EPAPER

AP Fake Votes: బోగస్ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం.. ఎవరు చెప్పేది నిజం?

AP Fake Votes: బోగస్ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం.. ఎవరు చెప్పేది నిజం?

AP Fake Votes: ఏపీలో బోగస్ ఓట్లపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. గత ఎన్నికల్లో ఇలాంటి దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని టీడీపీ, జనసేన ఫైర్ అవుతుంటే.. కలెక్టర్లు అన్ని ఓట్లను నిర్ధారించారని వైసీపీ అంటోంది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో పర్యటించడం, పార్టీలన్నీ తమ అభిప్రాయాలు సీఈసీ ముందుంచడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. మరోసారి బోగస్ ఓట్ల చుట్టూ రాజకీయం వేడెక్కింది.


ఏపీలో దొంగ ఓట్లు చాలా ఉన్నాయ్.. ఇదీ టీడీపీ – జనసేన వాదన. బోగస్ ఓట్లు లేనే లేవు.. ఇదీ వైసీపీ వాదన. ఒకరు దొంగ ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇంకొకరేమో లేనే లేవంటున్నారు. ఆల్ రెడీ కలెక్టర్లు ఓటర్ జాబితాపై ఈసీకి రిపోర్ట్ సమర్పించారంటున్నారు. మరి వైసీపీ చెబుతున్నది నిజమా.. లేదంటే టీడీపీ చెప్పే మాటల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందున్న మార్గమేంటి ? ఇలాంటివన్నీ ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారిపోయాయి.

దొంగ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం గరం గరం అవుతోంది. ఎన్నికల్లో ఇలాంటి ఓట్లతోనే వైసీపీ గెలవాలని చూస్తోందని టీడీపీ జనసేన అధినేతలు ఫైర్ అవుతున్నారు. కచ్చితంగా తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం విజయవాడలో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరుతూ అన్ని పార్టీలకు సమయం ఇచ్చింది. దీంతో వారంతా సీఈసీని కలిసి తమ తమ రిపోర్టులు, ఫిర్యాదులు అందజేశారు.


ముందుగా టీడీపీ, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిశారు. ఏపీలో ఇన్ని అక్రమాలు, అరాచకాలు తన రాజకీయ జీవితంలో చూడలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల విషయంలో తప్పులుంటే బీఎల్వోలపై చర్యలు తీసుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. టీడీపీ, జనసేన నేతలపై 7 వేల అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని.. ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, అవసరమైతే అక్రమాలపై కోర్టుకు కూడా వెళ్తామని చంద్రబాబు అంటున్నారు. సచివాలయ వాలంటీర్స్‌తో ఎన్నికలు నడపాలని వైసీపీ చూస్తోందన్నారు. అయితే ఎన్నికల విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమిషన్ మాట ఇచ్చిందన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని ఈసీ చెప్పిందన్నారు. మొత్తంగా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ తీసుకోవాల్సిన చర్యలు కచ్చితంగా తీసుకునేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఏపీలో చాలా వరకు దొంగ ఓట్లు చేర్చారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, 2 నెలల‌ ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని సీఈసీ బృందం హామీ ఇచ్చిందని పవన్ అంటున్నారు. ఎంత ఫెయిర్ గా పోలింగ్ జరిగితే అంత బెనిఫిట్ తమకు ఉంటుందని టీడీపీ, జనసేన లెక్కలు వేసుకుంటున్నాయి.

సీన్ కట్ చేస్తే సీఈసీ బృందాన్ని వైసీపీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, భరత్ కలిశారు. లోపలికి వెళ్తూనే పవన్ పార్టీపై కౌంటర్ ఎటాక్ కు దిగారు. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా ఆహ్వానించారని సీఈసీని అడిగామన్నారు విజయసాయి. జనసేనను బీజేపీ అలయెన్స్ పార్టీ కింద పరిగణించారని, అయితే టీడీపీతో అలయెన్స్ పార్టనర్ గా వచ్చారన్నారు. ఇలా అనుమతించడం సమంజసమేనా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగామన్నారు విజయసాయి రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇచ్చిన బోగస్ ఓట్లు ఫిర్యాదుపై కలెక్టర్లు దర్యాప్తు చేసి.. బోగస్ ఓట్లు లేవని ఈసీకి రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. అంతా కలిసి ఎలక్షన్ కమిషన్ టైం వేస్ట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని, దానిపై కౌంటర్ కంప్లైంట్ చేసింది వైసీపీ. తెలంగాణలో స్థిరపడ్డ వారిలో కొందరికి ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని అలా డుప్లికేషన్ ను తొలగించాలంటున్నారు. అంతే కాదు.. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్ పెట్టాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రెడ్ బుక్ విషయంపై డైలాగ్ లు పేలుస్తున్న లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఈసీకి వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు.

మొత్తంగా ఒకరు బోగస్ అంటే.. ఇంకొకరు.. డూప్లికేషన్ అంటున్నారు. సానుభూతిపరులైన తమ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ, టీడీపీ గరమవుతున్నాయి. బోగస్ ఓట్లు నిజంగానే ఏపీ ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తాయా అన్న చర్చ జరుగుతోంది.

.

.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×