ఉండలేని సిచ్యువేషన్. బుజ్జగింపులతో నెట్టుకొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వేతనాలు పెంచుదామంటే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.

వేతనాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీలు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో రకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సీఎం జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు. కొందరు ఒంటికాలిపై నిరసన చేశారు. ఇంకొందరు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏమీ వినబడడం లేదు, కనబడడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.


జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఎంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారో, పెంచేది లేదని ప్రభుత్వం కూడా అంతే గట్టిగా చెబుతోంది. ఇక్కడే పీటముడి పడింది. చీటికీ మాటికీ జీతాలు పెంచాలనే డిమాండ్ ఏంటనేది ప్రభుత్వం వాదన. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో తమకు జీవనం గడవడంలేదనేది అంగన్వాడీల ఆవేదన. అవ్వాతాతలకిచ్చే పెన్షన్ ని ప్రభుత్వం 3వేల రూపాయలకు పెంచింది. ఆ నిష్పత్తిలో తమకు కూడా జీతాలు పెరగాలి కదా అని నిలదీస్తున్నారు అంగన్వాడీలు. ఇది సున్నిత సమస్య. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకుంటున్నారు అంగన్వాడీలు. అందుకే ఎన్నికల ఏడాదిలో అంగన్వాడీ ఉద్యోగులందరూ రోడ్డెక్కారు.

వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ పక్కన పెట్టారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వేతన పెంపు మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. అయితే గతంలో రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని అంగన్వాడీ సంఘాలు అంటున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని అంగన్వాడీలు కోరుతున్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నారు.

గత ప్రభుత్వాలకంటే తాము ఎక్కువగా ఇచ్చామని, అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చామనేది ప్రభుత్వం వాదన. గతం కంటే నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని, జీవనం కష్టంగా మారిందని.. అంగన్‌వాడీ వర్కర్లకు 26 వేలు, హెల్పర్లకు 20 వేలుగా జీతాలను పెంచాలనేది వారి ప్రధాన డిమాండ్. కనీసం మధ్యేమార్గమైనా చూడాలంటున్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టిందని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాలు ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.

ఇప్పటికే అంగన్వాడీల సమస్య తేల్చలేకపోతున్న జగన్ సర్కార్ కు పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగడం మరింతగా నష్టం చేకూరుస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఏపీ వ్యాప్తంగా సమ్మె సైరన్ మోగించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన సమ్మెచేస్తున్న పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేలకు పెంచాలన్నది పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్‌. వీటితో పాటే పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్‌, ఇంజినీరింగ్‌ కార్మికులకు వైద్య, ప్రమాద భృతి, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు 18,500 కనీస వేతనం, మున్సిపల్‌ ఆప్కాస్‌ ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్‌గా సగం జీతం, శాశ్వత సిబ్బందికి సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణ, విలీన పంచాయతీలలో సమస్యలు తీర్చాలంటున్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్‌ జీతాలు, వైద్య భృతి అమలు చేయాలంటున్నారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేయడంతో పని ఒత్తిడి పెరిగిందని కార్మికులు అంటున్నారు. పనికి తగిన వేతనం ఇవ్వడంలేదంటున్నారు. కార్మికుల సంఖ్యను పెంచడం లేదని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన పని ఒత్తిడికి తగిన విధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి 15 వేల వేతనం, ఎలవెన్స్ కింద 6 వేలు ఇస్తున్నారు.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×