Big Stories

Odisha Train Accident: 141మంది ఫోన్లు స్విచ్చాఫ్.. ఏపీలో టెన్షన్.. వాళ్లంతా సేఫేనా?

Jagan train

Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం. రెండు రైళ్లలో మృత్యుఘోష. 300 మంది వరకూ చనిపోయారు. వెయ్యి మంది వరకు క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో తమిళనాడు వాసులే ఎక్కువ. అయితే, ఆ రెండు రైళ్లలో తెలుగు ప్రయాణికులూ పెద్ద సంఖ్యలో ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. చనిపోయిన వారిలో మనవాళ్లెవరైనా ఉన్నారా? అనే ఆందోళన.

- Advertisement -

రైలు ప్రమాదం జరగ్గానే.. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రులు, అధికారులను ప్రమాద స్థలానికి పంపించారు సీఎం జగన్. క్షతగాత్రుల్లో కొందరిని ప్రత్యేక రైల్లో విశాఖ తీసుకొచ్చారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది తెలుగువాళ్లు ఉన్నారు? అందులో ఏపీ వాసులెంత మంది? వారు ప్రాణాలతో ఉన్నారా? అనే ఆతృత కొనసాగుతోంది.

- Advertisement -

తాజాగా ఆ రెండు రైల్లలో ప్రయాణించిన ఏపీ వాసుల గురించి రైల్వే శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 316 మంది ఏపీ ప్రయాణీకులు సేఫ్ అని ప్రకటించింది. మరో 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని తెలపడం ఆందోళనకు గురి చేస్తోంది.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన 267 మంది ప్రయాణికులు సేఫ్ అని కన్ఫామ్ చేసింది. గాయాలయిన వారిలో ఏపీ నుంచి 20 మంది ఉన్నారని తేల్చింది. ఇక, కోరమాండల్ ట్రైన్‌లో ప్రయాణించిన మరో 113 మంది ఏపీ వాసుల సమాచారం మాత్రం తెలీటం లేదని.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని తెలిపింది. విశాఖకు చెందిన 76 మంది, విజయవాడ నుంచి 28 మంది, రాజమహేంద్రవరం నుంచి 9 మంది ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. వారి ఆచూకీ కోసం రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అటు, యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఏపీకి చెందిన 49 ప్యాసింజర్లు సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది. విశాఖకు చెందిన ఓ ఇద్దరు పాక్షికంగా గాయపడినట్టు గుర్తించారు. ఓ 28 మంది ఆచూకీ లభించడం లేదని.. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఆ మొబైల్ ఫోన్లు ఏ లొకేషన్లో ఆగిపోయాయో వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే అధికారులు.

రెండు రైళ్లలో కలిపి ఏపీకి చెందిన మిస్సింగ్ ప్రయాణికులు 141 మంది ఉండగా.. వారి ఆచూకీ కనుగొనేందుకు రైల్వే శాఖతో కలిసి ఏపీ ప్రభుత్వం గాలింపు చేపట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News