EPAPER

Nara Lokesh: విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Nara Lokesh: విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Nara Lokesh latest news(Political news in AP): ప్రయివేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తెలిపారు. సాల్ట్ ప్రాజెక్టుపై శుక్రవారం పాఠశాల విద్యాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ సమీక్ష నిర్వహించారు.


నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేవలం కాగితాల్లో మాత్రమే చూపుతోందని అన్నారు. అదే నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారి సంఖ్య ప్రస్తుతం 2 లక్షలకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి.. మైరుగైన ఫలితాలు పొందడం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులకు సూచించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు. అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఎసె‌స్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. డిటిటలైడ్జ్ ఎసె‌స్మెంట్ మరింత సమర్థవంతంగా నిర్వహించి, ఆన్ లైన్‌లో అనుసంధానంపై దృష్టి సారించాలని ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ సంస్థను మంత్రి ఆదేశించారు.


Also Read: నాకు ఏ దిక్కూ లేక దువ్వాడకు దగ్గరయ్యా: మాధురి

టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనా పద్ధతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతే కాకుండా ఆయా ఎజెన్సీలు నిర్వహిస్తున్న ఎసె‌స్‌మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్ మీడియట్‌లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×