EPAPER

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

AP Liquor Policy: మహిళలు.. మహారాణులు.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నదే మహనీయుల లక్ష్యం. అందుకు తగ్గ రీతిలో మహిళలు నేటి కాలంలో అన్ని రంగాలలో రాణిస్తున్నారనే చెప్పవచ్చు. అయితే మద్యం మాట ఎత్తితే చాలు.. చాలా వరకు మహిళలు మా కుటుంబాలు బుగ్గి పాలవుతాయని అంటుంటారు. కానీ ఏపీ కొత్త మద్యం పాలసీ అమలులోకి తెచ్చేందుకు చేపట్టిన లాటరీలో మహిళలకు కూడా జాక్ పాట్ తగిలింది. ఇదొక వ్యాపార మార్గంగా చూస్తే ఆ మహిళలకు అదృష్టం వరించినట్లే.


ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అదే రీతిలో నూతన మద్యం విధానం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అంటే ఆయా జిల్లాలలో మొత్తం ఎన్ని వైన్ షాపులు ఏర్పాటు చేస్తారో ప్రకటన జారీ చేసి.. ప్రతి ఒక్క దరఖాస్తుకు రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపి.. దరఖాస్తులను స్వీకరించింది. దీనితో 3396 మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు రాగా.. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ముందుగా చెప్పినట్లుగా లాటరీ పద్దతి ప్రకారం నేడు షాపుల ఎంపిక ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ లాటరీ పద్దతిపై వైసీపీ నుండి పలు విమర్శలు వస్తుండగా.. వాటికి తావులేకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.

కాగా దరఖాస్తు చేసుకున్న వారి ముందు ఒక్కొక్క లాటరీ తీసి.. ఎన్నికల్లో విజేతను ప్రకటించినట్లుగా.. అధికారులు కూడా ఆ షాప్ లాటరీలో ఎవరికి వరించిందో వారి గట్టిగా చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గల 3,396 మద్యం షాపుల్లో మహిళలకు 345 షాపులు దక్కాయి.
దీనితో 10.2శాతం లిక్కర్‌ షాపుల లైసెన్సులు మహిళలకు దక్కినట్లు అధికారులు తెలుపుతున్నారు. విశాఖలో 31 మద్యం షాపులను మహిళలు అధిక సంఖ్యలో దక్కించుకోగా.. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు షాప్‌ దక్కింది. ఈ జిల్లాలలో మాత్రం పేర్లు పలికిన వెంటనే అందరూ షాక్ కు గురయ్యారు. దానికి కారణం ఎవరి పేరు తీసినా.. మహిళల పేర్లే. అదృష్టం అంటే వీరిదే.. అదే ఎన్ని దరఖాస్తులు వచ్చినా… అలా ఇలా కలియ తిప్పినా.. అక్కడ మహిళలకే అదృష్టం వరించింది.


ఎన్టీఆర్‌ జిల్లాలో కూడా మద్యం షాపుల కోసం లాటరీ నిర్వహించారు అధికారులు. ఇక్కడ జరిగిన లాటరీ పద్దతి ఎంపికలో ఏకంగా 16 మద్యం షాపులను మహిళలు దక్కించుకోవడం విశేషం. అంతేకాదు కృష్ణా జిల్లాలో ఏడు మద్యం షాపులను కూడా మహిళలే దక్కించుకున్నారు. దీనితో ఆ మహిళల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో 16 షాపులు మహిళలకు కైవసమయ్యాయి. కాగా.. లాటరీలో షాపులు దక్కని వారు సైలెంట్ అయ్యారు.

Also Read: Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

ఇలా బిజినెస్ రూపంలో ఆలోచించిన మహిళలు.. మద్యం వ్యాపారంలో కూడా ముందడుగు వేయగా.. వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుందాం అంటున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే ప్రకాశం జిల్లాలో మాత్రం ఓ వైపు లాటరీ పద్దతి సాగుతుండగా.. మరో వైపు మద్యం నూతన పాలసీని రద్దు చేయాలని నిరసన తెలపడం మరో విశేషం. చివరకు నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. చివరగా.. మద్యం షాపు దక్కించుకున్న మహిళలకు.. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం.. తప్పేముంది వ్యాపార మార్గంగా ఆలోచిస్తే చెప్పండి !

Related News

AP Liquor Policy: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

IAS PETITIONS IN CAT : క్యాట్​కు వెళ్లిన ఐఏఎస్​లు… ఏపీలోనే ఉంటానంటున్న సృజన, తెలంగాణ కావాలంటున్న ఆమ్రపాలి

CM Chandrababu: ఏపీలో మళ్లీ వర్షాలు…! జనాల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు…

Big Stories

×