EPAPER
Kirrak Couples Episode 1

Venkatareddy arrest: హైదరాబాద్‌లో చిక్కిన గనులశాఖ మాజీ డైరెక్టర్, సాయంత్రం కోర్టుకి వెంకటరెడ్డి…

Venkatareddy arrest: హైదరాబాద్‌లో చిక్కిన గనులశాఖ మాజీ డైరెక్టర్, సాయంత్రం కోర్టుకి వెంకటరెడ్డి…

Venkatareddy arrest: వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు రెట్టింపు అవుతున్నాయా? వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు చంద్రబాబు సర్కార్‌కు లొంగిపోతున్నారా? అధికారులు లొంగిపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టేనా? వైసీపీ పాలనలో చక్రం తప్పిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంటకరెడ్డి ఎక్కడ చిక్కాడు? వీటిపై రాజకీయ నేతలు ఏమంటున్నారు?


వైసీపీ పాలనలో గనుల దోపిడీకి అన్నీ తానై వ్యవహరించిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్ట్ అయ్యాడు. గతరాత్రి హైదరాబాద్‌లో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. రాత్రికి రాత్రి ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. శుక్రవారం సాయంత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచనున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటరెడ్డి జాడ కనిపించలేదు. అప్పటి నుంచి ఆయనపై ఏసీబీ కన్నేసింది. ఒకానొక దశలో ఆయన విదేశాలకు పారిపోయాడనే వార్తలు లేకపోలేదు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం రాకుండా ఏసీబీ అడ్డుకుంది. మధ్యవర్తుల ద్వారా ఏసీబీతో ఆయన మంతనాలు సాగించినట్టు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అరెస్ట్ చేసినట్టు అంతర్గత సమాచారం.


 

అసలేం జరిగింది?

కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్రసర్వీసులకు చెందిన అధికారి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీకి డిప్యూటేషన్‌పై అడుగు పెట్టే శారాయన. గడిచిన ఐదేళ్లు ఇనుక, గనులు, ఖనిజం దోపిడీకి ఆయన సహకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం అంతర్గతంగా వేసిన విచారణలో అక్రమాలు నిజమేనని తేలింది. దీంతో ఆయనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ALSO READ: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

ఈలోగా గనుల వ్యవహారం కేసు ఏసీబీ వద్దకు వెళ్లింది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో అధికారులు గాలించారు కూడా. వెంకటరెడ్డి హయాంలో సాగించిన దోపిడీ అక్షరాలా 2500 కోట్ల రూపాయలంటూ వార్తలు వస్తున్నాయి.

వెంకటరెడ్డి చేసిన నిర్వాహకాలు అన్నీఇన్నీ కావు. ఇసుక, గనులు, ఖనిజం తవ్వకాల కోసం కొత్త విధానం తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో క్లోజ్ ఉన్నవారికే టెండర్లు దక్కేలా ఆయన చేసినట్టు ప్రధాన ఆరోపణ. ఇసుకను జేపీవీఎల్, ప్రతిమ సంస్థలకు అప్పగించారు. గనులను వైసీపీకి చెందిన ఓ కీలక నేతకు కేటాయించారట.

అంతేకాదు ఆయా శాఖలకు సంబంధించి వైసీపీకి మద్దతుగా ఉన్న అధికారులను నియమించుకుని దోపిడీకి పాల్పడ్డారు. మిగతా అధికారులను వేర్వేరు జిల్లాలకు ట్రాన్స్ ఫర్లు చేయించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు లేకపోలేదు. వెంకటరెడ్డి చిక్కడంతో వీటిపై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

SIT Inquiry: తిరుమల లడ్డు వివాదం.. రంగంలోకి దిగిన సిట్ టీమ్, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో?

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

AP Custodial Torture Case: చిక్కుల్లో మరో ఏపీ ఐపీఎస్.. రేపో మపో ఆయనకు..

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Big Stories

×