EPAPER

AP Liquor Policy: ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్

AP Liquor Policy: ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్

AP Liquor Policy: ఏపీలో లిక్కర్ షాపుల లాటరీలో ఎవరిది పైచేయి అయ్యింది? షాపులను పెద్ద మొత్తంలో ఎవరు దక్కించుకున్నారు? సిండికేట్లు గ్రూపుగా ఏర్పడ్డారా? ఎవరితో సంబంధం లేని వారు ఈసారి మద్యం షాపులను దక్కించుకున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు మద్యం షాపుల లాటరీలో ఏం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..


ఏపీలో మద్యం షాపులకు మంగళవారం డ్రా తీశారు అధికారులు. లైసెన్సు దక్కించుకున్న వారి విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్మల్‌గా అయితే లిక్కర్ షాపు బిజినెస్‌లో ఉన్నవాళ్లు, సిండికేట్లు దరఖాస్తులు చేస్తారు. లాటరీ తగిలితే వాళ్లు నడుపుతుంటారు.

ఇదంతా రెగ్యులర్‌గా జరిగే వ్యవహారం. కానీ, ఈసారి లిక్కర్ వ్యాపారానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు వేశారు. లాటరీ లో వారికే అదృష్టం వరించింది. ఒక అప్లికేషన్ దరఖాస్తు చేస్తే రెండు లక్షలు డిపాజిట్ చేయాల్సివుంటుంది.


లిక్కర్‌తో ఏ మాత్రం సంబంధం లేని వారు కొన్నిచోట్లు 10 నుంచి 15 అప్లికేషన్ వేసినట్టు అంతర్గత సమాచారం. అలా వేసిన వారికి లాటరీలో ఛాన్స్ వరించింది. వారి లైసెన్సులను లిక్కర్ వ్యాపారం చేసినవాళ్లకి అద్దెకు ఇచ్చుకుంటారు. అందుకుగాను లైసెన్సుకు ఏరియాను బట్టి 50 లక్షల నుంచి కోటిన్నర వరకు చెల్లిస్తారట.

ALSO READ:  మత్తు స్ప్రే చల్లి.. న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌పై మరో కేసు నమోదు

అంతేకాదు వ్యాపారంలో పర్సెంటేజ్ చెల్లిస్తారని సమాచారం. ప్రతీనెల పర్సెంటేజ్‌ని చెల్లిస్తారట. పోతే డిపాజిట్ పోతుందని .. వస్తే కోటి వస్తుందని దరఖాస్తు వేశారట. ఈ విషయంలో చాలా మందికి పంట పడింది. రెగ్యులర్‌ వ్యాపారం చేసినవాళ్లు మాత్రం లబోదిబోమంటున్నారు.

తాము దరఖాస్తు వేసినా లాటరీ తగల్లేదని, బయట వ్యక్తులు అప్లికేషన్ వేయగానే తగలిందని అంటున్నారు. వారికి డబ్బులు ఇచ్చి లైసెస్సు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏమైతేనేం.. చివరకు మద్యం షాపులు మాత్రం సిండికేట్లకు చేరినట్టే?

 

Related News

Telangana High Court : హైకోర్టులోనూ ఐఏఎస్లకు చుక్కెదురు… అధికారులకు క్లాస్, ఏం చెప్పిందంటే ?

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం..

Tirupati: శవంతో సాహస యాత్ర! ప్రాణాలకు తెగించినా పట్టించుకోని అధికార యంత్రాంగం

Vizag Honey Trap Case: మత్తు స్ప్రే చల్లి.. న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌పై మరో కేసు నమోదు

AP TG Weather Updates: ఏపీకి తుపాను ముప్పు, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. బెంగుళూరు, చెన్నైలో కుండపోత

Skill Development Scam: స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు.. సీఎం చంద్ర‌బాబుకు ఈడీ క్లీన్ చిట్, కానీ..

Big Stories

×