EPAPER

AP IPS Officers Complaints on TDP, Janasena: టీడీపీ, బీజేపీ, జనసేనపై ఐపీఎస్‌లు ఫిర్యాదు.. ఏం జరిగింది..?

AP IPS Officers Complaints on TDP, Janasena: టీడీపీ, బీజేపీ, జనసేనపై ఐపీఎస్‌లు ఫిర్యాదు.. ఏం జరిగింది..?
AP IPS officers complaint to CEC on tdp bjp janasena for malicious propaganda
AP IPS officers complaint to CEC on tdp bjp janasena for malicious propaganda

AP IPS Officers Complaints on TDP, Janasena & BJP on Malicious Propaganda: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. ఇప్పటివరకు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యద్ధం జరగ్గా.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏపీలోకి 19మంది ఐపీఎస్ అధికారులు.


పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు ఐపీఎస్‌లు. ఈ మేరకు 19 మంది ఐపీఎస్ అధికారులు రాసిన లేఖను సీఈవో ముఖేష్‌కుమార్ మీనాకు అందజేశారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు తమపై మీడియాలో తప్పుడు కథనాలు చూపిస్తున్నారని పేర్కొన్నా రు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని, పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నార న్నది అందులో ప్రధాన పాయింట్. గడిచిన రెండునెలల్లో 30మంది ఐపీఎస్‌లు నష్టపోయారని రాసు కొచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

లేఖపై సంతకాలు చేసినవారిలో ఇటీవల ఎన్నికల సంఘం తొలగించిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో దాదాపు 144 మంది ఐపీఎస్‌లు ఉన్నట్లు ఓ అంచనా. అందులో ఆరుగుర్ని ఇటీవల ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. వారితో కలిపి దాదాపు 19 మంది ఐపీఎస్‌లు సీఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇకపై ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తెచ్చేందుకే ఈ లేఖ రాశారన్న అనుమానాలు లేకపోలేదు.


Also Read: వివేకా హత్య రోజు.. గంగిరెడ్డి ఆధారాలు.. అవినాష్‌ చూస్తూ.. మరి చంపిందెవరు?

2019 ఎన్నికల సమయంలో కడప, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం పక్కనపెట్టింది. అప్పుడు వీళ్లెవ్వరూ గగ్గోలు పెట్టలేదు. ఇతర ఐపీఎస్, ఐఏఎస్‌లు స్పందించలేదని మరికొందరు అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఐపీఎస్‌ల ఫిర్యాదుపై రాజకీయ నేతలు స్పందించారు. ఇదంతా వైసీపీ రాసిన స్క్రిప్టేనని, దాన్ని యథాతథాంగా ఈసీకి ఇచ్చారని అంటున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగనున్నాయి. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులు అధికారులపై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×